• search
  • Live TV
అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

APలో ఉపఎన్నికలు : మూడు రాజధానులు- ముగ్గురు ఎమ్మెల్యేలు : జగన్‌కు రిఫరెండమేనా ..!!

By Lekhaka
|

ఏపీలో ఉప ఎన్నికలు జరగనున్నాయా. మారుతున్న సమీకరణాలు..తాజా ప్రకటనలు...నిర్ణయాలు అవుననే చెబుతున్నాయి. కరోనా తగ్గుముఖం పట్టటంతో పాలనా పరమైన నిర్ణయాలను మరింత వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి జగన్ భావిస్తున్నారు. ఇప్పటికే రెండేళ్ల పాలన పూర్తయింది. వచ్చే ఎన్నికల నాటికి అన్ని అస్త్ర శస్త్రాలతో సిద్దం అయ్యేందుకు అన్ని కోణాల్లో బలంగా ఉండాలనేది జగన్ భావన. ఇందు లో భాగంగా..ఇప్పటికే నిర్ణయించిన మూడు రాజధానుల వ్యవహారం త్వరగా అమలు చేయాలనే ఆలోచనలో ఏపీ ప్రభుత్వం ఉంది. న్యాయస్థానాల్లో ఈ అంశం పైన కేసులు ఉండటం..కరోనా కారణంగా నిర్ణయం ఇప్పటికీ అమలు కాలేదు. మొత్తంగా ప్రభుత్వాన్ని విశాఖ నుండి నడింపేందుకు న్యాయ పరమైన చిక్కులుంటే..ముందుగా తాను విశాఖ వెళ్లి అక్కడ నుండే పాలన సాగించాలని సీఎం భావిస్తున్నట్లుగా తెలుస్తోం ది. అందులో భాగంగానే..కరోనా తగ్గుతూనే మంత్రులు..వైసీపీ ముఖ్యులు ఏ క్షణమైనా విశాఖ నుండి పాలన ప్రారంభమవుతుందని చెబుతూ వస్తున్నారు.

మూడు రాజధానులు..ముగ్గురు ఎమ్మెల్యేలు

మూడు రాజధానులు..ముగ్గురు ఎమ్మెల్యేలు

ఈ నిర్ణయం త్వరగా అమలు చేయటం ద్వారా 2024 ఎన్నికల నాటికి టీడీపీకి ఏ ప్రాంతంలోనూ నినాదం లేకుండా చేయాలనేది వైసీపీ వ్యూహంగా కనిపిస్తోంది. అయితే, మూడు ప్రాంతాల ప్రజల్లోనూ వైసీపీ పట్ల వ్యతిరేకత ఉందని..మూడు రాజధానుల నిర్ణయం అమలు సాధ్యం కాదనేది టీడీపీతో సహా ఇతర పార్టీల నేతల వాదన. ఇప్పటికే ఈ నిర్ణయం తరువాతనే జరిగిన పంచాయితీ..మున్సిపల్ ఎన్నికల్లో అమరావతి ప్రాంతంలోనూ వైసీపీ విజయం సాధించింది. ఇక, రాజకీయంగానూ టీడీపీని నైతికంగా దెబ్బ తీయాలనేది వైసీపీ వ్యూహంగా తెలుస్తోంది. ఇందు కోసం ప్రజల్లో తమకు తిరుగులేని మద్దతు ఉందని చెబుతున్న వైసీపీ..మరోసారి ప్రజల్లోనే టీడీపీ దెబ్బ తీయాలని ఆలోచనలో ఉందని పార్టీ వర్గాల సమాచారం. ఇందు కోసం ఇప్పటికే టీడీపీ నుండి ముగ్గురు ఎమ్మెల్యేలు వైసీపీకి దగ్గరయ్యారు.

అమరావతిలోనూ వైసీపీదే బలమంటూ..

అమరావతిలోనూ వైసీపీదే బలమంటూ..

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరి తో టీడీపీ ద్వారా దక్కిన ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయించి...వైసీపీ అభ్యర్ధులుగా పోటీ చేయిస్తారని పార్టీ లో ప్రచారం జరుగుతోంది. తిరిగి వారి ముగ్గురిని వైసీపీ ఎమ్మెల్యేలుగా గెలిపించుకుంటే..ఫిరాయింపుల అంశం..విమర్శలకు తావుండదని వివరిస్తున్నారు. ఈ మూడు నియోజకవర్గాలు అమరావతి రాజధానికి దగ్గరగా ఉండేవే. అక్కడ ముగ్గురిని గెలిపించుకుంటే టీడీపీ ఖచ్చితంగా ఆత్మరక్షణలో పడుతుందనే అంచనాతో వైసీపీ కనిపిస్తోంది. అదే విధంగా 2024 ఎన్నికల్లో వైసీపీ క్రిష్ణా..గుంటూరు జిల్లాల్లో దెబ్బ తింటుందనే ప్రచారానికి ఇది సమాధానంగా ఉంటుందని వైసీపీ నేతలు విశ్లేషిస్తున్నారు. అదే విధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి మద్దతుగా రాజీనామా చేసిన గంటా వ్యవహారం ఇప్పుడు స్పీకర్ వద్ద పెండింగ్ లో ఉంది. గంటా రాజీనామా ఆమోదించినా..తాను తిరిగి పోటీ చేయనని ఇప్పటికే ప్రకటించారు. కానీ, స్టీల్ ప్లాంట్ అంశం పైన సీఎం జగన్ తాజా ఢిల్లీ పర్యటనలో స్పష్టత కోరుతున్నారు. దాని తరువాతనే గంటా రాజీనామా అంశంలో నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.

 ఉప ఎన్నికలు..2024 సెమీ ఫైనల్స్..

ఉప ఎన్నికలు..2024 సెమీ ఫైనల్స్..

ఇప్పటికే ఏపీలో బద్వేలు..తెలంగాణలో హుజూరాబాద్ కు ఉప ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే, 2019 ఎన్నికల్లో అంతలా కనిపించిన జగన్ వేవ్ లోనూ టీడీపీ ఈ మూడు నియోజకవర్గాల్లో గెలిచింది. దీంతో..టీడీపీ సైతం అప్రమత్తమవుతోంది. వైసీపీ ఈ ప్రణాళిక అమలుకు అడుగులు వేస్తే.. వెంటనే టీడీపీ నేతలు సైతం రంగంలోకి దిగనున్నారు. 2024 ఎన్నికలకు ముందుగా జరిగే ఈ ఉప ఎన్నికలు సెమీ ఫైనల్స్ గా మారనున్నాయి. దీని పైన కొద్ది రోజుల్లోనే స్పష్టత రానుంది. దీంతో...అటు రాజకీయంగా..ఇటు పాలనా పరంగా ముఖ్యమంత్రి జగన్ వేగంగా నిర్ణయాలు తీసుకోవటం ఖాయంగా కనిపిస్తోంది.

English summary
By Poll may take place in AP shortly as a part of YCP political stategy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X