వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమరావతి విశ్వవిద్యాలయానికి "అమృతం" లాంటి ఆకృతి

|
Google Oneindia TeluguNews

అమరావతి: అమరావతిలో కొలువు దీరనున్న అమృత విశ్వవిద్యాలయం ఆకృతులు చూపరులను మంత్రముగ్ధుల్ని చేశాయి. ఆధునికతకు ఆధ్యాత్మికతను మేళవించడంతో పాటు స్థానికతను జోడించి రూపొందించిన ఈ ఆకృతులు అందరి నుంచి అథ్భుత: అనే ప్రశంసలు అందుకొంటోంది.

దేశంలోని సుప్రసిద్ధ విద్యాలయాల్లో ఒకటైన అమృత విశ్వవిద్యాలయం అమరావతిలో నెలకొల్పబోతున్న క్యాంపస్‌ ఆకృతులు ఆధునికత- సృజనాత్మకత లతో పాటు ఆధ్యాత్మికత-స్థానికతల మేలికలయికగా రూపుదిద్దుకున్నాయి. ఇలా వీటన్నింటిని ఒకే డిజైన్ లో ఇంత అందంగా పొందుపరచడంపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తున్నాయి.

 అమృత...ఆకృతి...అథ్భుత:

అమృత...ఆకృతి...అథ్భుత:

సీఆర్డీఏ కార్యకలాపాలపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బుధవారం విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ‘అమృత' ప్రతినిధులు తమ డిజైన్లతో కూడిన పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ను ప్రదర్శించారు. సీఎం సహా ఆ సమావేశంలో పాల్గొన్న వారందరూ ఆ డిజైన్లను చూసి మంత్రముగ్థులయ్యారు...ఆ తర్వాత తేరుకొని ప్రశంసల జల్లు కురిపించారు.

 అమృత...గ్రేట్ బ్యాక్ గ్రౌండ్...

అమృత...గ్రేట్ బ్యాక్ గ్రౌండ్...

అమృత యూనివర్శిటీ గొప్పతనం ఇది...దేశంలోని ప్రైవేట్‌ యూనివర్సిటీల్లో నంబర్వన్ స్థానంలో, అన్ని యూనివర్సిటీల్లో 9వ అత్యుత్తమైనదిగా, ఆసియా ఖండం బెస్ట్‌ యూనివర్సిటీల్లో 168గా పేరొందిన అమృత సంస్థకు దేశంలోని అమృతపురి, కోయంబత్తూరు, కొచ్చిన్‌, బెంగుళూరు, న్యూఢిల్లీలలో ఇప్పటికే 5 క్యాంపస్ ఉన్నాయి.

 అమృతకు...ఎపి సహకారం...

అమృతకు...ఎపి సహకారం...

అలాంటి ప్రతిష్టాత్మక యూనివర్శిటీ 6వ ప్రాంగణాన్ని అమరావతిలో నెలకొల్పేందుకు వీలుగా ఎపి ప్రభుత్వం 200 ఎకరాలను కేటాయించింది. ఇందులో ఫిభ్రవరి మొదటి వారంలో నిర్మాణపనులకు శంకుస్థాపన జరపాలని, ఆగస్టులో నిర్మాణ కార్యక్రమాలను ప్రారంభించాలన్నది ఈ సంస్థ లక్ష్యంగా తెలిసింది. 20 వేల మంది విద్యార్థులు చదువుకునేందుకు వీలుగా ఈ క్యాంపస్ లనిర్మాణం జరగనున్నట్లు సమాచారం.

 విద్యా, వైద్య సేవలు...

విద్యా, వైద్య సేవలు...

మంగళగిరి నుంచి సుమారు 5 కిలోమీటర్ల దూరంలో, నవులూరుకు సమీపంలో ఈ అమృత అమరావతి యూనివర్శిటీ క్యాంపస్‌ ఏర్పాటు కానుంది. ఇందులో అత్యాధునికమైన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్తో సహా మెడికల్‌ విద్యా,వైద్యసంస్థలు మరియు ఇంజినీరింగ్‌ సంస్థలను కూడా నెలకొల్పనున్నట్లు తెలిసింది.

English summary
Amrita university has released designs for the new university campus , to be constructed in the AP state's capital of Amaravati.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X