వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిరంజీవికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న రోజా: ఏం చేశారంటే?

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హోస్ట్ చేసిన 'మీలో ఎవరు కోటీశ్వరుడు' షోలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా చెప్పిన మాటలను నిజం చేశారు. గత కొది రోజుల క్రితం ఈ షోలో రోజా పాల్గొన్న సంగతి తెలిసిందే.

|
Google Oneindia TeluguNews

చిత్తూరు: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హోస్ట్ చేసిన 'మీలో ఎవరు కోటీశ్వరుడు' షోలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా చెప్పిన మాటలను నిజం చేశారు. గత కొద్ది రోజుల క్రితం ఈ షోలో రోజా పాల్గొన్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో చిరంజీవి అడిగిన పలు ప్రశ్నలకు ఆమె సమాధానం చెప్పారు. దీంతో రూ. 6 లక్షలను గెలుచుకున్నారు.

డబ్బు ఏం చేస్తారు?

డబ్బు ఏం చేస్తారు?

అప్పుడు, ఈ డబ్బును ఏం చేస్తారంటూ రోజాను చిరంజీవి ప్రశ్నించారు. దానికి సమాధానంగా ప్రజలకు బస్ షెల్టర్ కట్టిస్తానని చెప్పారు రోజా. తన నియోజకవర్గం నగరిలో వంద పడకల ఆసుపత్రి ఉందని, అయితే, అక్కడ సరైన బస్ షెల్టర్ లేకపోవడంతో రోగులు అవస్థలు పడుతున్నారని తెలిపారు. అక్కడ బస్ షెల్టర్ నిర్మిస్తే ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని చెప్పారు.

Recommended Video

Venkaiah Naidu praises Roja - Oneindia Telugu
ఇబ్బందులు చూడలేక..

ఇబ్బందులు చూడలేక..

ఈ నేపథ్యంలో అక్కడ బస్ షెల్టర్ నిర్మాణానికి బుధవారం రోజా భూమి పూజ చేశారు. 'మీలో ఎవరు కోటీశ్వరుడు' షోలో తాను గెలుచుకున్న రూ. 6 లక్షల్లో పన్నులు పోగా రూ. 4.50 లక్షల వరకు ఆమెకు వచ్చింది. ఈ మొత్తాన్ని ఆమె బస్ షెల్టర్ నిర్మాణానికి వినియోగించారు.

పాకిస్థాన్‌లో ఉన్నామా?..

పాకిస్థాన్‌లో ఉన్నామా?..

తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో పోలీస్ రాజ్యం నడుస్తోందని రోజా విమర్శించారు. చంద్రబాబు సర్కారు నిరంకుశంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. పరిస్థితి చూస్తుంటే మనం పాకిస్థాన్‌లో ఉన్నామా? భారత్‌లో ఉన్నామా? అనే అనుమానం కలుగుతోందని అన్నారు.

అద్దాల మేడపై రాళ్లు వద్దు..

అద్దాల మేడపై రాళ్లు వద్దు..

కాంగ్రెస్ పాలనలో చంద్రబాబు పాదయాత్ర నిర్వహించారని, అప్పుడు ఇలానే వ్యవహరించే ఉంటే చంద్రబాబు పరిస్థితి ఎలా ఉండేదని రోజా ప్రశ్నించారు. ‘సినీ నటులం అద్దాల మేడలో ఉన్నాం. అద్దాల మేడపై రాయి వేస్తే తిరిగి నిర్మించుకోవడం కష్టం. డ్రగ్స్ వ్యవహారంలో నిజమైన దోషులను శిక్షించండి. విచారణ పేరుతో అందరినీ వేధించడం సరికాదు' అని రోజా అన్నారు.

English summary
Bus shelter construction work launched by YSR Congress MLA RK Roja in Nagari.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X