వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'మాట మార్చారేం. నోట్లు రద్దు చేయమని చెప్పి యూటర్న్, చంద్రబాబూ! వీటికి జవాబేది?'

పెద్ద నోట్ల రద్దు పైన యూ టర్న్ తీసుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెంటనే రాష్ట్ర ప్రజలకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధి బుగ్గన డిమాండ్ చేశారు.

|
Google Oneindia TeluguNews

విజయవాడ: పెద్ద నోట్ల రద్దు పైన యూ టర్న్ తీసుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెంటనే రాష్ట్ర ప్రజలకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి డిమాండ్ చేశారు.

మోడీకి షాక్: మాకు సంబంధం లేదు.. పవన్ కళ్యాణ్ తర్వాత చంద్రబాబు యూటర్న్మోడీకి షాక్: మాకు సంబంధం లేదు.. పవన్ కళ్యాణ్ తర్వాత చంద్రబాబు యూటర్న్

పెద్ద నోట్లు రద్దు చేయాలని అక్టోబర్ 12వ తేదీన చంద్రబాబు ప్రధాని మోడీకి లేఖ రాశారని గుర్తు చేశారు. ఆ తర్వాత నవంబర్ 8వ తేదీన నోట్లను రద్దు చేస్తూ నరేంద్ర మోడీ ప్రకటన చేశారన్నారు. ఆ రోజే నోట్ల రద్దు క్రెడిట్‌ను చంద్రబాబు తీసుకున్నారన్నారు.

నోట్ల రద్దు క్రెడిట్‌ను ప్రధాని మోడీ ఎక్కడ తీసుకుంటారోనని ఆందోళన చెందిన చంద్రబాబు.. ఆ క్రెడిట్ ఇతరులకు వెళ్లవద్దని, రాత్రికి రాత్రే ప్రెస్ మీట్ పెట్టి ప్రధానికి నోట్లు రద్దు చేయాలని చెప్పింది తానేనని చెప్పారని, ఇప్పుడేమో నోట్ల రద్దు తాము కోరుకున్నది కాదని చెప్పడం ఏమిటని మండిపడ్డారు.

chandrababu naidu

నోట్లను రద్దు చేశారంటూ చంద్రబాబు యూ టర్న్ తీసుకోవడం విడ్డూరమన్నారు. అక్టోబర్ 12వ తేదీన రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేయాలని కోరుతూ లేఖ రాసింది చంద్రబాబు కాదా అని బుగ్గన నిలదీశారు. నవంబర్ 8వ తేదీన ప్రెస్ మీట్ పెట్టి మరీ.. నా సూచన మేరకు మోడీ రద్దు చేశారని చెప్పింది వాస్తవం కాదా అన్నారు.

ఇప్పుడు ఏపీ ప్రజలు పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని చంద్రబాబు సలహా వల్లే చేశారని భావిస్తున్నారన్నారు. జనచైతన్య యాత్రల ద్వారా మీ మంత్రులు, మీ పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఇది మీ నిర్ణయమేనని ప్రచారం చేశారన్నారు.

రివర్స్ గేర్ వెనుక..!: మోడీని వదిలేసి.. చివర్లో రూటుమార్చిన పవన్ కళ్యాణ్రివర్స్ గేర్ వెనుక..!: మోడీని వదిలేసి.. చివర్లో రూటుమార్చిన పవన్ కళ్యాణ్

ఏపీలో అరవై శాతం నుంచి డెబ్బై శాతం మంది వ్యవసాయం పైన ఆధారపడ్డారని, ఇలాంటి పరిస్థితుల్లో పెద్ద నోట్లను రద్దు చేయాలని మీరు ఎలా సలహా ఇచ్చారో చెప్పాలన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మీరు నోట్లు రద్దు చేయాలని ఎలా సలహా ఇచ్చారో చెప్పాలన్నారు.

2014, 2015లో తీవ్ర కరువు వచ్చినప్పటికీ పన్నెండున్నర లక్షల హెక్టార్లలో విత్తనాలు నాటారని, కానీ ఈ ఏడాది పెద్ద నోట్ల రద్దు వల్ల 12 లక్షల హెక్టార్ల నుంచి 7.3 లక్షల హెక్టార్లకు నాట్లు, పంటసాగు తగ్గిపోయిందన్నారు. నోట్ల రద్దు మొదట తన క్రెడిట్ అని చెప్పుకున్న చంద్రబాబు ఇప్పుడు తాము కోరుకున్నది కాదని చెప్పడం విడ్డూరమన్నారు.

English summary
YSRCP MLA Buggana Rajendranath Reddy has questioned AO CN Chandrababu over demonetisation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X