కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బాబు సమక్షంలో టిడిపిలోకి బుట్టా రేణుక కానీ ట్విస్ట్: జగన్‌ను దెబ్బతీసేందుకే

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, కర్నూలు ఎంపీ బుట్టా రేణుక మంగళవారం ఉదయం తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆమె ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసంలో ఆయనను కలిశారు.

|
Google Oneindia TeluguNews

అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, కర్నూలు ఎంపీ బుట్టా రేణుక మంగళవారం ఉదయం తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆమె ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసంలో ఆయనను కలిశారు.

ఆగండి! పార్టీ మారడంపై అన్నీ చెబుతా: బుట్టా రేణుక ఆసక్తికర వ్యాఖ్యలుఆగండి! పార్టీ మారడంపై అన్నీ చెబుతా: బుట్టా రేణుక ఆసక్తికర వ్యాఖ్యలు

అమావాస్య కాబట్టి అధికారికంగా చేరిక వాయిదా

అమావాస్య కాబట్టి అధికారికంగా చేరిక వాయిదా

బుట్టా రేణుక టిడిపిలో చేరినట్లే. కానీ అధికారికంగా ఆమె ఇంకా చేరలేదు. రేపు అమావాస్య కావడంతో తెలుగుదేశం పార్టీలో చేరికను వాయిదా వేసుకున్నారని తెలుస్తోంది.

 చంద్రబాబు విదేశీ పర్యటన అనంతరం

చంద్రబాబు విదేశీ పర్యటన అనంతరం

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. ఆయన విదేశీ పర్యటన అనంతరం బుట్టా రేణుక అధికారికంగా తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు.

 ప్రస్తుతానికి ఇలా.. పథకాలు నచ్చి

ప్రస్తుతానికి ఇలా.. పథకాలు నచ్చి

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, టిడిపి పథకాలు నచ్చి చంద్రబాబును కలిసేందుకు వచ్చినట్లు బుట్టా రేణుక ఈ సందర్భంగా చెప్పారు. చంద్రబాబు విదేశీ పర్యటన అనంతరం టిడిపిలో చేరుతానని చెప్పారు.

జగన్‌ను దెబ్బతీసేందుకే వ్యూహం

జగన్‌ను దెబ్బతీసేందుకే వ్యూహం

చంద్రబాబు విదేశీ పర్యటన, అమావాస్య వంటి కారణాలు చెబుతున్నప్పటికీ బుట్టా రేణుక టిడిపిలో చేరిక వాయిదా పడటం వెనుక జగన్ పాదయాత్రను దెబ్బతీయడమే కారణంగా భావిస్తున్నారు. నవంబర్ 2వ తేదీన జగన్ పాదయాత్ర ప్రారంభం కానుంది.

 వైసిపికి షాక్ తగిలినట్లవుతుందని

వైసిపికి షాక్ తగిలినట్లవుతుందని

ఈ నేపథ్యంలో ఆ సమయంలో కొద్దిగా అటు ఇటు టిడిపిలో చేరితే వైసిపికి షాక్ తగిలినట్లవుతుందని భావిస్తున్నారు. జగన్ పైన చంద్రబాబు మైండ్ గేమ్ ప్రకారమే బుట్టా రేణుక తన చేరికను వాయిదా వేసుకున్నారని అంటున్నారు.

English summary
YSR Congress Party Kurnool MP Butta Renuka joined Telugu Desam party on Tuesday in the presence chief minister Nara Chandrababu Naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X