వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బుద్దా వెంకన్నకు కరోనా వైరస్: 14 రోజులు హోం క్వారంటైన్, జననేతపై జోకులా అంటూ..

|
Google Oneindia TeluguNews

ఏపీలో కరోనా కేసులు భారీగా వస్తున్నాయి. రోజుకు కనీసం 10 వేల చొప్పున కొత్త కేసులు వస్తున్నాయి. కరోనా నేతలను కూడా వదలడం లేదు. రోజుకొకరు చొప్పున వైరస్ బారిన పడుతూనే ఉన్నారు. తనకు కరోనా సోకిందని టీడీపీ నేత బుద్దా వెంకన్న తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

14 రోజులు హోం క్వారంటైన్..


తనకు కరోనా వచ్చిందని బుద్దా వెంకన్న తెలిపారు. 14 రోజులు హోం క్వారంటైన్‌లో ఉండాలని వైద్యలు సూచించారని ట్వీట్ చేశారు. వైరస్ సోకినందున, నయమయ్యేవరకు రాజకీయాలకు దూరంగా ఉంటానని తెలిపారు. దైవ సమానులైన చంద్రబాబు, అభిమానుల ఆశీస్సులతో కరోనా వైరస్‌ను జయిస్తానని తెలిపారు. త్వరలోనే రాజకీయ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటానని వివరించారు. ఇదివరకు మాజీమంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి కూడా కరోనా వైరస్ బారినపడ్డ సంగతి తెలిసిందే.

పల్లె రఘునాథ రెడ్డి కూడా...


మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డికి కరోనా పాజిటివ్ వచ్చింది. వైద్యం కోసం హైదరాబాద్‌లో అపోలో చేరారు. త్వరలో కరోనాను జయించి మళ్ళీ మీ ముందుకు వస్తానని పల్లె రఘునాథ్ రెడ్డి తెలిపారు. డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, మంత్రులు బాలినేని శ్రీనివాస రెడ్డి, ఆదిమూలపు సురేష్‌ కూడా వైరస్ బారినపడ్డారు. ఎంపీ విజయసాయి రెడ్డి, అంబటి రాంబాబు, కరణం బలరాం, బియ్యపు మధుసుధన్ రెడ్డి, ఎన్ వెంకటయ్య గౌడ్, ముస్తఫా, అన్నాబత్తుల శివకుమార్, కిలారి రోశయ్య, హఫీజ్ ఖాన్, గంగుల బిజేంద్ర రెడ్డి, అన్నా రాంబాబు, డాక్టర్ సుధాకర్, గొల్ల బాబూరావు, కే. శ్రీనివాసరావు, విశ్వసరాయి కళావతి కరోనా వైరస్ సోకింది. వీరిలో చాలామంది ఇప్పటికే కోలుకున్నారు. మరికొందరు కోలుకోవాల్సి ఉంది.

Recommended Video

AP 3 Capitals పై High Court స్టేటస్ కో మళ్లీ పొడిగింపు- ఏపీ వికేంద్రీకరణ! || Oneindia Telugu
జననేతపై జోకులా.. అందుకే...

జననేతపై జోకులా.. అందుకే...


బుద్దా వెంకన్నకు కరోనా వైరస్ సోకడంపై నెటిజన్లు స్పందిస్తున్నారు. ఓ నెటిజన్ మాత్రం జననేతపై జోకులేస్తే జీవితాలు తారుమారవుతాయని పేర్కొన్నారు. గెట్ వెల్ సూన్ అంటూ ట్వీట్ ఎండ్ చేశారు. అయితే ఇదివరకు విజయసాయిరెడ్డికి కరోనా సోకిన సమయంలో బుద్దా వెంకన్న కూడా ట్వీట్ చేశారు. తన ట్వీట్ శత్రువు వైరస్ నుంచి కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆయన ఆశించిన విధంగా... విజయసాయిరెడ్డి కరోనాను జయించారు. ఇప్పుడు బుద్దా వెంకన్నకు వైరస్ సోకడంతో పలువురు స్పందిస్తున్నారు. ఒక్కొక్కరు ఒకలా స్పందిస్తున్నారు.

English summary
tdp leader, mlc budda venkanna infected coronavirus. he is home quarantine in 14 days
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X