• search
  • Live TV
కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

మమత, కేజ్రీవాల్‌లతో చర్చిస్తున్నా, ఆలోచించి నిర్ణయం: బాబు, బుగ్గన-బీజేపీ భేటీపై కీలక వ్యాఖ్యలు

By Srinivas
|

అమరావతి: బీజేపీ పెద్దలతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి భేటీ రెండు పార్టీల కుట్రలకు పరాకాష్ట అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం విమర్శించారు. బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షాతో గురువారం బుగ్గన భేటీ అయ్యారంటూ టీడీపీ నేతలు ఆరోపించారు. ఈ వార్తలను బుగ్గనతో పాటు బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ కొట్టి పారేశారు.

ఈ అంశంపై చంద్రబాబు స్పందించారు. ప్రధానమంత్రి కార్యాలయంలో వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయ సాయి రెడ్డి తిష్టవేయడం గురించి గతంలో ఫోటోలు బయటకు వచ్చాయన్నారు. ఇప్పుడు ఢిల్లీలో బుగ్గన బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణతో కలిసి వెళ్లడంపై వీడియోలు వచ్చాయన్నారు. చంద్రబాబు టీడీపీ ఎంపీలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా స్పందించారు.

కలకలం: 'తేలిపోయింది.. వీడియోలే నిదర్శనం, పురంధేశ్వరి సహా అమిత్ షాతో బుగ్గన భేటీ వెనుక?'

 అడక్కుండానే జగన్ మద్దతిచ్చారు

అడక్కుండానే జగన్ మద్దతిచ్చారు

రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అడగకుండానే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బేషరతుగా మద్దతు ఇచ్చిందని చంద్రబాబు గుర్తు చేశారు. రాష్ట్రానికి అన్యాయం చేసిన బీజేపీని జగన్ ఎందుకు నిలదీయడం లేదని వ్యాఖ్యానించారు. కుట్ర రాజకీయాలకు ఇంతకన్నా రుజువులు కావాలా అని ఆయన వాపోయారు. బీజేపీ, వైసీపీ కుట్ర రాజకీయాలను టీడీపీ నేతలు, కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకు వెళ్లాలన్నారు.

జగన్-గాలి, బీజేపీ అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతుందా?

జగన్-గాలి, బీజేపీ అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతుందా?

పార్లమెంటు సభ్యులు వారానికి ఓ కార్యక్రమం అన్ని జిల్లాల్లో చేపట్టాలని చంద్రబాబు సూచించారు. బీజేపీ నమ్మకద్రోహంపై ప్రజలను చైతన్యం చేయాలని సూచించారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గాలి జనార్ధన్ రెడ్డి అనుచరులకు తొమ్మిది స్థానాలు కేటాయించిందని విమర్శించారు. ఇక్కడ జగన్, కర్ణాటకలో గాలితో కలిసి ఉన్న బీజేపీ అవినీతిపై పోరాడుతుందని చెబితే ఎవరైనా నమ్ముతారా అని ప్రశ్నించారు.

కేంద్రం అలా చెప్తుంటే, వైసీపీ ఢిల్లీ వెళ్తోంది

కేంద్రం అలా చెప్తుంటే, వైసీపీ ఢిల్లీ వెళ్తోంది

జగన్ అవినీతి కేసులను బలహీనపర్చాలని చూడటం కుట్ర రాజకీయమని చంద్రబాబు మండిపడ్డారు. కడప స్టీల్ ప్లాంట్ అసాధ్యమని ఓ వైపు కేంద్రం అఫిడవిట్ దాఖలు చేస్తోందని, మరోవైపు వైసీపీ నేతలు ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలతో లాలూచీ రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.

 కేజ్రీవాల్ సహా ఇతర సీఎంలతో చంద్రబాబు చర్చలు

కేజ్రీవాల్ సహా ఇతర సీఎంలతో చంద్రబాబు చర్చలు

టీడీపీ ఎంపీలతో భేటీ సందర్భంగా నీతి అయోగ్ సమావేశం అంశం చర్చకు వచ్చింది. బీజేపీయేతర సీఎంలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు చంద్రబాబు తెలిపారు. మమతా బెనర్జీ, కుమారస్వామి, పినరాయి విజయన్, అరవింద్ కేజ్రీవాల్‌తో చర్చలు జరిపినట్లు తెలిపారు. నీతి అయోగ్‌లో ప్రస్తావించాల్సిన అంశాలపై ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడనున్నట్లు కూడా తెలిపారు. సమావేశానికి వెళ్లి ఎవరి వాదన వారు వినిపించి, బాయ్‌కాట్ చేసే అంశం పైనా సమాలోచనలు చేస్తున్నట్లు తెలిపారు. మిగిలిన రాష్ట్రాల సీఎంలతో మరికొంత చర్చించిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అలాగే, తన ఢిల్లీ పర్యటనలో కేజ్రీవాల్ పోరాటానికి చంద్రబాబు సంఘీబావం తెలపనున్నారు.

 మొదట మనమే బయటపెట్టాం

మొదట మనమే బయటపెట్టాం

చంద్రబాబు గురువారం రాత్రి కూడా ఈ అంశంపై స్పందించారు. బీజేపీ అడుగుల్లోనే వైసీపీ నడుస్తోందన్నారు. ఆ రెండు పార్టీలూ కలిసే సాగుతున్నాయన్నారు. బుగ్గన బీజేపీ పెద్దలతో ఢిల్లీలో సమావేశం కావడం ఆ రెండు పార్టీల మైత్రికి నిదర్శనమన్నారు. బీజేపీ, వైసీపీ కుట్ర రాజకీయాల్ని మొదట మనమే బయటపెట్టామని, దీనిని మరింతగా ప్రజల్లోకి తీసుకు వెళ్లాలన్నారు. నమ్మక ద్రోహం, కుట్ర రాజకీయాల్ని ఎండగట్టాలన్నారు. 5 పార్లమెంటు స్థానాలకు ఉప ఎన్నికలు వస్తే బుగుండేదని, నంద్యాల, కాకినాడ తరహాలో స్వీప్‌ చేసేవాళ్లమన్నారు. అది తెలిసే ఉప ఎన్నికలు రాకుండా జాగ్రత్తపడ్డారన్నారు.

English summary
A meeting between BJP leaders and YSR Congress MLA and Public Accounts Committee (PAC) chairman Buggana Rajendranath Reddy created a flutter. The TDP reacted bitterly to it and alleged that both the parties were resorting to conspiracy politics at the cost of the State development.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more