వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎంతో పోరాడా, లాభం లేకపోయింది, అందుకే: మోడీపై బాబు సంచలన వ్యాఖ్యలు

|
Google Oneindia TeluguNews

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్రంపై మరోసారి తన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన రోజు రోజుకు బీజేపీపై గొంతు పెంచుతున్నారు. తాజాగా శుక్రవారం మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Recommended Video

Chandra Babu Naidu Is The Only Reason..!

విభజన హామీల కోసం తాను ఎంతో పోరాడానని, లాభం లేకనే ఇక ఇప్పుడు గట్టిగా అడుగుతున్నానని వ్యాఖ్యానించారు. కష్టాలు ఉన్నాయని, కేంద్రం హామీలను అమలు చేసి సహకరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

షాకింగ్: 'బాబుపై మోడీకి ఆ కక్ష, ఇలా తీర్చుకుంటున్నారు, ఫ్యాక్షనిస్టులకు మరో రూపం'షాకింగ్: 'బాబుపై మోడీకి ఆ కక్ష, ఇలా తీర్చుకుంటున్నారు, ఫ్యాక్షనిస్టులకు మరో రూపం'

ప్రత్యేక హోదా-హామీలు మన హక్కు

ప్రత్యేక హోదా-హామీలు మన హక్కు

ప్రత్యేక హోదా - విభజన హామీలు మన హక్కు అని చంద్రబాబు అన్నారు. వాటిని అమలు చేయడం కేంద్రం బాధ్యత అని చెప్పారు. మనం విభజన హామీల కోసం ఓ వైపు పోరాడుతూనే మరోవైపు కష్టపడి పని చేసి అభివృద్ధికి పాటుపడదామన్నారు.

వెనుకడుగు వేసే ప్రసక్తి లేదు

వెనుకడుగు వేసే ప్రసక్తి లేదు

విభజన హక్కుల సాధనలో తాను వెనుకడుగు వేసే ప్రసక్తి లేదని చంద్రబాబు అన్నారు. ఈ నెల 27వ తేదీకి తాను రాజకీయాల్లోకి వచ్చి 40 ఏళ్లు అవుతుందని చంద్రబాబు చెప్పారు. పలుమార్లు ఢిల్లీ వెళ్లి హామీలను నెరవేర్చాలని అడిగానని చెప్పారు.

మహా సంగమం ఏర్పాటు చేస్తాం

మహా సంగమం ఏర్పాటు చేస్తాం

ఐదు నదులను అనుసంధానం చేసి మహా సంగమం ఏర్పాటు చేస్తామన్నారు. ఏపీలో ఈ ప్రగతి అకాడమిని నెలకొల్పుతామని చెప్పారు. ఏపీని ఇన్నోవేషన్ వ్యాలీగా తీర్చి దిద్దుతామని చెప్పారు. ఏపీ ఈ ప్రగతి కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడారు.

మా ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టే ప్రయత్నం

మా ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టే ప్రయత్నం

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని మంత్రి అచ్చెన్నాయుడు వేరుగా అన్నారు. వైసీపీ నేతలు తమ పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు. అధికారులపై విజయ సాయి రెడ్డి వ్యాఖ్యలు సరికాదన్నారు. అధికారులను బ్లాక్ మెయిల్ చేయడం జగన్ నైజం అన్నారు. జగన్ కారణంగా ఐఏఎశ్‌లు జైలుకు వెళ్లారన్నారు.

మేం పార్లమెంటులో పోరాడుతాం

మేం పార్లమెంటులో పోరాడుతాం

కేంద్రం ఏపీకి న్యాయం చేయకుంటే పార్లమెంటులో తాము గట్టిగా నిలదీస్తామని ఎంపీ తోట నర్సింహం అన్నారు. ఎన్నికలకు ఏడాది లోపు రాజీనామా చేస్తే ఉప ఎన్నికలు రావనే వైసీపీ ఏప్రీల్ నెలలో రాజీనామా అంటోందని మండిపడ్డారు. తాము పార్లమెంటులో ఉండి పోరాడుతామని చెప్పారు.

English summary
Andhra Pradesh Chief Minister N Chandrababu Naidu publicly demanded Special Category status for the state while hitting out at the Centre for not granting a special financial package.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X