వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రోజా వర్సెస్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి: కీలక పోస్టులన్నీ రెడ్లకే: ఆమెతో బహిరంగ చర్చకు సిద్దం..!

|
Google Oneindia TeluguNews

వైసీపీ ఫైర్ బ్రాండ్..ఏపీఐఐసీ ఛైర్మన్ తాజాగా రెడ్డి వర్గం పైనా..చంద్రబాబు హాయంలో రెడ్డను తొక్కేసారంటూ చేసిన వ్యాఖ్యల మీద టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పందించారు. రోజాకు ధీటుగా బదులిచ్చారు. చంద్రబాబు హాయంలో రెడ్లకు అన్యాయం జరిగిదంటూ రోజా చేసిన వ్యాఖ్యల్లో నిజం లేదని చెప్పుకొచ్చారు. తాజా ప్రభుత్వంలో కీలక పోస్టులన్నీ రెడ్లకే ఇస్తున్నారని ఆరోపించారు. అందునా జగన్ బంధువులకే ఇస్తున్నారని..తాను నిరూపిస్తానని సవాల్ చేసారు. రోజా వచ్చినా సరే..మరెవరు వచ్చినా సరే..తాను బహిరంగ చర్చకు సిద్దమని ప్రకటించారు. చంద్రబాబు హాయంలో సొంత సామాజిక వర్గానికంటే ఇతరులకే ప్రాధాన్యత ఇచ్చారని బుచ్చయ్య చౌదరి చెప్పుకొచ్చారు.

రోజా బహిరంగ చర్చకు రావాలని సవాల్...

రోజా బహిరంగ చర్చకు రావాలని సవాల్...

మాజీ మంత్రి..టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి వైసీపీ నేత రోజాకు సవాల్ విసిరారు. గత ప్రభుత్వంలో అన్ని వర్గాలకు చంద్రబాబు ప్రాధాన్యత ఇచ్చారని..ఇప్పుడు రెడ్లకు మాత్రమే పోస్టులన్నీ దక్కుతున్నాయని విమర్శించారు. చంద్రబాబు హాయంలో రెడ్లను తొక్కేసారంటూ రోజా వ్యాఖ్యానించటాన్ని ఆయన ఖండించారు. దీని పైన తాను డేటాతో సహా సిద్దంగా ఉన్నానని.. రోజా బహిరంగ చర్చకు వస్తే తాను నిరూపిస్తానని బుచ్చయ్య చౌదరి చెప్పుకొచ్చారు. చంద్రబాబు హాయంలో తన లాంటి వారికే ప్రాధాన్యత దక్కలేదని..చంద్రబాబు సొంత సామాజిక వర్గానికి చెందిన తననే పట్టించుకోలేదని..బుచ్చయ్య చెప్పుకొచ్చారు. అదే విధంగా జగన్ ప్రభుత్వంలో జరుగుతున్న నియామాకాల్లో ఎవరికి ప్రాధాన్యత ఇస్తున్నరంటూ ప్రశ్నించారు.

రోజా వ్యాఖ్యలపైన టీడీపీలో చర్చ..

రోజా వ్యాఖ్యలపైన టీడీపీలో చర్చ..

తూర్పు గోదావరి జిల్లాలో ఒక కార్యక్రమంలో రోజా రెడ్లను చంద్రబాబు తొక్కి పెట్టారంటూ వ్యాఖ్యానించారు. రెడ్లందరూ కలిసి జగన్ ను గెలిపించుకున్నారని చెప్పకొచ్చారు. రెడ్డి అంటే కులం కాదని..ధైర్యం.. సాయం.. అని అందుకు రాజశేఖర రెడ్డి నిదర్శనమంటూ వివరించారు. రోజా రెడ్డి సామాజిక వర్గం ఏర్పాటు చేసిన వన సమారాధనలో పాల్గొని ఈ వ్యాఖ్యలు చేసినా..వెంటనే టీడీపీ నేతలు అప్రమత్తమయ్యారు. బుచ్చయ్య చౌదరిని రంగంలోకి దించారు. జగన్ హయంలో ఆయన బంధు జనానికే కీలక పోస్టులు ఇస్తున్నారంటూ లిస్టు సిద్దం చేస్తున్నారు. దీంతో..ఇప్పుడు రోజా వ్యాఖ్యలు కొత్త చర్చకు కారణమయ్యాయి.

ఆ సొమ్ము సీఎం సంక్షేమానికి కాదంటూ..

ఆ సొమ్ము సీఎం సంక్షేమానికి కాదంటూ..

సీఎం సంక్షేమ నిధి కింద ఉన్న రూ 1200 కోట్ల నుండి ఒక్కో భవన నిర్మాణ కార్మికుడికి రూ 10 వేల చొప్పున ఇవ్వాలని బుచ్చయ్య డిమాండ్ చేసారేు. ఆ సొమ్ము సీఎం సంక్షేమానికి కేటాయించిందో లేక జగన మీడియాకు ప్రకటనలు ఇవ్వటానికో కాదంటూ వ్యాఖ్యానించారు. సిమెంట్ బస్తా ధర రూ 340 వరకు పెంచేసిన సీఎం వారికి జే ట్యాక్స్ విధించారని ఆరోపించారు. ఈడీ కేసుల్లో ఉన్న శ్రీనివాస్ కు దానిని వసూలు చేసే బాధ్యత అప్పగించారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసారు. అన్నింటికీ వైసీపీ రంగులు వేస్తున్నారని.. ఇక సీఎం జగన్.. మంత్రులు..ఎమ్మెల్యే ముఖాలకు కూడా అదే రంగు వేసుకుంటే బాగుంటుందంటూ బుచ్చయ్య ఎద్దేవా చేసారు.

English summary
Gorantla Buchaiah Chowdary challenge to YCP leader Roja on open discussion on Reddy community priority in CBN tenure and in present govt.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X