తగాదాతో ఆగిన అంత్యక్రియలు: వధువు సజీవదహనం

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
హైదరాబాద్ నగరంలోని అంబర్‌పేటలో ఓ కారు బీభత్సం సృష్టించింది. గురువారం ఆగ్రా స్వీట్‌హౌస్ వద్ద ఓ కారు పాదాచారులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరికి గాయాలయ్యాయి. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన వ్యక్తిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.
వధువు సజీవ దహనం
తెల్లారితే పెళ్లి పీటల మీద కూర్చోవాల్సిన యువతి ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదంలో మరణించింది. దీంతో పెళ్లివారింట విషాదం చోటు చేసుకుంది. ఈ సంఘటన విశాఖపట్నం జిల్లాలోని భీముని పట్నం మండలం తాటితూరులో జరిగింది.
తాటితూరుకు చెందిన చిల్ల ఎర్రయ్యమ్మ (18) గురువారం ఉదంయ వంట చేసేందుకు పొయ్యి వెలిగిస్తుండగా నిప్పంటుకుంది. మంటలు శరీరమంతటికీ వ్యాపించడంతో ఆమె కేకలు వేసింది. కుటుంబ సభ్యులు మంటలు ఆర్పారు. బాధితురాలిని కెజిహెచ్‌కు తరలించారు చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం మరణించింది. శుక్రవారంనాడు ఆమె పెళ్లి జరగాల్సింది.












Click it and Unblock the Notifications