విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

‘ఫాదర్‌’తో నగ్నంగా మహిళ : రూ. 5కోట్లు ఇవ్వాలని బ్లాక్‌మెయిల్, ముఠాలో రిపోర్టర్లు

|
Google Oneindia TeluguNews

విజయవాడ: నగరంలో బ్లాక్‌ మెయిలింగ్‌కు పాల్పడుతూ లక్షల్లో సంపాదిస్తున్న ఓ ముఠా వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అక్రమ సంబంధాలనే తమ సంపాదనగా మలుచుకున్న ఆ గ్యాంగ్.. లక్షలతో ఆగిపోకుండా కోట్లకు పడగలెత్తాలని ప్రయత్నించిన వైనం సంచలనం సృష్టిస్తోంది. రూ. 3లక్షలతో మొదలుపెట్టిన ఆ ముఠా ఏకంగా ఒకేసారి రూ. 5 కోట్లు సంపాదించాలని భారీ ప్రణాళికే వేసింది. ఈ ముఠాలో ప్రజలకు ఎప్పటికప్పుడు వార్తలను అందించే విలేకరులే కీలక పాత్రధారులుగా ఉండటం గమనార్హం. కాగా, వీరి బాధితుల్లో ఓ క్రైస్తవ ఫాదర్ కూడా ఉన్నాడు.

ఈ ముఠా చేసిన బ్లాక్‌మెయిలింగ్ వ్యవహారాల వివరాల్లోకి వెళితే.. కృష్ణా జిల్లా పామర్రు ప్రాంతానికి చెందిన ఒక చర్చి ఫాదర్‌కు ఓ మహిళతో సన్నిహిత సంబంధం ఉన్నట్లు విజయవాడలోని ఓ టీవీ ఛానల్ ప్రతినిధికి తెలిసింది. అతని బాధ్యతగా ఇది వార్త అనుకుంటే టీవీలో ప్రసారం చేసి వదిలేయాలి.

కానీ, అతడు ఈ వ్యవహారాన్ని డబ్బులు సంపాదించేందుకు వాడుకున్నాడు. ఈ వ్యవహారాన్ని బయటపెట్టకుండా ఉండాలంటే రూ. 3లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో చేసేదేమీ లేక ఫాదర్ ఆ మొత్తాన్ని ఇచ్చేశారు. ఇదేదో సులువుగా డబ్బు సంపాదించే మార్గంగా తోచడంతో ఇతర విలేకరుల మిత్రులతో కలిసి బ్లాక్ మెయిల్ చేసి డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు.

Busted: reporters blackmail through illegal relationship

ఈ క్రమంలో విదేశీ విరాళాలు బారీగా వచ్చే కేథలిక్ చర్చి ఫాదర్లు, వారి అక్రమ సంబంధాలపై గురిపెట్టారు. నందిగామ, కంచికచర్ల పరిసర ప్రాంతాల్లో ఓ చర్చి ఫాదర్‌కు అదే ప్రాంతానికి చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉన్నట్లు వారి దృష్టికి వచ్చింది. కానీ, ఆ చర్చి ఫాదర్‌ను బ్లాక్ మెయిల్ చేసినా పెద్దగా డబ్బు రాదని వదిలేశారు.

ఆ తర్వాత గుణదల మేరీమాత చర్చికి ఇంఛార్జ్‌గా ఉన్న ఫాదర్‌ను లక్ష్యం చేసుకున్నారు. ఆయన కేథలిక్ సంస్థలో పెద్ద పదవిలో ఉన్న ఫాదర్, పైగా బాగా డబ్బు ఉందన్న సమాచారం కూడా ఉంది. కాగా, నందిగామ, కంచికచర్లకు చెందిన చర్చి ఫాదర్ ను సదరు సంస్థ స్పెండ్ చేసింది.

కాగా, ఆ చర్చి ఫాదర్ చేతిలో మోసపోయిన ఆ మహిళకు న్యాయం చేయాలని కోరుతూ ముఠా సభ్యులు(సదరు విలేకరులు) గుణదలలోని చర్చి ఫాదర్ ను కలిశారు. బాధిత మహిళకు ఏదో రకంగా న్యాయం చేయాలని, అంతేగాక, కంచికచర్లలో అనారోగ్యంతో బాధపడుతున్న వారి కోసం ఇక్కడికి వచ్చి ప్రార్థనలు చేయాలని కోరారు. వీరి మాటలు నమ్మిన ఫాదర్.. కంచికర్లకు వెళ్లి వారు చెప్పినట్లుగా చేశారు.

ఓ మహిళకు స్వస్థత చేకూర్చేందుకు ప్రార్థన చేశారు. ఆ తర్వాత భోజనం చేసి వెళ్లాలని కోరారు ముఠా సభ్యులు. దీంతో ఆ ముఠా మత్తు మందు కలిపిన ఆహారాన్ని ఫాదర్‌కు అందించారు. ఆ ఆహారాన్ని తిన్న ఫాదర్.. అక్కడే స్పృహ కోల్పోయి పడిపోయారు. దీంతో ఆయన పక్కనే ఓ మహిళను నగ్నంగా ఉంచి వీడియోలు, ఫొటోలు తీశారు. ఆ తర్వాత ఆ ఫొటోలను, వీడియోలను చూపించి బెదరింపులకు దిగారు ముఠా సభ్యులు.

ఏం చేయాలో తెలియక ఆ ఫాదర్ ఆందోళనకు గురయ్యాడు. ఆ తర్వాత ముఠా సభ్యులు
రూ. 5 కోట్లు డిమాండ్ చేయగా.. ఫాదర్ రూ. 1.34 కోట్లు వారికి ఇచ్చేశారు. ఆ తర్వాత కూడా బెదిరింపులకు దిగడంతో చేయని తప్పునకు డబ్బులు చెల్లించలేని ఆ ఫాదర్.. విషయాన్ని కేథలిక్ మత పెద్దలకు తెలియజేశారు. వారి సూచనల మేరకు విజయవాడ నగర పోలీస్ కమిషనర్ గౌతం సంవాంగ్‌ను కలిసి ఫిర్యాదు చేశారు.

కమిషనర్ ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన టాస్క్‌ఫోర్స్ రహస్యంగా కేసు దర్యాప్తు ప్రారంభించింది. దర్యాప్తులో మీడియా ప్రతినిధుల పాత్ర ఉండటంతో, వారి కాల్ డేటాను పరిశీలిస్తున్నారు. ఫాదర్ నుంచి వసూలు చేసిన మొత్తాన్ని తిరిగి రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. మీడియా ప్రతినిధులే నిందితులుగా ఉండటంతో రహస్యంగా దర్యాప్తు సాగిస్తున్న పోలీసులు.. పూర్తి ఆధారాలతో ఈ ముఠా గుట్టును రట్టు చేసే అవకాశం ఉంది.

English summary
A case filed on a reporters gang, who were blackmailing through illegal relationship in Vijayawada.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X