. జగన్ సర్కార్‌పై బుచ్చయ్య చౌదరి .. ఆర్ఆర్ఆర్ సాంగ్ పేరడీ సెటైర్స్..
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు హీటెక్కుతున్నాయి. అధికార వైసీపీ , టీడీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి జగన్ పాలనపై తనదైన శైలిలో సెటైర్స్ విసిరారు. రాజమౌళి దర్శకత్వంలో నిర్మించిన జూ. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటించిన RRR మూవీ లోని నా పాట సూడు .. నా పాట సూడు సాంగ్‌కు వైసీపీ ప్రభుత్వ పాలనకు లింక్ పెడుతూ విమర్శనాస్త్రాలు సందించారు. ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది

నా పాట సూడు.. నా పాట సూడు
ఏపీ సర్కార్ అప్పులు.. మంత్రుల తీరుపై ఓ రేంజ్లో బుచ్చయ్య చౌదరి విమర్శలు చేశారు. ట్రీబుల్ ఆర్ సాంగ్‌ను పేరడీ చేసి ట్వీట్ చేశారు. నా పాట సూడు.. నా పాట సూడు.. నా పాలన సూడు, నా పాలన సూడు వేస్టు .. వేస్టు.. వేస్టు అంటూ చేసిన ట్వీట్ వైరగా మారింది. ఈ ట్వీట్‌పై నెటిజన్లు సోషల్ మీడియాలో విపరీతమైన కామెంట్లు చేస్తున్నారు ..

పోలవరం డ్యామ్ కోసం బెట్టింగ్ రాజు ఊగినట్టు..
అటు జగన్ సర్కార్ అప్పులపై కూడా గోరంట్ల విమర్శలు సందించారు. అప్పులోళ్ళ ఖాతాల్లో వడ్డీ రేట్లు పెరిగినట్టు.. పోలవరం డ్యామ్ కోసం బెట్టింగ్ రాజు ఊగినట్టు.. నోటి బురద మాటలతో గుడివాడ లోన ఎగిరి నట్టు..ప్రత్యేక హోదా నీడ లో రాజకీయం చేసినట్టు.. ఎన్నికల హామీ లు కొండఎక్కించి నట్టు.. నా పాలన సూడు, నా పాలన సూడు, నా పాలన సూడు.. వెస్టు.. వేస్టు.. వేస్టు అంటూ పేరడీతో ట్వీట్ చేశారు బుచ్చయ్య చౌదరి. ఎన్నికల ముందు ఏపీ ఆదాయాన్ని పెంచుతామన్న జగన్ ఎన్నికల తర్వాత రాష్ట్రాన్ని అప్పులు పెంచుతా అన్నట్లు పాలన సాగిస్తున్నారని గోరంట్ల సెటైర్లు వేశారు.
వేస్టు.. వేస్టు... పిచ్చ వేస్టు.. వేస్టు
అంతటితో ఆగని బుచ్చయ్య చౌదరి సీఎం జగన్ మోహన్ రెడ్డికి చెందిన సాక్షి పేపర్, టీవీపైనా సెటైర్లు విసిరారు. వేస్టు.. వేస్టు... పిచ్చ వేస్టు.. వేస్టు.. యక్షి న్యూస్ లాగా పిచ్చ వేస్టు.. అంటూ ట్వీట్ చేశారు. చివర్లో 'జ'నంతో... 'జ'గన్నటక...'జై'లు పక్షి అంటూ జగన్‌పై సెటైర్లు కుమ్మరించారు.
నా పాలన సూడు.. నా పాలన సూడు.. వేస్టు.. వేస్టు..!' అంటూ ఓ గంట ముందు ఆయన ట్వీట్ చేశారు. సాయంత్రం ఆరు గంటలకు వరకు వేచి ఉండండి అంటూ ముందే చెప్పారు. అనంతరం ఆయన పేరడీ చేస్తూ.. ట్వీట్ చేశారు. 'ఎన్నికల ముందు రాష్ట్ర ఆదాయాన్ని పెంచుతా.. ఎన్నికలు తరువాత రాష్ట్ర అప్పులు పెంచుతా..' అన్నట్లు ఉందని బుచ్చయ్య చౌదరి సెటైర్లు వేశారు. ట్వీట్టర్ ఈ ట్వీట్ హల్ చల్ చేస్తుంది.