విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వివాదం: వినాయకుడికీ రావణుడికీ హెల్మెట్లు, బ్రాహ్మణుల ఆగ్రహం

వినాయకుడి ఫోటోలు, రావణుడి ఫోటోలతో పోలీసులు పలు చోట్ల హోర్డింగ్‌లు ఏర్పాటు చేశారు. వినూత్న ప్రచారం పేరుతో దేవుళ్ల ఫోటోలను ఇలా ఉపయోగించడం అపచారం అంటున్నారు.

By Oneindia Staff Writer
|
Google Oneindia TeluguNews

విజయవాడ: విజయవాడలో హెల్మెట్ ప్రచారం వివాదాస్పదమవుతోంది. వినాయకుడి ఫోటోలు, రావణుడి ఫోటోలతో పోలీసులు పలు చోట్ల హోర్డింగ్‌లు ఏర్పాటు చేశారు. దీనిపై బ్రాహ్మణ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వినూత్న ప్రచారం పేరుతో దేవుళ్ల ఫోటోలను ఇలా ఉపయోగించడం అపచారం అంటున్నారు.

హెల్మెట్ వినియోగంపై వినూత్న ప్రచారంతో ముందుకు వెళ్తున్నారు విజయవాడ సిటీ పోలీసులు. అయితే కొత్తదనం కాస్త కొందరిని ఆగ్రహానికి గురయ్యేలా చేస్తోంది. దేవుళ్ల పేరుతో ప్రచారం నిర్వహించడంపై బ్రాహ్మణ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వినాయకుడు, రావణుడి ఫోటోలతో నగరంలో పలు చోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన పోలీసులు హెల్మెట్ వినియోగంపై జనాల్లో చైతన్యం తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

Brahmins oppose helmet wearing at Viayawada

ఇటీవల కాలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హెల్మెట్ లేకపోవడం వల్లే ఎక్కువ మంది చనిపోతున్నారని గుర్తించిన అధికారులు నిబంధనలు అమలు చేయాలని నిర్ణయించారు.సుప్రీం కోర్టు సైతం స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో పోలీస్‌, రవాణాశాఖ అధికారులు నిద్రమత్తు వదిలించుకుని పోటీలు పడుతూ మరీ కేసులు నమోదు చేస్తున్నారు. అయితే కేసులతో పాటు జనాల్లో కూడా అవగాహన తీసుకువచ్చి అందరూ హెల్మెట్ ధరించేలా చేయాలని భావిస్తున్నారు.

వినాయకుడికి తల మార్పిడి చేశారు... అది మీకు సాధ్యం కాదు. రావణుడికి పది తలలు ఉన్నాయి మీకున్నది ఒకటే తల అందుకే హెల్మెట్ వినియోగించండి, సురక్షితంగా ఉండండి అంటూ విజయవాడ పోలీసులు నగరంలో పలుచోట్ల ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు ఏర్పాటు చేశారు.

ప్రచారం నిర్వహించడం మంచి ఆలోచనే అయితే వినూత్నం పేరుతో ఇలా దేవుళ్ల ఫోటోలు వినియోగించడం అపచారం అంటూ బ్రాహ్మణ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దేవుళ్ల ఫోటోలతో ఏర్పాటు చేసిన హోర్డింగ్‌లను వెంటనే తొలగించాలని బ్రాహ్మణసంఘాల ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు.

English summary
The cmpaign on helmet wearing at Vijayawada in Andhra Pradesh became controversy
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X