వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాఖీ పండుగనాడు సోదరి విగ్రహాన్ని ఆవిష్కరించిన సోదరుడు; తనలా ఎవరికీ జరగొద్దని.. ఇదికదా ప్రేమంటే!!

|
Google Oneindia TeluguNews

దేశవ్యాప్తంగా ప్రజలందరూ సోదర, సోదరీమణుల మధ్య అనుబంధానికి ప్రతీకగా నిలిచే రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. రాఖీ పండుగ నాడు ప్రతి ఒక్కరూ తమ సోదరులకు రాఖీలు కడుతూ ఒకరికి ఒకరు అండగా ఉంటామని, ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమను వ్యక్తం చేశారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడకు చెందిన ఓ సోదరుడు మాత్రం తన సోదరి పై ఉన్న ప్రేమను ఆమె విగ్రహాన్ని ఆవిష్కరించడం ద్వారా వ్యక్తం చేశారు.

రాఖీ పండుగ నాడు సోదరి విగ్రహాన్ని ఆవిష్కరించిన సోదరుడు

రాఖీ పండుగ నాడు సోదరి విగ్రహాన్ని ఆవిష్కరించిన సోదరుడు

అన్నాచెల్లెళ్లకు, అక్కాతమ్ముళ్లకు మధ్యన ప్రేమానురాగాలకు ప్రతీకగా జరుపుకునే రాఖీ పండుగ నాడు, ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉంటే, తన సోదరి తనతో లేదన్న బాధను మరచి పోవడం కోసం, ప్రజలలో రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించడం కోసం ఓ సోదరుడు తన సోదరి విగ్రహాన్ని ఆవిష్కరించి, తద్వారా ప్రచారాన్ని నిర్వహిస్తున్నాడు. రాఖీ పండుగ నాడు చెల్లిని మరిచిపోలేక తన ఇంటి వద్ద ఆమె విగ్రహాన్ని ఆవిష్కరించిన అన్న సోదరి తనకు దూరమైన ఘటనను గుర్తు చేసుకొని ఆవేదన వ్యక్తం చేశాడు.

మరణం మనల్ని విడదీయొచ్చు కానీ, మన బంధాన్ని మాత్రం కాదన్న సోదరుడు

మరణం మనల్ని విడదీయొచ్చు కానీ, మన బంధాన్ని మాత్రం కాదన్న సోదరుడు


మరణం మనల్ని విడదీయొచ్చు కానీ, మన బంధాన్ని, మన ప్రేమను మాత్రం కాదు అంటూ సోదరిపై తనకున్న ప్రేమను చాటుకున్నాడు. ఇక ఇంటి ముందు, గ్రామంలో ఫ్లెక్సీ ఏర్పాటు చేసి ఆడపడుచులు అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కాకినాడ జిల్లాలో రోడ్డు ప్రమాదంలో మరణించిన తన సోదరి విగ్రహాన్ని తయారు చేయించి రాఖీ పండుగ సందర్భంగా ఆవిష్కరించిన తమ్ముడు, తన సోదరి మరణానికి గల కారణాన్ని తెలిపి, ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నాడు.

బైక్ పై వెళ్తుండగా చున్నీ చక్రంలో పడి క్రింద పడి మరణించిన సోదరి


శంఖవరం మండలం కత్తిపూడి గ్రామానికి చెందిన మణి బైక్ పై వెళ్తున్న క్రమంలో బైక్ ప్రమాదంలో మృతి చెందింది. బైక్ పై వెళ్తుండగా చున్ని బైక్ చక్రంలో ఇరుక్కొని కింద పడి పోయేయి ఆమె ప్రాణాలు విడిచింది. అయితే తన సోదరుడు తనకు జరిగిన విషాదం ఎవరికీ జరగకూడదని సోషల్ మీడియాలో తమ్ముడు రాజా పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నాడు. తనలాగా ఎవరు సోదరి ప్రేమకు దూరం కాకూడదని తను విజ్ఞప్తి చేస్తున్నాడు. ఈ క్రమంలోనే రాఖీ పండుగ సందర్భంగా తన సోదరి విగ్రహాన్ని ఊరంతా ఊరేగించి ఇంటి దగ్గర ఆవిష్కరించాడు. ఫ్లెక్సీలు కట్టి రోడ్డు ప్రమాదాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు.

Recommended Video

కింద స్థాయి ఉద్యోగులను సొంత వాళ్ళలా చూస్తున్న మోడీ *National | Telugu OneIndia
 సోదరిపై ప్రేమతో పాటు, ప్రయాణాల విషయంలో జాగ్రత్త అంటున్న సోదరుడు

సోదరిపై ప్రేమతో పాటు, ప్రయాణాల విషయంలో జాగ్రత్త అంటున్న సోదరుడు


తన సోదరిపై తనకున్న ప్రేమను చెబుతూ, తన లాంటి పరిస్థితి మరెవరికీ రాకుండా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నారు రాజా. సోదరి తనకు దూరమైన రోజులు గుర్తు చేసుకుని ఆవేదన వ్యక్తం చేసిన రాజా, శారీరకంగా తనకు సోదరి దూరమైనా, మానసికంగా తన మనసులో ఎప్పుడూ ఉంటుందని పేర్కొన్నారు. చక్కగా అలంకరించుకుని ఉన్న సోదరి విగ్రహాన్ని ఆవిష్కరించి, ఆ విగ్రహంలో తన సోదరిని చూసుకుని రాఖీ పండుగ నాడు మురిసిపోయాడు సదరు సోదరుడు. ఇక ఇది చూసినవారంతా ఇది కదా నిజమైన ప్రేమ అంటే అంటూ సోదరి విగ్రహం పెట్టిన రాజా ప్రేమను కొనియాడుతున్నారు. మానవ సంబంధాలకు, అనుబంధాలకు అద్దం పడుతున్న ఘటన అని చెప్పుకుంటున్నారు.

English summary
A brother from Kakinada unveiled a statue of his sister on Rakhi festival. He lost his sister in a road accident, so, that he is campaigning to be careful about road accidents.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X