వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీజేపీతో భేటీపై ట్విస్ట్: టీడీపీ నేతలపై బుగ్గన సభా హక్కుల నోటీసు, రాజీనామాలకు సవాల్

By Srinivas
|
Google Oneindia TeluguNews

అమరావతి: ఢిల్లీలో బీజేపీ నేతలతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి భేటీ కావడంపై ఇటీవల చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. టీడీపీ నేతలు దీనిపై విమర్శలు గుప్పించారు. ఈ అంశం ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది.

Recommended Video

దుమ్మేత్తిపోస్కుంటున్న తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు

తన ప్రతిష్టకు భంగం కలిగించారంటూ టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని, ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ పైన బుగ్గన సభా హక్కుల నోటీసులు ఇచ్చారు. తన ప్రతిష్టకు భంగం కలిగేలా వారు ఆరోపణలు చేశారని ఫిర్యాదు చేశారు. ఈ మేరకు బుగ్గన అసెంబ్లీ సెక్రటరీకి ఫిర్యాదు కాపీని పంపించారు.

Buggana Rajendranath Reddy Notice of Violation on TDP MP and MLA

టీడీపీకి బుగ్గన సవాల్

సభా హక్కుల ఉల్లంఘన నోటీసు పంపిన బుగ్గన టీడీపీకి సవాల్ కూడా విసిరారు. తనపై చేసిన ఆరోపణలు రుజువు చేయకుంటే రాజీనామాలకు సిద్ధమా అని సవాల్ చేశారు. టీడీపీ నేతల ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు.

వైసీపీకి, బీజేపీతో సంబంధాలు ఉన్నాయంటూ టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. టీడీపీపై మాపై బురద జల్లుతూ బీజేపీతో అంటకాగుతోందన్నారు. టీడీపీ అభియోగాలపై తేల్చుకోవడానికి ఎమ్మెల్యే, పీఏసీ పదవులను వదిలేసేందుకు సిద్ధమని సవాల్ చేశారు. టీడీపీ సిద్ధంగా ఉంటే తన సవాల్ స్వీకరించాలన్నారు.

English summary
YSR COngress Party MLA Buggana Rajendranath Reddy Notice of Violation against TDP MP Ravindra Kumar and MLA Yarapathineni.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X