వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బ్రేక్ జనతా ప్రామిసెస్: సోము వీర్రాజును తిప్పికొట్టిన బుద్ధా వెంకన్న

By Pratap
|
Google Oneindia TeluguNews

అమరావతి: బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజుపై తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బుద్ధా వీర్రాజు మండిపడ్డారు. బిజెపి అంటే బ్రేక్ జనతా ప్రామిసెస్ అని ఆయన అభివర్ణించారు. తమ వల్ల గెలిచిన సోము వీర్రాజు తమపై విషం చిమ్ముతున్నారని ఆయన శనివారం మీడియా సమావేశంలో అన్నారు

కొత్త AI powered cameraతో OPPO F7, 25 ఎంపీ AI సెల్ఫీ కెమెరాతో..

తమ వల్ల గెలిచిన ఎమ్మెల్సీ పదవిలో ఎందుకు కొనసాగుతున్నారని ఆయన సోము వీర్రాజును ప్రశ్నించారు. పట్టిసీమ మోడల్‌ను దేశమంతా అధ్యయనం చేస్తోందని ఆయన అన్నారు. కాంట్రాక్టర్లను సోము వీర్రాజు బెదిరిస్తున్నారని ఆయన ఆరోపించారు. లోకశభకు సోము వీర్రాజు పోటీ చేస్తే 10 లక్షల ఓట్లలో 7250 ఓట్లు మాత్రమే వచ్చాయని ఆయన అన్నారు.

Budha Venkanna retaliates Somu Veerrau

బిజెపి అంటే భారతీయ జోకర్ల పార్టీ అని టిడిపి ఎమ్మెల్సీ బీద రవిచంద్ర యాదవ్ వ్యాఖ్యానించారు. మండలిలో పట్టిసీమపై చర్చ జరిగిన సందర్భంలో సోము వీర్రాజు ఎందుకు పారిపోయారని ఆయన శనివారం మీడియా సమావేశంలో ప్రశ్నించారు.

నెల జీతం సరిపోవడం లేదు: చిన్నారి కోసం ఓ వెయిటర్ తండ్రి ఆవేదననెల జీతం సరిపోవడం లేదు: చిన్నారి కోసం ఓ వెయిటర్ తండ్రి ఆవేదన

దమ్ముంటే టిడిపి వల్ల సంక్రమించిన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి మాట్లాడాలని ఆయన సోము వీర్రాజుకు సవాల్ విసిరారు. బిజెపి, టిడిపి మధ్య తేడాలు రావడానికి సోము వీర్రాజు కారణమని విమర్శించారు.

రాష్ట్ర ప్రభుత్వం మీద నిత్యం కేంద్రానికి ఫిర్యాదు చేస్తూ సోము వీర్రాజు రాష్ట్రానికి నిధులు రాకుండా చేశారని ఆయన విమర్శించారు వైసిపితో వీర్రాజు చేతులు కలిపి ఎపికి అన్యాయం చేస్తున్నారని అన్నారు.

పట్టిసీమలో అవినీతి జరిగిందంటే రైతులే బిజెపిని ఉరి తీస్తారని ఆయన వ్యాఖ్యానించారు. నీరవ్ మోడీ, లలిత్ మోడీ, విజయ్ మాల్యా కుంభకోణాలపై కేంద్రం విచారణకు సిద్ధమా అని ఆయన అన్నారు.

English summary
The Telugu Desam party MLC Budha Venkanna retaliated BJP MLC Somu Veerrau.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X