‘అంతా జగన్ నాటకం: దాడి వారిద్దరి ప్లానే..మోడీయే డైరెక్టర్’!

హైదరాబాద్/అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడి ఘటన నాటకమేనని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న అన్నారు. అంతేగాక, ఈ మొత్తం నాటకానికి ప్రధాని మోడీయే డైరెక్టర్ అని సంచలన ఆరోపణలు చేశారు.

జగన్‌పై దాడి వారిద్దరి ప్లానే..

జగన్‌పై దాడి వారిద్దరి ప్లానే..

జగన్‌పై దాడి జరిగిన సమయంలో ఎయిర్‌పోర్టులో సీసీ కెమెరాలు పనిచేయలేదని, ఇవన్నీ చూస్తుంటే విజయవాడలో బీజేపీ ప్రతినిధి జీవీఎల్ నర్సింహారావు, వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఇద్దరూ కలిసి ముందుగానే ఒక రహస్య ప్రదేశంలో ప్లాన్ చేశారని బుద్ధా వెంకన్న ఆరోపించారు.

జగన్ నాటకం..

జగన్ నాటకం..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ నాటకం జరుగుతోందని వెంకన్న ఆరోపించారు. పులివెందుల కృష్ణ ఎవరో తెలీదని అన్నారు. కానీ, ఇప్పుడు ఆస్పత్రి వద్ద అన్నీ నడిపిస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు. సంఘ విద్రోహ శక్తులన్నీ ఆస్పత్రి వద్ద మోహరించాయన్నారు.

 అనుమానాలున్నాయి.. రెచ్చగొట్టే ప్రయత్నం

అనుమానాలున్నాయి.. రెచ్చగొట్టే ప్రయత్నం

వైయస్ జగన్మోహన్ రెడ్డిపై దాడి జరిగిన తర్వాత ఆయన హైదరాబాద్ వెళ్లడంపై పలు అనుమానాలున్నాయని టీడీపీ ఎమ్మెల్సీ లంకా దినకర్ అన్నారు. శుక్రవారం మధ్యాహ్నం మీడియాతో మాట్లాడిన దినకర్.. కత్తికి విషం ఉందని వైసీపీ నేతలు రెచ్చగొట్టే ప్రయత్నం చేశారన్నారు.

వైసీపీ కనుసన్నల్లోనే..

వైసీపీ కనుసన్నల్లోనే..

జగన్మోహన్ రెడ్డి ఎలా హైదరాబాద్‌కు తరలించారు? అని వైసీపీ నేతలను దినకర్ ప్రశ్నించారు. విశాఖ ఆస్పత్రికి తరలించకుండా రాజకీయాలు చేశారని ఆరోపించారు. మొత్తం కుట్ర వైసీపీ నేతల కనుసన్నల్లోనే జరిగిందా? అనే అనుమానం తనకు కలుగుతోందని టీడీపీ నేత చెప్పుకొచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+