వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రజలకు నమ్మకం పోతుంది: బుట్టా రేణుక, 'వాజపేయి చేయంది మోడీ చేస్తారని ఆశ'

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: తలుపులు మూసి రాష్ట్రాన్ని విడగొట్టారని కర్నూలు ఎంపీ బుట్టా రేణుక శుక్రవారం అన్నారు. తెలుగుదేశం ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం సందర్భంగా ఆమె లోకసభలో మాట్లాడారు. ప్రధానమంత్రి ఇచ్చిన హామీని నెరవేర్చకపోతే పార్లమెంటరీ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పోతుందన్నారు. అయిదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ హామీ ఇచ్చారని చెప్పారు.

కంప్యూటర్లు చూడాలనుకుంటున్నారు సరే.. అసదుద్దీన్

మీకు కాంగ్రెస్ ముక్త్ భారత్ కావాలా లేక ముస్లీం విముక్త భారత్ కావాలా అని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రశ్నించారు. కాశ్మీర్ పైన మీ వైఖరి ఏమిటని ప్రశ్నించారు. ముస్లీం పిల్లల చేతుల్లో కంప్యూటర్లు చూడాలని ఉందని మోడీ చెబుతారని, కానీ స్కాలర్‌షిప్‌లు, ఉద్యోగాలు ఎందుకు ఇవ్వడం లేదన్నారు.

Butta Renuka and Asaduddin Owaisi in Lok Sabha over No Confidence Motion

వాజపేయి చేయనిది మీరు చేస్తారని ఆశిస్తున్నా: ఫరూక్

ముస్లీంలపై దాడులు ఆపాలని జమ్ముకాశ్మీర్ ఎంపీ ఫరూక్ అబ్దుల్లా అన్నారు. మీరు ఎంత భారతీయులో ముస్లీంలు కూడా అంతే భారతీయులు అన్నారు. సమస్యల పరిష్కారం కోసం ఉత్తర కొరియా, అమెరికాలు చర్చలు జరుపుతున్నాయని, ఇప్పుడు మీకు పూర్తి మెజార్టీ ఉందని, వాజపేయి చేయనిది మీరు చేస్తారని ఆశిస్తున్నానని మోడీని ఉద్దేశించి అన్నారు. సమస్య పరిష్కారానికి మేం మీకు అండగా ఉంటామన్నారు. మనలను ఏ ఇతర దేశమోడో చంపడని, మనల్ని మనమే చంపుకుంటామన్నారు. తాము కాశ్మీరీల గుండెచప్పుడు వినిపిస్తున్నామని చెప్పారు.

English summary
Kurnool MP Butta Renuka and Asaduddin Owaisi in Lok Sabha over No Confidence Motion.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X