వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమ‌రావ‌తిలో వ్యాపార దిగ్గ‌జాలు .! లోకేష్ తో భేటీ ఐన ప్ర‌ముఖ కంపేనీల య‌జ‌మానులు..!!

|
Google Oneindia TeluguNews

అమ‌రావ‌తి/హైద‌రాబాద్ : అమ‌రావ‌తిలోని నివాసంలో క్రెడాయ్, బిజినెస్ నెట్వర్క్ ఇంటర్నేషనల్,ఇండియన్ మెడికల్ అసోసియేషన్, మల్లవల్లి ఇండస్ట్రీస్ అసోసియేషన్,నవ్యాంధ్ర ఇండస్ట్రియల్ అసోసియేషన్,స్వర్ణాంద్రా ఇండస్ట్రీస్ అసోసియేషన్ ప్రతినిధులతో మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. 2014 రాష్ట్ర విభజన తరువాత అనేక సమస్యలు ఎదుర్కొన్నామ‌ని, సమస్యలను అధిగమించి అభివృద్ధి సాదించగలిగామ‌ని లోకేష్ తెలిపారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా గ్రామాలను కూడా అభివృద్ధి చేసుకున్నామ‌ని అన్నారు. వ్యవసాయ రంగంలో వృద్ధి సాధించామ‌ని, దేశంలో రెండంకెల వృద్ధి సాధించిన ఒకే ఒక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని లోకేష్ వివరించారు. పారిశ్రామికాభివృద్ధి కోసం అనేక చర్యలు చేప‌ట్టామ‌ని, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నెంబర్ 1 స్థానానికి ఎదిగామ‌ని మంత్రి నారా లోకేష్ అన్నారు.

Business giants in Amravati..! Owners of the Companies Meet with Lokesh..!!

అసోసియేషన్ల వారిగా సమస్యలు,సూచనలు తెలుసుకొని వీలైనంత త్వరగా వారి సమస్యలు పరిష్కారం కోసం కృషి చేస్తా న‌ని మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారు. మరింత మంది మహిళలు పారిశ్రామికవేత్తలుగా రాణించేందుకు ప్రభుత్వం తరపున నిరంతర సహకారం అందిస్తామ‌ని అన్నారు. ప్రతి మూడు నెలలకోసారి వ్యాపార వేత్త‌ల సమస్యలు తెలుసుకొని ఎప్పటికప్పుడు పరిష్కారించ‌డానికి ఒక వినూత్న ప్ర‌క్రియ‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టు తెలిపారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్ లో పారిశ్రామిక రంగం అభివృద్ధి కి అనేక పాలసీలు తీసుకొచ్చామ‌ని, అనేక రాయితీలు కల్పిస్తున్నామ‌ని అన్నారు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి,రియల్ ఎస్టేట్ రంగం మరింత వేగంగా అభివృద్ధి చెందుతున్న‌యాని అసోసియేషన్ల ప్రతినిధులు త‌మ అభిప్రాయాన్ని వ్య‌క్తం చేసారు.

English summary
AP Minister Lokesh said several policies have been brought to the development of industrial sector in Andhra Pradesh and many subsidies are being made. Representatives of associations have expressed their opinion that industrial development and real estate sector is rapidly developing.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X