వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'స్వరం మార్చిన రోజా, జగన్‌కు ఇబ్బందులు మొదలు, రాత్రుళ్లు మాట్లాడుకుంటున్నారు'

|
Google Oneindia TeluguNews

అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు, నగరి ఎమ్మెల్యే రోజాపై తెలుగుదేశం పార్టీ నేత బుద్ధా వెంకన్న గురువారం తీవ్ర వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలు చేయడం మాని, దమ్ముంటే రోజా చర్చకు రావాలని సవాల్ చేశారు.

Recommended Video

సిఎం సొంత జిల్లాలో జగన్, సర్వత్రా ఆసక్తి !

చదవండి: జేసీ దుమారం, ఇక అంతేనా?: బాబు పక్కా ప్లాన్, మోడీపై ఆగ్రహంతోనే గుజరాత్‌కు దూరం

తెలుగుదేశం పార్టీ హయాంలో మహిళలపై దాడులు పెరిగాయని రోజా వ్యాఖ్యానించడాన్ని ఆయన తప్పుబట్టారు. ఈ అంశంపై ఎక్కడైనా చర్చకు సిద్ధమని చెప్పారు. నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడవద్దని హితవు పలికారు.

చదవండి: ఊహించని ట్విస్ట్‌లు: బాబు వద్దకు బైరెడ్డి! జగన్ కోసం శ్రీదేవి వద్ద అనుచరుడి లాబీయింగ్

జగన్ పాదయాత్రకు రోజా యాంకర్‌లా

జగన్ పాదయాత్రకు రోజా యాంకర్‌లా

రోజా నోరు తెరిస్తే అన్నీ అబద్దాలే ఆడుతారని బుద్ధా వెంకన్న మండిపడ్డారు. వైసీపీ అధినే జగన్ పాదయాత్రకు రోజా యాంకర్‌లా వ్యవహరిస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు. కాగా, రెండు రోజుల క్రితం కదిరి ఆత్మీయ సభలో రోజా ప్రభుత్వంపై మండిపడిన విషయం తెలిసిందే.

రోజా విమర్శలు

రోజా విమర్శలు

చంద్రబాబు గతంలో ఆడపిల్ల పుట్టుకనే ప్రశ్నించిన వ్యక్తి అని, తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆడపిల్లకు రూ.30వేలు ఇస్తామని చెప్పారని, ఇప్పటి వరకు ఎవరికీ ఇవ్వలేదని, అంటే రాష్ట్రంలో ఇప్పటి వరకు ఒక్క ఆడపిల్ల పుట్టలేదా అని ప్రశ్నించారు. కదిరి ఆత్మీయ సభలో ఆమె మాట్లాడారు. ఈ వ్యాఖ్యలపై బుద్ధా వెంకన్న మండిపడ్డారు.

రోజా ఎఫెక్ట్, వైసీపీకి ఇబ్బందులు మొదలు

రోజా ఎఫెక్ట్, వైసీపీకి ఇబ్బందులు మొదలు

అప్పుడు దివంగత వైయస్ రాజశేఖర రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారని బుద్ధా వెంకన్న అన్నారు. వైయస్ మహిళా వ్యతిరేకి అని ఎలుగెత్తి చాటారని గుర్తు చేశారు. ఇప్పుడు పార్టీ మారాక స్వరం మార్చారని, రోజా మాటలతో వైసీపీకి ఇబ్బందులు మొదలయ్యాయని వ్యాఖ్యానించారు.

జగన్ సార్వత్రిక ఎన్నికల్లో అన్నిచోట్లా నిలబెట్టలేరు

జగన్ సార్వత్రిక ఎన్నికల్లో అన్నిచోట్లా నిలబెట్టలేరు

కర్నూలు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్ల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని నిలబెట్టకపోవడంపై బుద్ధా వెంకన్న విమర్శలు గుప్పించారు. వైసీపీ పోటీలో నిలబెట్టేందుకు భయపడిందని ఎద్దేవా చేశారు. సార్వత్రిక ఎన్నికల్లోను అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలిపే సత్తా లేదని వ్యాఖ్యానించారు.

రాత్రుళ్లు మాట్లాడుకొని ఉదయం బురద జల్లుతున్నారు

రాత్రుళ్లు మాట్లాడుకొని ఉదయం బురద జల్లుతున్నారు

కాంగ్రెస్ పార్టీ నేత, రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్ర రావుపై బుద్ధా వెంకన్న విమర్శలు గుప్పించారు. కేవీపీ ఆస్తులపై విచారణ జరపాల్సిందిగా త్వరలో సీబీఐకి లేఖ రాస్తానని వెల్లడించారు. కాంగ్రెస్, వైసీపీలు రాత్రి మాట్లాడుకొని ఉదయం టీడీపీపై బురద జల్లుతున్నాయన్నారు. రాజకీయాల్లోకి రాకముందు కేవీపీ ఆస్తులు ఎంత, ఇప్పుడు ఎంత అని ప్రశ్నించారు.

English summary
Telugu Desam Party leader Buddha Venkanna lashed out at YSR Congress Party chief YS Jagan Mohan Reddy, MLA Roja and Congress MP KVP Ramachandra Rao.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X