వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాకింగ్: బస్సును వేగంగా నడుపుతూ.. రెండు ఫోన్లతో ఆర్టీసీ డ్రైవర్

కృష్ణా జిల్లా ముళ్లపాడు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం అందరినీ కలచివేసింది. దివాకర్ ట్రావెల్స్ బస్సు కల్వర్టు వద్ద పడి పలువురు మృతి చెందారు. ఈ ఘటనకు డ్రైవర్ తప్పిదమే కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి.

|
Google Oneindia TeluguNews

అమరావతి: కృష్ణా జిల్లా ముళ్లపాడు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం అందరినీ కలచివేసింది. దివాకర్ ట్రావెల్స్ బస్సు కల్వర్టు వద్ద పడి పలువురు మృతి చెందారు. ఈ ఘటనకు డ్రైవర్ తప్పిదమే కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి.

ఇలాంటి సమయంలో సోషల్ మీడియాలో ఓ ఆర్టీసీ బస్సు డ్రైవర్ ప్రయాణీకుల ప్రాణాలను గాలికి వదిలేసి ఫోన్‌ను పదేపదే చూస్తున్న ఓ వీడియో ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. ఇది పాత వీడియో అయినప్పటికీ నెట్లో బాగా చూస్తున్నారు.

<strong>జగన్‌ను అరెస్ట్ చేయించే అధికారం కలెక్టర్‌కు, జైల్లో ఉండి..: బాబు, ముప్పేటదాడి</strong>జగన్‌ను అరెస్ట్ చేయించే అధికారం కలెక్టర్‌కు, జైల్లో ఉండి..: బాబు, ముప్పేటదాడి

Bus driver operating Mobile Phone while driving

కడప నుంచి కర్నూలు వెళ్తున్న ఓ ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ రెండు ఫోన్లకు ఛార్జింగ్‌ పెట్టి, ఓ చేత్తో బస్సును నడుపుతూ, మరో చేత్తో ఫోన్‌లను పదేపదే చూస్తూ డ్రైవింగ్ చేశాడు. సదరు డ్రైవర్ చార్జింగ్ పెట్టడంతో పాటు పదేపదే ఫోన్లను చూస్తూ బస్సును వేగంగా నడిపాడు. ఇప్పటికే రోడ్డు ప్రమాదాలతో అందరూ భయాందోళనకు గురవుతున్నారు. ఈ వీడియో ఇప్పుడు నెట్లో అందరినీ షాకింగ్‌కు గురి చేస్తోంది.

బస్సు డ్రైవర్‌ నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలిచే ఓ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తోంది. కడప నుంచి కర్నూలు వెళుతున్న ఓ ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ విధుల సమయంలో రెండు సెల్‌ఫోన్లు ఉపయోగిస్తూ డ్రైవింగ్‌ చేశాడు. ఛార్జింగ్‌ పెట్టిన ఆ ఫోన్లను బస్సు నడుపుతూనే క్షణానికోసారి చూస్తూ బస్సును వేగంగా నడపసాగాడు. అసలే వరుస రోడ్డుప్రమాదాలతో భయాందోళనలకు గురవుతున్న ప్రయాణికులు ఈ వీడియో చూసి షాక్‌కు గురవుతున్నారు.

English summary
Bus driver operating Mobile Phone while driving in Andhra Pradesh. This videos viral in Internet.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X