వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోలీసుల ఓట్ల‌కు ఎర‌: పోస్ట‌ల్ బ్యాలెట్లకు బంప‌రాఫ‌ర్లు: డిసైడింగ్ ఫ్యాక్ట‌ర్ ఆ ఓట్లేనా..!

|
Google Oneindia TeluguNews

ఏపిలో అస‌లైన ఎన్నిక‌ల స‌మ‌రం ముగిసింది కానీ, గెలుపు కోసం పార్టీలు..అభ్య‌ర్దులు చివ‌రి వ‌ర‌కు ఉన్న ఏ ఒక్క అవ‌కాశాన్ని వ‌దులుకోవ‌టం లేదు. పోలింగ్ పూర్త‌యినా..ఇప్పుడు పోస్ట‌ల్ బ్యాలెట్ మాత్రం పోల్ అవ్వ‌లేదు. ఏపిలోని ఒక్క పోలీసు శాఖ‌లోనే దాదాపు 50వేల మంది సిబ్బంది పోస్ట‌ల్ బ్యాలెట్ వినియోగించుకుంటున్నారు. వీరిని మ‌చ్చిక చేసుకొనే ప‌నిలో పార్టీల అభ్య‌ర్దులు బంపరాఫ‌ర్లు ప్ర‌తిపాదిస్తున్నారు.

50 వేల‌కు పైగా పోస్ట‌ల్ బ్యాలెట్‌లు
ఎన్నిక‌ల విధుల నిర్వ‌హ‌ణ‌లో భాగంగా నేరుగా ఓటు వేయ‌లేని పోలీసు సిబ్బంది దాదాపు 50వేల మందికి పైగా త‌మ ఓటు హ‌క్కును పోస్ట‌ల్ బ్యాలెట్ ద్వారా వినియోగించుకొనేందుకు సిద్ద‌మ‌య్యారు. ఇందు కోసం వారు ఇప్ప‌టికే పోస్ట‌ల్ బ్యాలెట్‌ను తీసుకున్నారు. వీరికి అద‌నంగా 13వేల మంది హోంగార్డులు పోలింగ్ నాడు డ్యూటీల కార‌ణంగా పోస్ట‌ల్ బ్యాలెట్ వినియోగిస్తున్నారు. ఇక‌, ఇప్పుడు వారు ఎన్నిక‌ల విధులు ముగించ‌టంతో వారి ఓటును త‌మ‌కు అనుకూలంగా మ‌ల‌చుకొనేందుకు అభ్య‌ర్దులు రంగంలోకి దిగారు.

Bumper offers to Postal Ballot voters : TDP and YCP candidates is in final trails

పోలీసు శాఖ‌లో త‌మ‌కు ప‌రిచ‌యం ఉన్న కానిస్టేబుల్లు..హోం గార్డుల ద్వారా వారి స‌హ‌చ‌రుల ఓట్ల‌ను ద‌క్కించుకొనేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నాన‌రు. ఇందు కోసం ఏపిలో అధికారం కోసం పోటీ ప‌డుతున్న రెండు ప్ర‌ధాన పార్టీల అభ్య‌ర్దుల నుండి భారీ ఆఫ‌ర్లు వ‌స్తున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఒక్కో పోస్ట‌ల్ బ్యాలెట్ ఓటు కు రెండు వేల నుండి అయిదు వేల వ‌ర‌కు ఆఫ‌ర్ ఇస్తున్న‌ట్లుగా ప్ర‌చారం సాగుతోంది.

మంగ‌ళ‌గిరి ఫ‌లితం ఎఫెక్ట్‌..
హోరా హోరీ పోరు జ‌రిగింద‌ని భావిస్తున్న నియోజ‌క‌వ‌ర్గాల్లో పోస్ట‌ల్ బ్యాలెట్ల‌కు డిమాండ్ పెరిగింది. త‌మ నియోజ‌క వ‌ర్గాల్లో ఎవ‌రు పోస్ట‌ల్ బ్యాలెట్ తీసుకున్నార‌నే స‌మాచారం సేక‌రించి వారి మ‌ద్ద‌తు కోసం ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ప్ర‌ధానంగా శ్రీకాకుళం, విజ‌య‌న‌గ‌రం, ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో పోలీసు అధికారుల సంఘంలో ఉండే నేత‌ల‌ను ప్ర‌స‌న్నం చేసుకొని వారి ద్వారా సిబ్బంది పోస్ట‌ల్ ఓట్ల‌ను వేయించుకొనే ప్ర‌య‌త్నాలు సాగుతున్నాయి.

ఏపీలో జ్యోతిష్యం Vs వాస్తు ! జగన్‌కు జై కొడుతున్న జోతిష్యం , బాబుకు సై అంటున్న వాస్తు !ఏపీలో జ్యోతిష్యం Vs వాస్తు ! జగన్‌కు జై కొడుతున్న జోతిష్యం , బాబుకు సై అంటున్న వాస్తు !

ఈసారి పోస్ట‌ల్ బ్యాలెట్ కోసం ప్ర‌య‌త్నిస్తున్న అభ్య‌ర్దుల‌కు 2014 ఎన్నిక‌ల్లో మంగ‌ళ‌గిరి ఫలితం వెంటాడుతోంది.అక్క‌డ ఆ ఎన్నిక‌ల్లో తెలుగుదేశం అభ్యర్థి గంజి చిరంజీవి 6 ఓట్లతో విజయం సాధించినట్లు మొదట ప్రకటించారు. ఆ తర్వాత 37 పోస్టల్‌ బ్యాలెట్లను లెక్కించగా 12 ఓట్లతో వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి విజయం సాధించారు. దీంతో..ఇప్పుడు ఏ ఒక్క ఓటును పోగొట్టుకోకుండా...ప్ర‌తీ ఓట‌ను త‌మ వైపు తిప్పుకొనేందుకు చేస్తున్న ప్ర‌యత్నాలు ఎంత వ‌రకు స‌క్సెస్ అవుతాయో చూడాలి.

English summary
AP Political parties and contesting candidates now concentrated on Postal Ballot. To get support from employees candidates offering two thousand to five thousand per vote. Now this matter became more hot topic in political circles
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X