వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

"కేసులకు భయపడిన చంద్రబాబు, పవన్ కల్యాణ్ జెఎఫ్‌సి ఎందుకో"

By Pratap
|
Google Oneindia TeluguNews

కడప: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై కాంగ్రెసు నేత సి. రామచంద్రయ్య తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అదే విధంగా జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ జెఎఫ్‌సిపై కూడా స్పందించారు.

తన పార్టీ ఎంపీలతో రాజీనామా చేయించాలనే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ నిర్ణయాన్ని స్వాగతించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై ఉన్న కేసుల వల్లనే ఈ దుస్థితి వచ్చిందని ఆయన అన్నారు.

ఎజెండాగా ప్రత్యేక హోదా

ఎజెండాగా ప్రత్యేక హోదా

ప్రత్యేక హోదా అంశం ఆంధ్రప్రదేశ్ ప్రజల ఎజెండా మారిందని సి. రామచంద్రయ్య అన్నారు. కేంద్ర వైఖరికి నిరసనగా జగన్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. కడపలో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారుర. ప్రజల ఎజెండాగా మారిన ప్రత్యేక హోదాపై రెండు సార్ల అసెంబ్లీలో తీర్మానం చేసినా ఫలితం లేకుండా పోయందని అన్నారు.

మొదటి నుంచీ పోరాడుతున్నాం

మొదటి నుంచీ పోరాడుతున్నాం

తన ఎంపీలతో రాజీనామా చేయించాలని జగన్ తీసుకున్న నిర్ణయానికి కాంగ్రెసు మద్దతు ఉంటుందని సి. రామచంద్రయ్య చెప్పారు. విభజన హామీలను అమలు చేయాలని తాము మొదటి నుంచీ పోరాడుతున్నట్లు తెలిపారు. ప్రత్యేక హోదాపై ప్రజలను చైతన్యపరిచేందుకు కోటి సంతకాల సేకరణ జరిపామని, మొదటి నుంచి కూడా కేంద్రం రాష్ట్రానికి మొండిచేయి చూపిస్తూనే ఉందని అన్నారు.

అరుంధతి నక్షత్రంలాగా ప్రత్యేక ప్యాకేజీ..

అరుంధతి నక్షత్రంలాగా ప్రత్యేక ప్యాకేజీ..

హోదా వద్దు ప్యాకేజీ ముద్దు అంటున్నారే తప్ప దానివల్ల కలిగే లాభాలను మాత్రం చెప్పడం లేదని సి. రామచంద్రయ్య విమర్శించారు. పెళ్లిలో అరుంధతి నక్షత్రంలాగా ప్రత్యేక ప్యాకేజీ ఉందని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తాను తెచ్చినన్ని నిధులు ే రాష్ట్రానికి కూడా కేంద్రం ఇవ్వలేదని చంద్రబాబు చెప్పడం నిజం కాదా అని ఆయన అడిగారు. ఇప్పుడు ఆ మాటలు ఏమయ్యాయని ప్రశ్నించారు.

 చంద్రబాబుపై ఉన్న కేసుల వల్లనే..

చంద్రబాబుపై ఉన్న కేసుల వల్లనే..

విభజన హామీల కోసం అన్ని రాజకీయ పార్టీలను కలుపుకుని వెళ్లకుండా ఒక్కడే పోి ఏం తెచ్చిపెట్టాడో చంద్రబాబుకే తెలియాలని సి. రామచంద్రయ్య అన్నారు. చంద్రబాబు అఖిల పక్ష సమావేశం నిర్వహించపోవడం దారుణమని అన్నారు. నిజం చెప్పాలంటే చంద్రబాబుపై ఉన్న కేసుల వల్లనే ఈ గతి పట్టిందని ఆయన వ్యాఖ్యానించారు. తనపై ఉన్న కేసులకు భయపడే చంద్రబాబు కేంద్రాన్ని ఏ విషయంలోనూ ప్రశ్నించడం లేదని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను ఢిల్లీలో తాకట్టు పెట్టారని అన్నారు

పవన్ కల్యాణ్ ఎందుకో మరి...

పవన్ కల్యాణ్ ఎందుకో మరి...

జనసేన అధినేత పవన్ కల్యాణ్ జెఎఫ్‌సి ఎందుకు ఏర్పాటు చేస్తున్నారో ఎవరికీ అర్థం కావడం లేదని సి. రామచంద్రయ్య అన్నారు. పెద్ద నేతలను ఇటువంటి వాటికి వాడుకోవడం సమంజసం కాదని ఆయన అన్నారు. ఉండవల్లి అరుణ్ కుమార్, జయప్రకాష్ నారాయణ వంటివారితో జెఎఫ్‌సి ఏర్పాటు చేయాలని పవన్ కల్యాణ్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

English summary
The Congress leader C ramachandraiah has lashed out at Andhra Pradesh CM and Telugu Desam party chief Nara Chandrababu Naidu
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X