వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అక్షయ తృతీయ నాడు బంగారం కొనడమే పాపం - చాగంటి.. ఆఫర్లతో బంగారం కొనుగోలుపై మహిళల క్రేజ్

|
Google Oneindia TeluguNews

అక్షయ తృతీయ వచ్చిందంటే చాలు బంగారం కొనుగోళ్లతో షాపులన్నీ రద్దీగా మారుతున్నాయి . జ్యూవెలరీ షాపులు ఆఫర్లతో ముఖ్యంగా మహిళాలోకాన్ని ఆకట్టుకుంటున్నాయి. అక్షయ తృతీయ రోజు బంగారం కొనుగోలు చేస్తే అదృష్టం అనే ప్రచారం జోరుగా సాగటంతో అక్షయతృతీయకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. అయితే తాజాగా ఇదే అంశంపై ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రవచన బ్రహ్మ చాగంటి కోటేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు.

అక్షయ తృతీయ రోజు బంగారం కొంటే పాపం కొన్నట్టేనన్న చాగంటి

అక్షయ తృతీయ రోజు బంగారం కొంటే పాపం కొన్నట్టేనన్న చాగంటి

అక్షయ తృతీయ రోజున బంగారం కొంటే పాపం కొనుగోలు చేసినట్టేనని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త చాగంటి కోటేశ్వరరావు ప్రవచించారు. బంగారంలో కలి పురుషుడు ఉంటాడంటూ అసలు బంగారం కొనాలని ఎవరూ చెప్పారో అర్ధం కావట్లేదు అని ఆయన అన్నారు . అక్షయతృతీయ సమయంలో చాగంటి చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

చాగంటి చేసిన వ్యాఖ్యలను వైరల్ చేస్తున్న పురుషులు.. బంగారం కొనుగోలుపై ఆసక్తి చూపుతున్న మహిళలు

చాగంటి చేసిన వ్యాఖ్యలను వైరల్ చేస్తున్న పురుషులు.. బంగారం కొనుగోలుపై ఆసక్తి చూపుతున్న మహిళలు



మహిళాలోకానికి అక్షయ తృతీయ అంటే ఒక పండుగ రోజు .. ఎంతో కొంత బంగారం భర్త చేత కొనిపించి జేబులకు చిల్లులు పెట్టే రోజు. ఇక భర్తలకు మాత్రం అక్షయతృతీయ వచ్చిందంటే చాలు గండంగా భావించే రోజు. జ్యూవెలరీ షాపులను బాగు చేసే రోజు . మగవారికి నచ్చని, ఆడవారికి పరమ ప్రీతిపాత్రమైన అక్షయ తృతీయ రోజు బంగారం కొనుగోలు చెయ్యటంపై చాగంటి చేసిన వ్యాఖ్యలు మగవాళ్ళ నెత్తిన పాలు పోసినట్టు ఉన్నాయని భావించి ఇప్పుడు చాగంటి వ్యాఖ్యలను తెగ వైరల్ చేసే పనిలో పడ్డారు పురుష పుంగవులు.

అక్షయ తృతీయ రోజు ఏదైనా దానం ఇవ్వాలి కానీ కొనుగోలు చెయ్యొద్దు అంటున్న ఆధ్యాత్మిక వేత్తలు

అక్షయ తృతీయ రోజు ఏదైనా దానం ఇవ్వాలి కానీ కొనుగోలు చెయ్యొద్దు అంటున్న ఆధ్యాత్మిక వేత్తలు

చాగంటి వ్యాఖ్యల్లో సైతం నిజముందంటూ ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు. అక్షయ తృతీయ రోజు దానం చేస్తే మంచిది కానీ బంగారం కొంటే పాపం అని చెప్తున్నారు. ఏ ధర్మశాస్త్రాల్లోనూ అక్షయ తృతీయ రోజున బంగారం కొనుగోలు చేయాలంటూ లేదని.. ఈ ఆచారం ఎలా వచ్చిందో కూడా తమకు తెలియదని చెబుతున్నారు ఆధ్యాత్మిక వేత్తలు . ఆరోజున బంగారం కొని తీరాలని కేవలం జ్యూవెలరీ షాపుల వారి ప్రచారంతో ప్రజల్లో ఎక్కడలేని వేలంవెర్రి పట్టిందని అంటున్నారు. మహిళల సెంటిమెంట్ ను అడ్డం పెట్టుకుని వ్యాపారులు కాసుల పంట పండిస్తున్నారని చెబుతున్నారు .

ఆఫర్ల మాయలో పడి బంగారం కోసం మహిళల వేలంవెర్రి .. ఏ మాత్రం మంచిది కాదంటున్న నిపుణులు

ఆఫర్ల మాయలో పడి బంగారం కోసం మహిళల వేలంవెర్రి .. ఏ మాత్రం మంచిది కాదంటున్న నిపుణులు

చాగంటి కోటేశ్వరరావు చేసిన వ్యాఖ్యలను పెద్ద ఎత్తున ప్రచారం చేసినా మహిళల మనసును మాత్రం పెద్దగా మార్చలేకపోతుంది. బంగారం కొనుగోళ్లపై పెద్దగా ప్రభావం చూపటం కష్టమే అన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. అక్షయతృతీయకు గోల్డ్ షాపులు పెట్టే ఆఫర్ల మాయలో పడి చాగంటి చెప్పిన విషయాలను , ప్రవచనాలను కూడా అక్షయ తృతీయ రోజు మాత్రం పక్కన పెట్టేసేలా ఉన్నారు మహిళలు . అయితే ఇలా వేలంవెర్రిగా అక్షయ తృతీయ నాడు బంగారం కొనుగోలు చెయ్యటం మంచిది కాదని చెప్తున్నారు చాలా మంది ప్రముఖులైన ఆధ్యాత్మిక వేత్తలు .

English summary
The famous spiritual leader Chaganti Koteswara Rao predicted that buying gold is a sin on Akshaya thritiya . He said that nobody told us to buy gold on akshaya thritiya. These comments made sensation and now viral in social media. Spiritualists say that even in the comments of Chaganti is true.Even though the statements of Chaganti Koteswara Rao made a lot of publicity, women's minds can not change much. It is difficult to make a huge impact on gold purchases. women are getting fooled on the offers of akshaya thritiya by jewellery shops and women are buying gold.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X