వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘మ్యాటర్ వీక్.. పబ్లిసిటీ పీక్’: బాబు, లోకేష్‌పై బుగ్గన నిప్పులు, బీజేపీ నేతల భేటీపై క్లారిటీ

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/అమరావతి: బీజేపీ నేతలతో ఎవరూ మాట్లాడా కూడదా? అని తెలుగుదేశం పార్టీ నేతల్ని ప్రశ్నించారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత బుగ్గన రాజేంద్రప్రసాద్(రాజేంద్రనాథ్ రెడ్డి). బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, మరో నేత రాంమాధవ్‌లను కలిసినట్లు టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు.

శుక్రవారం బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తనకు రహస్యంగా బీజేపీ నేతలను కలవాల్సిన సఅంరం లేదని అన్నారు. తాను నిజంగా బీజేపీ కీలక నేతలను కలిస్తే టీడీపీ వారి పరిస్థి ఏంటోనని ఎద్దేవా చేశారు. టీడీపీ వాళ్ల ఆరోగ్యాలు ఏమవుతాయోనని అన్నారు.

బీజేపీ నేతలతో భేటీ అయితే టీడీపీకి ఉలికిపాటేందుకు?

బీజేపీ నేతలతో భేటీ అయితే టీడీపీకి ఉలికిపాటేందుకు?

బీజేపీ నేత ఆకుల సత్యనారాయణను ఏపీ భవన్‌లో కలిశానని, ఆయన తన స్నేహితుడని బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు. లంచ్ కోసం తాము హోటల్ వెళ్లామని చెప్పారు. టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ కూడా తన స్నేహితుడేనని, ఆయన తనను ఏపీ భవన్‌లో ఆలింగనం చేసుకున్నారని చెప్పారు. తాము టీడీపీలా అర్ధరాత్రి దొంగాటలు ఆడలేమని అన్నారు. ఏపీ భవన్‌ స్టేట్ గెస్ట్ హౌసేనని అని అన్నారు. ఒక్కసారి ఢిల్లీకి వెళితేనే టీడీపీ నేతలు ఇంత ఉలిక్కిపడుతున్నారని అన్నారు.

 లోకేస్‌ను చూస్తే జాలేస్తోంది..

లోకేస్‌ను చూస్తే జాలేస్తోంది..

మంత్రి నారా లోకేష్ రాజకీయాల్లోకి వచ్చి ఇన్ని సంవత్సరాలైన అవగాహన మాత్రం పెరగలేదని బుగ్గన ఎద్దేవా చేశారు. లోకేష్ అమాయకత్వాన్ని చూస్తే జాలేస్తోందని అన్నారు. లోకేష్ అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మైకు ముందుకొస్తే నోరుజారుతాననే భయంతో లోకేష్ ట్విట్టర్‌కే పరిమితమవుతున్నారని బుగ్గన ఎద్దేవా చేశారు.

టీడీపీ నేతలు రాజ్యాంగం గురించా?

టీడీపీ నేతలు రాజ్యాంగం గురించా?

టీడీపీ నేతలు రాజ్యాంగం గురించి మాట్లాడటం సిగ్గుచేటని అన్నారు. తమ పార్టీకి చెందిన 23మంది ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకున్నారని, అంతేగాక, నలుగురికి మంత్రి పదవులు కూడా ఇచ్చారని అన్నారు. ఇదంతా రాజ్యాంగం ప్రకారమే చేశారా? అని మండిపడ్డారు. రాజధాని నిర్మాణంపై ప్రతిపక్షలను అడిగారా? అని ప్రశ్నించారు.

‘మ్యాటర్ వీక్.. పబ్లిసిటీ పీక్'

‘మ్యాటర్ వీక్.. పబ్లిసిటీ పీక్' అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్, ఆ పార్టీ నేతలనుద్దేశించి బుగ్గన రాజేంద్రనాథ్ ఎద్దేవా చేశారు. టీడీపీ నేతలు వాళ్లకిష్టమైనట్లు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ వాళ్లు మాత్రం రాహుల్ గాంధీతో సహా ఎవరినైనా కలవచ్చు కానీ, మేము కలివకూడదా? అని ప్రశ్నించారు. ఏపీ భవన్‌లో చాలా మందిని కలుస్తుంటాం.. అవన్నీ చూపరెందుకని ప్రశ్నించారు. టీడీపీ నేతలకు డ్రామాలాడటం అలవాటేనని దుయ్యబట్టారు. ట్రంప్, కిమ్ భేటీకి కూడా తామే కారణమని చెప్పుకునే రకం టీడీపీ వాళ్లని ఎద్దేవా చేశారు.

English summary
YSRCP MLA Buggana Rajendranath Reddy on Friday fired at Andhra Pradesh CM Chandrababu Naidu and minister Nara Lokesh for their comments on him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X