వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రత్యేక హోదా, మోడీపై చంద్రబాబు కక్ష: గోద్రాను లాగిన బుద్ధా వెంకన్న

|
Google Oneindia TeluguNews

విజయవాడ: ప్రధాని నరేంద్ర మోడీ పైన తెలుగుదేశం పార్టీ నేత, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఆదివారం నాడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుపై ప్రధాని మోడీ కక్ష సాధిస్తున్నారని ఆరోపించారు. అంతేకాదు, పదిహేనేళ్ల క్రితం నాటి గోద్రా అల్లర్లను ఆయన లాగారు.

ప్రత్యేక హోదాపై కేంద్రం హామీ ఇవ్వని నేపథ్యంలో టిడిపి నేతలతో చంద్రబాబు ఆదివారం నాడు మంతనాలు జరుపనున్నారు. ఆయన భేటీకి పలువురు సీనియర్లు హాజరవుతున్నారు. అక్కడకు వచ్చిన బుద్ధా వెంకన్న విలేకరులతో మాట్లాడారు.

ప్రత్యేక హోదా ఇవ్వనందున బీజేపీతో తెగదెంపులు చేసుకోవడమే మంచిదని వ్యాఖ్యానించారు. చంద్రబాబుపై మోడీ కక్ష సాధిస్తున్నారని చెప్పారు. గోద్రా అల్లర్లను చంద్రబాబు ఆ రోజు తప్పుబట్టారని, అందుకే ఇప్పుడు మోడీ ఏపీ సీఎం ప్రతిష్టను దెబ్బతీయాలని చూస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు.

బీజేపీ-టీడీపీ స్నేహం కొనసాగదు, అందుకే మోడీ శత్రువు బాబు: జేసీ సంచలనంబీజేపీ-టీడీపీ స్నేహం కొనసాగదు, అందుకే మోడీ శత్రువు బాబు: జేసీ సంచలనం

Buddha Venkanna drags Godra riots into Special Status issue

జైట్లీ ప్రకటన నిరాశపరిచింది: యనమల

ప్రత్యేక హోదా పైన జైట్లీ ప్రకటన నిరాశపరిచిందని ఏపీ ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. కేంద్రం నుంచి ఎలా నిధులు రాబట్టాలి, ఎలా ప్రత్యేక హోదా సాధించాలి, పార్లమెంటులో ఎలాంటి వ్యూహం అనుసరించాలనే అంశంపై తాము చంద్రబాబుతో చర్చిస్తామన్నారు. ప్రజల్లోని అసంతృప్తిని కేంద్రం వద్దకు తీసుకెళ్తామని చెప్పారు.

జగన్ బంద్: మోడీ! ఎందుకిలా చేస్తున్నారో.. బాబు, ఎత్తుకుపైఎత్తు జగన్ బంద్: మోడీ! ఎందుకిలా చేస్తున్నారో.. బాబు, ఎత్తుకుపైఎత్తు

11 పార్టీలను ఏకతాటిపైకి తీసుకొచ్చాం: రఘువీరా

ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ఎన్నికల సమయంలో బీజేపీ, టీడీపీలు హామీ ఇచ్చాయని, బీజేపీ తమ మేనిఫెస్టోలో పెట్టిందని ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి అన్నారు. హోదా కోసం కాంగ్రెస్ పార్టీ చేసిన ఉద్యమాన్ని కొందరు అవహేళన చేశారని ధ్వజమెత్తారు. హోదా కోసం రాజ్యసభలో పదకొండు పార్టీలను తాము ఏకతాటిపైకి తెచ్చామన్నారు. హోదా బాధ్యత బీజేపీ, టిడిపిలదే అన్నారు. హోదా అంశాన్ని చట్టంలో పెట్టలేదని చెప్పడం సరికాదన్నారు.

English summary
TDP MLC Buddha Venkanna drags Godra riots into Special Status issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X