• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

స్ధానిక ఎన్నికల వాయిదాతో వైసీపీలో చేరికలకూ బ్రేక్.. మళ్లీ ఎప్పుడంటే...

|

ఏపీలో స్ధానిక ఎన్నికల పోరు వాయిదాతో వైసీపీ ఆపరేషన్ ఆకర్ష్ కు కూడా బ్రేక్ పడినట్లయింది. నిన్న మొన్నటి వరకూ వైసీపీలో చేరేందుకు తీవ్ర ప్రయత్నాలు చేసిన నేతలంతా ఇప్పుడు మొహం చాటేస్తున్నారు. మళ్లీ ఎన్నికలు జరినప్పుడు చూద్దాంలే అనే సమాధానం ఇస్తున్నారు. దీంతో వైసీపీ నేతలు కూడా కొంతకాలం పాటు ఆపరేషన్ ఆకర్ష్ ను వాయిదా వేసుకున్నట్లే కనిపిస్తోంది.

 స్ధానిక ఎన్నికలకు ముందు, తర్వాత...

స్ధానిక ఎన్నికలకు ముందు, తర్వాత...

ఏపీ స్ధానిక ఎన్నికల పోరుకు ముందు వైసీపీలో చేరేందుకు విపక్ష టీడీపీ, జనసేన, బీజేపీ నేతలెవరూ అంతగా ఇష్టపడలేదు. అప్పటి వరకూ ప్రభుత్వ విధానాల పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని భావిస్తూ వచ్చిన విపక్షాలకు ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత పరిస్దితి తెలిసివచ్చింది. స్ధానిక పోరులో సహజంగానే అధికార పార్టీకి ఉండే ఎడ్జ్ తో పాటు ఇతర సానుకూలతలను గ్రహించిన విపక్ష నేతలు వైసీపీలోకి క్యూ కట్టారు. ఓ దశలో దాదాపు పది మందికి పైగా మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఒకరివెంట ఒకరుగా సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చి కండువాలు కప్పేసుకున్నారు. దీంతో ఓ దశలో స్ధానిక పోరులో టీడీపీ, జనసేన వంటి పార్టీలు పూర్తిగా చేతులెత్తేసినట్లే కనిపించింది.

 ఎన్నికల పోరు వాయిదా పడ్డాక...

ఎన్నికల పోరు వాయిదా పడ్డాక...

స్ధానిక ఎన్నికల పోరు జరుగుతున్నంత సేపు ప్రతిరోజూ తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వలస నేతల హవా కొనసాగింది. ఎప్పుడైతే స్ధానిక ఎన్నికల ప్రక్రియ వాయిదా పడిందని తెలిసిందో విపక్ష నేతలు కూడా ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. అప్పటివరకూ అధికార వైసీపీ నేతల నుంచి ఎప్పుడు ఫోన్ వస్తుందో అని ఎదురుచూసిన నేతలంతా ఇప్పుడు వారు ఫోన్ చేసినా తీయడం లేదట. దీంతో చేసేది లేక వైసీపీ కూడా తమ ఆపరేషన్ ఆకర్ష్ కు తాత్కాలికంగా బ్రేక్ వేసేసింది. ఎన్నికల వాయిదా ప్రకటన రావడానికి కొద్ది గంటల ముందే టీడీపీకి చెందిన మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు వైసీపీలోకి వస్తారని తీవ్రంగా ప్రచారం జరిగినా ఆయన మాత్రం చివరి నిమిషంలో వచ్చిన సమాచారంతోనే ఆయన చేరకుండా సోదరులను మాత్రమే వైసీపీలోకి పంపినట్లు తెలుస్తోంది.

 వలస నేతల అప్రమత్తత...

వలస నేతల అప్రమత్తత...

వైసీపీలోకి ఫిరాయించేందుకు అప్పటివరకూ తీవ్ర ప్రయత్నాలు చేసిన పలువురు టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు తమ వ్యూహం మార్చుకోవడం వెనుక పలు కారణాలు కనిపిస్తున్నాయి. ఎన్నికల ప్రక్రియ మొదలైన తర్వాత వైసీపీ దాడుల భయంతోనో, స్ధానికంగా అధికారుల దాడులతోనో వైసీపీలోకి ఫిరాయిస్తే చాలని వారంతా భావించారు. కానీ స్ధానిక ఎన్నికల పోరు వాయిదా పడిన నేపథ్యంలో తమ వ్యాపారాలపై అధికారుల ఒత్తిళ్లతో పాటు వైసీపీ నేతల దాడులు కూడా నిలిచిపోయాయి. దీంతో వారికి ఒక్కసారిగా ఊరట దక్కినట్లయింది. కాబట్టి వెంటనే తమ వ్యూహాలను అమలు చేయాల్సిన అవసరం లేకుండా పోయింది.

  5 Minutes 10 Headlines || Coronavirus Updates || Madhya Pradesh Floor Test || Modi On COVID-19
   వైసీపీ ఆపరేషన్ బ్రేక్ వెనుక..

  వైసీపీ ఆపరేషన్ బ్రేక్ వెనుక..

  స్ధానిక ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయిన తరుణంలో జిల్లాల్లోని టీడీపీ నేతల నుంచి స్పందన తగ్గింది. అదే సమయంలో ఎన్నికల వాయిదా వ్యవహారాన్ని ఏదో ఒకటి తేల్చకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు. వీటితో పాటు మరికొన్ని అంశాలను దృష్టిలో ఉంచుకుని తాత్కాలికంగా తమ ఆపరేషన్ ఆకర్ష్ కు బ్రేక్ వేయాలని వైసీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. పార్టీ నేతలకూ ఈ మేరకు సందేశాలు వెళ్లాయి. ఓసారి ఎన్నికల ప్రక్రియ మొదలైతే విపక్షాల నుంచి మళ్లీ వలసల తాకిడి పెరుగుతుందని భావిస్తున్న వైసీపీ పెద్దలు.. అప్పటి వరకూ మౌనంగా ఉంటేనే మేలనే అంచనాకు వచ్చేశారు.

  English summary
  break for ysrcp's "operation akarsh" due to postponement of local polls
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more