వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బ్రస్సెల్ పేలుళ్లు: తృటిలో తప్పించుకున్న బెజవాడ విద్యార్థి, గుండె బద్దలు (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

బ్రస్సెల్: బెల్జియం రాజధాని బ్రస్సెల్‌లో ఐసిస్ ఉగ్రవాదులు జరిపిన బాంబు పేలుళ్లలో... విజయవాడకు చెందిన ఓ విద్యార్థి తృటిలో తప్పించుకున్నాడు. తప్పించుకున్న ఆ యువకుడి పేరు నాగశ్రవణ్. అతని వయస్సు 22 ఏళ్లు.

అతను ప్రస్తుతం పన్నెండు రోజుల స్టడీ ట్రిప్ నిమిత్తం బ్రస్సెల్‌‍లో ఉంటున్నాడు. విమానాశ్రయంలో రెండు పేలుళ్లు జరగగా, మాల్‌బీక్ మెట్రో స్టేషన్లో ఓ పేలుడు సంభవించింది. మెట్రో స్టేషన్లో పేలుడు సంభవించిన సమయంలో నాగశ్రవణ్.. ఘటన జరిగిన ప్రాంతానికి కేవలం 500 మీటర్ల దూరంలో ఉన్నాడు.

పేలుడుకు కొద్ది నిమిషాల ముందే అతను మెట్రో స్టేషన్ సబ్ వేను దాటుకొని వెళ్లాడు. పేలుడు జరగగానే, తన పేరెంట్స్ భయపడతారని భావించి, వెంటనే కుటుంబ సభ్యులకు ఫోన్ చేశాడు. తాను క్షేమంగా ఉన్నానని చెప్పాడు. తాను మెట్రో స్టేషన్ నుంచి వెళ్లిన కాసేపట్లోనే పేలుడు సంభవించిందని చెప్పాడు. ప్రస్తుతం ఎక్కడ చూసినా భారీ బందోబస్తు ఉందని చెప్పాడు. మొత్తం బ్రస్సెల్ నగరాన్ని పోలీసులు చుట్టుముట్టారని చెప్పారు.

బ్రస్సెల్‌పై ఉగ్రదాడి

బ్రస్సెల్‌పై ఉగ్రదాడి

బ్రస్సెల్లో దాడి నేపథ్యంలో విమానాశ్రయం నుంచి ప్రయాణికులను అధికారులు ఖాళీ చేయించారు. రవాణా సర్వీసులను నిలిపివేశారు. మెట్రో స్టేషన్లను మూసివేశారు. పలు రైళ్లను దారి మళ్లించారు. ఈ ఘటనలో మొత్తం 35 మంది చనిపోయారు.

బ్రస్సెల్‌పై ఉగ్రదాడి

బ్రస్సెల్‌పై ఉగ్రదాడి

బ్రసెల్స్ విమానాశ్రయంలో జరిగిన పేలుళ్లతో దిగ్భ్రాంతికి గురయ్యానని బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరూన్ పేర్కొన్నారు. బెల్జియంకు అవసరమైన సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నాడు. బ్రసెల్స్ ఎయిర్‌పోర్టులో జరిగిన పేలుళ్ల ఘటనలో భారతీయులు ఎవరూ గాయపడలేదని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.

బ్రస్సెల్‌పై ఉగ్రదాడి

బ్రస్సెల్‌పై ఉగ్రదాడి

మొత్తం ఐరోపా ఖండానికే రాజధానిగా భాసిల్లే బ్రస్సెల్స్ మంగళవారం వణికిపోయింది. ఉదయం విధులకు హాజరయ్యే హడావుడిలో ఉన్న నగరవాసులు ఒక్కసారిగా విరుచుకుపడిన ఐఎస్ ఉగ్రభూతపు కరాళ నృత్యానికి కకావికలయ్యారు.

బ్రస్సెల్‌పై ఉగ్రదాడి

బ్రస్సెల్‌పై ఉగ్రదాడి

ఈ దాడులకు పాల్పడినట్టు అనుమానిస్తున్నముగ్గురి సీసీ కెమెరా ఫొటోలను బెల్జియం ఫెడరల్ పోలీసులు విడుదల చేశారు. వీరిలో ఇద్దరు ఎయిర్‌పోర్టులో హతమైనట్టు భావిస్తున్నారు. మరొకడి ఆచూకీ తెలియడం లేదు.

బ్రస్సెల్‌పై ఉగ్రదాడి

బ్రస్సెల్‌పై ఉగ్రదాడి

పేలుళ్ల అనంతరం పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో ఒక పేలని బాంబు, ఐఎస్ జెండా లభించాయి. పారిస్ దాడుల కీలక సూత్రధారి అబ్దెస్లాం అరెస్టయిన నాలుగు విమానాశ్రయంలోని ప్రధాన హాలులో రెండు భారీ పేలుళ్లు జరిగాయి. ఇందులో ఒకటి ఆత్మాహుతి పేలుడుగా భావిస్తున్నారు.

 బ్రస్సెల్‌పై ఉగ్రదాడి

బ్రస్సెల్‌పై ఉగ్రదాడి

అరగంట వ్యవధిలో నగరంలోని భూగర్భ సిటీ మెట్రో స్టేషన్ మాల్‌బీక్‌లో ఒక రైల్లో పేలుడు చోటు చేసుకుంది. ఈ మెట్రో స్టేషన్ యూరోపియన్ యూనియన్ (ఈయూ) ప్రధాన కార్యాలయానికి అత్యంత సమీపంలో ఉంటుంది. మృతుల్లో ఒక ఆత్మాహుతి దళ సభ్యుడు కూడా ఉండి ఉంటాడని భావిస్తున్నారు.

 బ్రస్సెల్‌పై ఉగ్రదాడి

బ్రస్సెల్‌పై ఉగ్రదాడి

మెట్రో స్టేషన్ వద్ద గాయపడినవారిలో జెట్ ఎయిర్‌వేస్‌కు చెందిన ఇద్దరు భారతీయ సిబ్బంది కూడా ఉన్నారు. ప్రస్తుతం బ్రస్సెల్స్‌లో ఉన్న తమ విమానంలోని ప్రయాణికులను సురక్షిత ప్రాంతాలకు తరలించి, పూర్తి వసతి సదుపాయాలు కల్పించామని జెట్ ఎయిర్‌వేస్ ఒక ప్రకటనలో తెలిపింది.

 బ్రస్సెల్‌పై ఉగ్రదాడి

బ్రస్సెల్‌పై ఉగ్రదాడి

దాడి నేపథ్యంలో దట్టమైన పొగ అలుముకోవటంతో విమానాశ్రయంలోని ప్రయాణికులు తీవ్రభయాందోళనతో తలోవైపు పరుగు తీశారు. పేలుడు తీవ్రతకు గాయపడిన పలువురి కాళ్లు, చేతులు తెగిపోయాయి. వారు రక్తపు మడుగులో కూలబడిపోయారు.

బ్రస్సెల్‌పై ఉగ్రదాడి

బ్రస్సెల్‌పై ఉగ్రదాడి

ఓ వ్యక్తి అరబిక్ భాషలో బిగ్గరగా అరిచాడని, ఆ తర్వాత భారీ పేలుడు సంభవించిందని విమానాశ్రయం లగేజీ భద్రతా విభాగం అధికారి అల్ఫోన్సా తెలిపారు. గాయాలపాలైన వారిలో చాలామంది కాళ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయని, దీనిని బట్టి.. పేలుడు పదార్థాలను నేలమీద ఏదైనా ఒక బ్యాగులో పెట్టి ఉంటారని భావిస్తున్నారు.

బ్రస్సెల్‌పై ఉగ్రదాడి

బ్రస్సెల్‌పై ఉగ్రదాడి

విమానాశ్రయంలో రెండు పేలుళ్ల సంభవించగా, ఈయూ ప్రధానకార్యాలయ భవనాల సమీపంలోని మాల్‌బీక్‌ భూగర్భ మెట్రో స్టేషన్‌లో మూడోపేలుడు జరిగింది. కార్యాలయాలకు వెళ్తూ జనం భారీసంఖ్యలో ఉన్న సమయంలో ఈ పేలుడు సంభవించింది. అంతటా హృదయవిదారక దృశ్యాలు కనిపించాయి.

 బ్రస్సెల్‌పై ఉగ్రదాడి

బ్రస్సెల్‌పై ఉగ్రదాడి

పారిస్‌ ఉగ్రవాద దాడుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్న సలే అబ్దెస్లామ్‌.. బ్రసెల్స్‌లో అరెస్టయిన కొన్ని రోజులకే ఈ దాడి జరగటం గమనార్హం. ఇస్లామిక్‌స్టేట్‌ ఉగ్రవాదులు గతేడాది నవంబరులో పారిస్‌లో జరిపిన దాడిలో 130 మంది మరణించారు. నాలుగునెలలపాటు తప్పించుకుతిరిగిన అబ్దెస్లామ్‌ శుక్రవారం నాడు పోలీసులకు చిక్కాడు.

బ్రస్సెల్‌పై ఉగ్రదాడి

బ్రస్సెల్‌పై ఉగ్రదాడి

బ్రసెల్స్‌పై దాడికి తాను కొంతకాలంగా ప్రయత్నిస్తున్నట్లుగా దర్యాప్తు అధికారులకు అబ్దెస్లామ్‌ వెల్లడించాడు. అంతలోనే దాడి నిజంగానే జరిగింది. బ్రసెల్స్‌లో దాడికి పాల్పడింది తమ ఆత్మాహుతిదళ సభ్యులేనని ఇస్లామిక్‌ స్టేట్‌ అనుబంధ మీడియా సంస్థ అమాఖ్‌ ప్రకటించింది.

 బ్రస్సెల్‌పై ఉగ్రదాడి

బ్రస్సెల్‌పై ఉగ్రదాడి

బ్రసెల్స్‌ విమానాశ్రయంలో మంగళవారం జరిగిన పేలుళ్ల నుంచి బాలీవుడ్‌ నేపథ్య గాయకుడు అభిజిత్‌ భట్టాఛార్జీ కుటుంబం తప్పించుకుంది.

English summary
Vijaywada boy’s lucky escape Twenty-two year old Naga Sravan is currently on a 12-day study trip to Europe. He was 500 meters away from the Maelbeek metro station when the blast took place and had passed by the station’s subway just minutes before.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X