వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘నంద్యాల’ షాక్: బాలకృష్ణతో చర్చలు, టీడీపీలోకి కీలక నేత బైరెడ్డి.?

తెలుగుదేశం పార్టీలోకి రాయలసీమకు చెందిన మరో కీలక నేత చేరుతున్నట్లు సమాచారం. ఆయనెవరో కాదు.. రాయలసీమ పరిరక్షణ సమితి(ఆర్పీఎస్) వ్యవస్థాపకుడు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి.

|
Google Oneindia TeluguNews

Recommended Video

Rajasekhar Reddy To Join TDP! ‘నంద్యాల’షాక్ : బాలకృష్ణతో చర్చలు

అమరావతి: తెలుగుదేశం పార్టీలోకి రాయలసీమకు చెందిన మరో కీలక నేత చేరుతున్నట్లు సమాచారం. ఆయనెవరో కాదు.. రాయలసీమ పరిరక్షణ సమితి(ఆర్పీఎస్) వ్యవస్థాపకుడు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి. సీమ హక్కుల కోసం పార్టీని స్థాపించిన ఆయన టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణతో భేటీ అయినట్లు సమాచారం.

గతంలో టీడీపీ నుంచి 2సార్లు గెలుపొందిన బైరెడ్డి..

గతంలో టీడీపీ నుంచి 2సార్లు గెలుపొందిన బైరెడ్డి..

తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి నందికొట్కూరు నియోజకవర్గం నుంచి 1994, 1999లలో రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2004లో కాంగ్రెస్‌ అభ్యర్థి గౌరు చరిత చేతిలో ఓడిపోయారు. 2009లో నియోజకవర్గాల పునర్వి భజనలో భాగంగా నందికొట్కూరు ఎస్సీకి రిజర్వ్‌ చేశారు. దీంతో ఆయన పాణ్యం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.

చంద్రబాబుకు సన్నిహితుడిగా

చంద్రబాబుకు సన్నిహితుడిగా

నందికొట్కూరు, పాణ్యం నియోజకవర్గాల్లోనే గాక. జిల్లా వ్యాప్తంగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు బైరెడ్డి. టీడీపీలో ఉండగా అధ్య క్షుడు చంద్రబాబుకు సన్నిహితుడుగా పేరు తెచ్చుకున్నారు. అందువల్లే 2006లో చంద్రబాబు బైరెడ్డికి టీడీపీ జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చారు. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగానూ కొనసాగారు. ఆ సమయంలో జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా తిరిగి పార్టీ బలోపేతం కోసం కృషి చేశారు. అప్పటి సీఎం వైయస్‌ రాజశేఖర్‌రెడ్డిపై తీవ్ర విమర్శలు చేసి సంచలనగా మారారు.

సీమ కోసం ఆర్పీఎస్

సీమ కోసం ఆర్పీఎస్

1993లో కాంగ్రెస్‌ను వీడిన బైరెడ్డి.. టీడీపీలో చేరారు. 1995లో టీడీపీలో తలెత్తిన సంక్షోభంలో ఎన్టీఆర్‌ వైపు నిలిచారు. ఎన్టీఆర్‌ మరణానంతరం 1996లో చంద్రబాబు అధ్యక్షుడిగా ఉన్న టీడీపీలో చేరారు. 2013 వరకు ఆ పార్టీలో కొనసాగారు. 2013లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సందర్భంలో ప్రత్యేక రాయలసీమ కావాలంటూ టీడీపీని వీడి రాయలసీమ పరిరక్షణ సమితిని స్థాపించారు. ప్రత్యేక రాయలసీమ జెండాను చేత పట్టుకొని రాయలసీమ ఉద్యమాన్ని ఉధృతంగా నడిపించారు. బస్సుయాత్ర ద్వారా రాయలసీమ జిల్లాల్లో పర్యటంచారు.

షాకిచ్చిన నంద్యాల ఉప ఎన్నిక

షాకిచ్చిన నంద్యాల ఉప ఎన్నిక

రాయలసీమ వాదాన్ని బలంగా వినిపించంలో భాగంగా బైరెడ్డి నంద్యాల ఉప ఎన్నిక బరిలో ఆర్పీఎస్‌ అభ్యర్థిగా భవనాశి పుల్లయ్యను బరిలో దింపారు. ఈ ఎన్నికలో విజయం దక్కకపోయినా.. రెండు, మూడు స్థానాల్లోనైనా నిలుస్తుందనుకున్నారు. కానీ, ఊహించని విధంగా 154 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో బైరెడ్డి తీవ్ర అసంతృప్తికి లోనైనట్లు తెలిసింది. దాదాపు ఐదేళ్లకుపైగా ఉద్యమం చేస్తే ప్రజల నుంచి మద్దతు రాలేదని భావించిన బైరెడ్డి.. రాయలసీమ పోరాటాన్ని విరమించుకొని టీడీపీలో చేరుతున్నట్లు సమాచారం.

బాలకృష్ణ సమక్షంలో..

బాలకృష్ణ సమక్షంలో..

తెలుగుదేశం పార్టీలో చేరే విషయంపై బైరెడ్డి రాజ శేఖర్‌రెడ్డి హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ సమక్షంలో హైదరా బాదులో కీలక చర్చలు జరిగినట్లు విశ్వస నీయ సమాచారం. మంత్రులు పరిటాల సునీత, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తదితరులు ఈ చర్చల్లో పాల్గొన్నట్లు సమాచారం. భైరెడ్డి రాకను జిల్లా టీడీపీ నాయకులు కొందరు ఆహ్వానిస్తే.. మరి కొందరు వ్యతిరేకిస్తున్నట్లు తెలిసింది. అయితే, పార్టీ బలోపేతం కోసం సీఎం చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్నా తమకు అభ్యంతరం లేదని నేతలు పేర్కొన్నట్లు సమాచారం.

చర్చల తర్వాతే నిర్ణయం..

చర్చల తర్వాతే నిర్ణయం..

సెప్టెంబర్ 5వ తేదీన ముచ్చుమర్రిలో అనుచరులు, సన్నిహితులు,కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తున్నట్లు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఓ మీడియా ఛానల్‌తో మాట్లాడుతూ తెలిపారు. ఆ సమావేశంలో రాయలసీమ ఉద్యమాన్ని కొనసాగించాలా? విరామం ఇవ్వాలా? అనే నిర్ణయం తీసు కుంటామని తెలిపారు. అయితే ఇప్పటి వరకు తాను ఏ పార్టీలో చేరే నిర్ణయం తీసుకోలే దని, సన్నిహితుల సూచన మేరకు తన రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. అయితే, బైరెడ్డి.. టీడీపీలో చేరడం దాదాపు ఖరారైనట్లేనని తెలుస్తోంది.

English summary
Founder and President of Rayalaseema Parirakshana Samithi (RPS) Byreddy Rajasekhar Reddy has announced that he would soon join TDP. It was Reddy who started the party for separate statehood for Rayalaseema region of Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X