వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ బిల్లును అడ్డుకుంటాం: బివి రాఘవులు

By Pratap
|
Google Oneindia TeluguNews

BV Raghavulu
హైదరాబాద్: రాష్ట్ర విభజన విషయంలో కేంద్ర ప్రభుత్వం తీరుపై సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లును పార్లమెంట్, అసెంబ్లీలో అడ్డుకుంటామని స్పష్టం చేశారు. తాము రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకుంటున్నామని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.
బిల్లులో ప్రతిపాదించిన అంశాలు కూడా మరిన్ని వేర్పాటువాద ఉద్యమానికి ఊతం ఇచ్చే విధంగా ఉన్నాయని రాఘవులు అభిప్రాయపడ్డారు. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని ఆయన చెప్పారు. బిల్లు వల్ల మరోసారి విభజన ఉద్యమాలు రావచ్చునని ఆయన అన్నారు.

ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలపై పూర్తిగా నిర్లక్ష్యం వహించారని ఆయన విమర్శించారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోరుతూ ఆందోళనా కార్యక్రమాలు చేపడుతామని రాఘవులు చెప్పారు. తెంలగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు అస్పష్టంగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

రాష్ట్రంలో దాదాపు పది వేల కోట్ల రూపాయల విద్యుత్ చార్జీల పెంపునకు రంగం సిద్ధమైందని ఆయన అన్నారు. ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. బ్రిజేష్ ట్రిబ్యునల్ తీర్పు గెజెట్ కాకుండా చూడాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. మారిన పరిస్థితులకు అనుగుణంగా తీర్పుపై పునరాలోచన జరిగేలా చూడాలని ఆయన డిమాండ్ చేశారు.

జ్యోతిబసు శత జయంతి ఉత్సవాల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా మతోన్మాద వ్యతిరేక ప్రచారం చేయాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. ఈ నెల 12వ తేదీన జరిగే రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో విద్యుత్ చార్జీల పెంపునకు నిరసనగా ఆందోళనా కార్యక్రమాలను రూపొందించనున్నట్లు ఆయన తెలిపారు.

English summary

 CPM secretary BV Raghavulu said that his party will obstruct the Telangana bill in assembly and Parliament.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X