వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు .. శరవేగంగా నిర్ణయాలు .. కేంద్రం వద్ద పావులు కదపనున్న జగన్ సర్కార్

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేయాలని కీలక నిర్ణయం తీసుకుంది. అందుకోసం శరవేగంగా అడుగులు వేస్తున్న ఏపీ సర్కార్ రాష్ట్రంలో బల్క్ డ్రగ్ పార్టీ ఏర్పాటుకు సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసింది . రెండు వేల ఎకరాల్లో బల్క్ డ్రగ్ పార్కు ఏర్పాటుకు ప్రతిపాదనలు వచ్చిన నేపథ్యంలో రాష్ట్ర మంత్రివర్గం ఇటీవల దీనికి ఆమోదం తెలిపింది. కేంద్రం దేశ వ్యాప్తంగా మూడు బల్క్ డ్రగ్ పార్క్ లను ఏర్పాటు చెయ్యాలని భావిస్తున్న తరుణంలో ఎలాగైనా ఏపీకి తీసుకురావాలని గట్టిగానే ప్రయత్నాలు మొదలు పెట్టింది ఏపీ ప్రభుత్వం .

 కొలిక్కిరాని ఆర్టీసీ చర్చలు ..సీఎం కేసీఆర్ మెలికతో ఏపీఎస్ఆర్టీసీకి నష్టం .. సీఎం జగన్ నిర్ణయమేంటో ? కొలిక్కిరాని ఆర్టీసీ చర్చలు ..సీఎం కేసీఆర్ మెలికతో ఏపీఎస్ఆర్టీసీకి నష్టం .. సీఎం జగన్ నిర్ణయమేంటో ?

కేంద్రానికి దరఖాస్తు చేసే బాధ్యత ఏపీఐఐసీకి అప్పగింత

కేంద్రానికి దరఖాస్తు చేసే బాధ్యత ఏపీఐఐసీకి అప్పగింత

బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు కోసం కేంద్రానికి దరఖాస్తు చేసే బాధ్యతను ఏపీఐఐసీకి అప్పగించింది జగన్ సర్కార్.

ప్రైవేట్ భాగస్వాములను గుర్తించటంతో సహా , సీఎస్ఐఆర్, ఐఐసీటీ లతో నాలెడ్జ్ పార్టనర్ లుగా ఎంఓయూ చేసుకోవాలని కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా మూడు బల్క్ డ్రగ్ పార్కులను ఏర్పాటు చేయాలని తీసుకున్న నిర్ణయంతో ఏపీ సర్కార్ ఎలాగైనా దానిని ఏపీకి తీసుకురావాలని హై లెవెల్ లోనే ప్రయత్నాలు చేస్తోంది. బల్క్ డ్రగ్ పార్క్ కు సంబంధించిన విధి విధానాలు కూడా ఆంధ్రప్రదేశ్ కు అనుకూలంగా ఉన్నాయి.

స్వదేశీ తయారీని ప్రోత్సహించటానికి కేంద్రం నిర్ణయం ..3 బల్క్ డ్రగ్ మరియు 4 మెడికల్ డివైస్ పార్కులు

స్వదేశీ తయారీని ప్రోత్సహించటానికి కేంద్రం నిర్ణయం ..3 బల్క్ డ్రగ్ మరియు 4 మెడికల్ డివైస్ పార్కులు

స్వదేశీ తయారీని ప్రోత్సహించడానికి బల్క్ డ్రగ్ మరియు మెడికల్ డివైస్ పార్కుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను ప్రకటించింది. ఈ నేపథ్యంలో, కేంద్ర క్యాబినెట్ 2020 మార్చి 12 న మూడు బల్క్ డ్రగ్ మరియు నాలుగు మెడికల్ డివైస్ పార్కుల అభివృద్ధికి పథకాన్ని ఆమోదించింది . దీనిలో ప్రభుత్వం బల్క్ డ్రగ్‌కు గరిష్టంగా రూ .1,000 కోట్ల పరిమితి ఉన్న రాష్ట్రాలకు గ్రాంట్-ఇన్-ఎయిడ్‌ను విస్తరిస్తుంది. పార్క్ మరియు మెడికల్ డివైస్ పార్కులకు రూ .100 కోట్లు అని రసాయన, ఎరువుల మంత్రిత్వ శాఖ ప్రకటనలో తెలిపింది.

కేంద్రం ఏర్పాటు చేసే బల్క్ డ్రగ్ పార్క్ ఏపీకి తెచ్చే ప్లాన్ లో జగన్ సర్కార్

కేంద్రం ఏర్పాటు చేసే బల్క్ డ్రగ్ పార్క్ ఏపీకి తెచ్చే ప్లాన్ లో జగన్ సర్కార్

ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాకుండా, దేశంలోని ఇతర రాష్ట్రాలు కూడా బల్క్ డ్రగ్ పార్కు కోసం ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు. ఇది చాలా ప్రతిష్టాత్మకమైన మెగా ప్రాజెక్ట్ అని అందరూ భావిస్తున్నారు. కరోనా ఎఫెక్ట్ తో ఆర్ధిక వ్యవస్థ కుదేలైన వేళ చాలా రాష్ట్రాలు పారిశ్రామికాభివృద్ధికి ఈ మెగా ప్రాజెక్ట్ వస్తే బాగుంటుందని ప్రయత్నాలు మొదలు పెట్టాయి . ఈ నేపథ్యంలో ఎలాగైనా బల్క్ డ్రగ్ పార్క్ ను ఏపీకి తీసుకు వస్తే ఒక మెగా ప్రాజెక్టును తీసుకువచ్చినట్లు అవుతుందని, ఏపీలోని యువతకు ఉపాధి దక్కుతుందని, ప్రతిపక్షాల నోటికి తాళం పడుతుందని భావిస్తున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి.

ఏపీఐఐసీకి అనుబంధంగా ఆంధ్రప్రదేశ్ బల్క్ డ్రగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్

ఏపీఐఐసీకి అనుబంధంగా ఆంధ్రప్రదేశ్ బల్క్ డ్రగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్

ఈ క్రమంలోనే ఏపీఐఐసీకి అనుబంధంగా ఆంధ్రప్రదేశ్ బల్క్ డ్రగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు . తూర్పుగోదావరి జిల్లాలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. ఈ బల్క్ డ్రగ్ పార్క్ ద్వారా రానున్న ఎనిమిదేళ్లలో 46,400 కోట్ల రూపాయల అమ్మకాలు జరుగుతాయని, దాదాపు 6,940 కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయని అంచనా వేస్తున్నారు. బల్క్ డ్రగ్ పార్క్ రాబట్టడం కోసం చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే ఏపీఐఐసీకి అనుబంధంగా ఏపీ బల్క్ డ్రగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ను ఏర్పాటు చేశారు.

Recommended Video

Reopening of Schools and Colleges ఇప్పట్లో పాఠశాలలు తెరిచే ఆలోచనే లేదు !
రాష్ట్రాలు పోటీ పడుతున్న వేళ ఏపీ ఈ మెగా పార్క్ విషయంలో సక్సెస్ అవుతుందా ?

రాష్ట్రాలు పోటీ పడుతున్న వేళ ఏపీ ఈ మెగా పార్క్ విషయంలో సక్సెస్ అవుతుందా ?


కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రెండు వేల ఎకరాల భూమిని ఈ పార్క్ కోసం కేటాయించాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలో, కేంద్రం అందించే నిధులతో ఈ పార్క్ అనుకున్న ప్రగతి సాధించే అవకాశం ఉంది. ఇప్పటికే వివిధ రాష్ట్రాల మధ్య పోటీ ఏర్పడుతున్న నేపథ్యంలో 3 మెగా పార్కుల్లో ఒక దానిని ఏపీకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తోంది జగన్ ప్రభుత్వం. దీనికోసం సమగ్రమైన ప్రాజెక్ట్ నివేదిక రూపకల్పనకు ఐఐసీటీ సీఎస్ఐఆర్ సంస్థకు ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. ఒకవేళ ఏపీకి
మెగా బల్క్ డ్రగ్ పార్క్ కేంద్రం కేటాయిస్తే కేంద్రం నుండి వెయ్యి కోట్ల నిధులు వచ్చే అవకాశం ఉంది.

English summary
The Andhra Pradesh government took a crucial decision and issued orders to set up a bulk drug park in the state . APIIC has been entrusted with the responsibility of applying to the Center. Similarly, IICT has issued directives to enter into MOUs with CSIRs as Knowledge Partners, including assigning the responsibility of identifying a private partner. The state cabinet recently approved the proposal to set up a bulk drug park on 2,000 acres.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X