అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

‘అది స్విస్ ఛాలెంజ్ కాదు.. పెద్ద మ్యాచ్ ఫిక్సింగ్’

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: స్విస్ ఛాలెంజ్ విధానంపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, పీఏసీ ఛైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు. రాజధాని నిర్మాణంలో స్విస ఛాలెంజ్ విధానం వెనక పెద్ద మ్యాచ్ ఫిక్సింగ్ ఉందని ధ్వజమెత్తారు. బుధవారం ఆయనం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.

MLA Buggana rajendranath reddy

స్విస్ ఛాలెంజ్ విధానంలో పాదర్శకత లేదని , అందుకే కోర్టు కూడా ఈ విధానాన్ని వ్యతిరేకిస్తోందని చెప్పారు. సీఆర్డీఏ, మున్సిపల్ అభివ్రుద్ధి శాఖ అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించలేదని, నిబంధనలు కూడా సరిగ్గా లేవని కోర్టు అక్షింతలు వేసిందన్నారు. సీఎం చంద్రబాబు ముఖం చూసి సింగపూర్ వాళ్లు ఉచితంగా ఏమీ చేయలేదని, కొత్తరాష్ట్రం కాబట్టే వారు ముందుకు వచ్చారని అన్నారు.

రాజధాని విషయంలో తరతరాలు నష్టపోయేలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని బుగ్గన ధ్వజమెత్తారు. సింగపూర్ తరపున తొలుత సెంటర్ ఫర్ లివబుల్ సిటీస్ సంస్థ ముందుకు వచ్చిందని, వారు అమరావతి రాజధాని ప్రణాళిక రూపొందించమని టెమాసిక్ హోల్డింగ్స్ కు సబ్సిడరీ కంపెనీ అయిన సుర్బానా అండ్ జురాంగ్ కు అప్పగించారని చెప్పారు.

సుర్బానా జురాంగ్ ప్లా ఇచ్చిన తర్వాత ప్రభుత్వం పథకం ప్రకారం కథ నడిపించిందని అన్నారు. స్విస్ ఛాలెంజ్ విధానంలో రాజధాని ఏర్పాటుపై ఏప్రిల్ 22న ప్రకటన వచ్చిందని, రాజధాని నిర్మిస్తామని ఏప్రిల్ 30న సింగపూర్ ఎంటర్ ప్రైజెస్ కు అసెండాస్ సెమ్ బ్రిడ్జి కంపెనీలు లేఖ రాశాయన్నారు.

పేరెంట్ కంపెనీ టెమాసిక్ హోల్డింగ్స్ కు ప్రతిపాదనలు పంపకుండా వేరొకరు ఎలా రంగప్రవేశం చేస్తారని ప్రశ్నించారు. స్విస్ ఛాలెంజ్ ప్రతిపాదల్ని ఎక్కడ పాటించారో చెప్పాలని ప్రభుత్వాన్ని నిలదీశారు. రాష్ట్ర బాగుకోరేర ప్రతీ ఒక్కరూ స్విస్ ఛాలెంజ్ విధానాన్ని వ్యతిరేకించాలన్నారు. ప్రత్యేక హోదా గల రాస్ట్రాలు ఇక ఉండవని అబద్ధాలు చెప్పడం సరికాదన్నారు.

English summary
YSR Congress MLA Buggana rajendranath reddy on Wednesday responded on Swiss Challange issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X