పాత స్నేహితుడితో కలిసి ఇంట్లోని బంగారం దొంగిలించిన వ్యాపారి భార్య
బంగారం వ్యాపారి భార్య తన ఇంట్లోనే చోరీకి పాల్పడి కటకటాలపాలైన సంఘటన ఏపీలోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది.
నెల్లూరు: బంగారం వ్యాపారి భార్య తన ఇంట్లోనే చోరీకి పాల్పడి కటకటాలపాలైన సంఘటన ఏపీలోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది. నెల్లూరులోని ఆచారి వీధికి చెందిన శంకర్ బంగారం వ్యాపారి. అతడు వ్యాపారం నిమిత్తం బయట ప్రాంతాలకు వెళ్తుంటాడు.
మరో వ్యాపారి రంజిత్ వద్ద బంగారు ఆభరణాలు దాస్తుంటాడు. ఇందులో భాగంగా సుమారు కిలోన్నర బంగారాన్ని తాజాగా రంజిత్ వద్ద ఉంచాడు.

అయితే, ఈ నెల 4వ తేదీన రంజిత్ ఇంట్లో చోరీ జరిగిందని పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ చోరీలో శంకర్ ఇచ్చిన బంగారాన్ని దొంగలు ఎత్తుకుపోయారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దర్యాఫ్తు చేపట్టిన పోలీసులు రంజిత్ భార్య పుజా తన పాత మిత్రుడితో కలిసి చోరీ చేసినట్లు గుర్తించారు.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్‌కు చెందిన స్నేహితుడు రమీద్ షాతో కలిసి ఆమె ఈ బంగారాన్ని దొంగిలించింది. వారిద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. వారి నుంచి కిలోన్నర బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications