కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైసిపిలో ఏం జరుగుతుందో తెలియట్లేదు: బుట్టా రేణుక, 'వారికి టిడిపిలో చేరాలని ఉన్నా'

|
Google Oneindia TeluguNews

Recommended Video

సీఎం ఇంటికి చేరిన బుట్టా రేణుక వీడియో | Oneindia Telugu

అమరావతి: చంద్రబాబు పనితీరును ఇతర రాష్ట్రాల ఎంపీలు కూడా కొనియాడుతున్నారని కర్నూలు ఎంపీ బుట్టా రేణుక అన్నారు. మంగళవారం ఆమె సీఎం చంద్రబాబు నాయుడును తన అనుచరులతో కలిశారు.

ఈ సందర్భంగా బుట్టా రేణుక అనుచరులు టిడిపిలో చేరారు. ఆమె కూడా టిడిపిలో చేరినట్లే. కానీ అధికారికంగా మాత్రం చంద్రబాబు విదేశీ పర్యటన అనంతరం చేరనున్నారు.

 చంద్రబాబుకు బుట్టా రేణుక ప్రశంసలు

చంద్రబాబుకు బుట్టా రేణుక ప్రశంసలు

ఈ సందర్భంగా బుట్టా రేణుక మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధి కోసమే తాను తెలుగుదేశం పార్టీలో చేరుతున్నానని చెప్పారు. చంద్రబాబు నిరంతరం అభివృద్ధి కోసం తాపత్రయపడుతున్నారన్నారు. రాష్ట్రాన్ని ముందుకు తీసుకు వెళ్తున్నారని చెప్పారు. తన భర్త వైసిపితో విభేదించినా తాను కొనసాగానని చెప్పారు.

 అందుకే టిడిపిలో చేరాలని నిర్ణయించుకున్నా

అందుకే టిడిపిలో చేరాలని నిర్ణయించుకున్నా

రాష్ట్రాభివృద్ధి కోసం చంద్రబాబు నిరంతరం కృషి చేస్తున్నారని, ఆయన ఉన్నత ఆశయాలతో ముందుకు సాగుతున్నారని రేణుక చెప్పారు. ఆయనకు అండగా ఉండేందుకు టిడిపిలో చేరాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. తొమ్మిదేళ్ల పాలన అనంతరం మళ్లీ సువర్ణపాలన చూస్తున్నామన్నారు.

 నా నిర్ణయం వెనుక రాజకీయం లేదు

నా నిర్ణయం వెనుక రాజకీయం లేదు

అభివృద్ధి కోరుకునే వారు టిడిపిలో చేరాలని బుట్టా రేణుక పిలుపునిచ్చారు. రాజకీయాల్లోకి వచ్చి మూడేళ్లయినా తాను ఎన్నడూ రాజకీయాలు చేయలేదన్నారు. అందుకే అభివృద్ధి కోసం టిడిపిలో చేరుతున్నానని చెప్పారు. తన నిర్ణయం వెనుక పార్టీ ఫిరాయింపులు, ఎవరినో మోసం చేయడాలు లేవని జగన్‌ను ఉద్దేశించి అన్నారు. వైసిపిని వీడటం వెనుక రాజకీయ కారణాలు లేవని చెప్పారు.

 కర్నూలు బహిరంగ సభలో టిడిపిలో చేరిక

కర్నూలు బహిరంగ సభలో టిడిపిలో చేరిక

చంద్రబాబు విదేశీ పర్యటన అనంతరం బుట్టా రేణుక టిడిపిలో చేరనున్న విషయం తెలిసిందే. కర్నూలులో పెద్ద ఎత్తున బహిరంగ సభను ఏర్పాటు చేసి అధికార పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు.

వైసిపి తీరు నాకు మింగుడుపడటం లేదు

వైసిపి తీరు నాకు మింగుడుపడటం లేదు

గత నెల రోజులుగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోని పరిస్థితులు తనకు ఏమాత్రం మింగుడు పడటం లేదని బుట్టా రేణుక ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనను పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేశారో వైసిపి నేతలు, జగనే చెప్పాలన్నారు. తద్వారా జగన్‌ను టార్గెట్ చేశారు. మరోవైపు, అభివృద్ధిని చూసి టిడిపి వైపు ఆకర్షితురాలిని అయ్యానని చెప్పారు. తన రాజకీయ ప్రయాణాన్ని చంద్రబాబు నిర్ణయిస్తారని చెప్పారు.

 వారే టిడిపికి మద్దతిస్తున్నారు

వారే టిడిపికి మద్దతిస్తున్నారు

రాష్ట్ర భవిష్యత్తును కోరుకునే వారే టిడిపికి మద్దతిస్తున్నారని ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు అన్నారు. అలాంటి వారు టిడిపికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మనం సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకున్నామని చెప్పారు.

 బుట్టా రేణుక మద్దతు సంతోషం, వారు బయటపడట్లేదు

బుట్టా రేణుక మద్దతు సంతోషం, వారు బయటపడట్లేదు

బుట్టా రేణుక టిడిపికి మద్దతు పలకడం సంతోషకరమన్నారు. ప్రభుత్వం చేసే మంచి పనిని చూసి టిడిపిలో చేరుతున్నారని చెప్పారు. మంచిని ప్రోత్సహించే వారు టిడిపికి మద్దతివ్వాలన్నారు. కొంతమందికి మద్దతివ్వాలని ఉన్నప్పటికీ బయటపడలేకపోతున్నారని చెప్పారు. వారు కూడా త్వరలో టిడిపిలో చేరుతారన్నారు. త్వరలో మరింత మంది టిడిపిలోకి వస్తారని చెప్పారు.

English summary
Kurnool MP Butta Renuka interesting comments on YSR Congress Party after meeting with Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X