వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాహుల్! చంద్రబాబు పాపాలు మేం మోయాలా?: కాంగ్రెస్ పార్టీకి రామచంద్రయ్య రాజీనామా

|
Google Oneindia TeluguNews

కడప: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ-కాంగ్రెస్ పొత్తు ప్రకంపనలు రాజేస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్ నేత వట్టి వసంత కుమార్ రాజీనామా చేయగా, తాజాగా శనివారం మరో సీనియర్ నేత, మాజీ మంత్రి సీ రామచంద్రయ్య ఆ పార్టీకి రాజీనామా చేశారు.

<strong>స్టాచూ ఆఫ్ ఆపర్చునిటీ! తమ్ముళ్లూ బయటికి రండి: చంద్రబాబును ఏకేసిన కన్నా</strong>స్టాచూ ఆఫ్ ఆపర్చునిటీ! తమ్ముళ్లూ బయటికి రండి: చంద్రబాబును ఏకేసిన కన్నా

అందుకే రాజీనామా

అందుకే రాజీనామా

ఈ సందర్భంగా సీ రామచంద్ర మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడానికి నిరసనగా రాజీనామా చేసినట్లు స్పష్టం చేశారు. చంద్రబాబుకు ఒక సిద్ధాంతం అనేది కూడా లేదని, ఆయన ఎవరితోనైనా కలుస్తారని మండిపడ్డారు.

<strong>ఆ భయంతోనే చంద్రబాబు ఢిల్లీకి పారిపోయారు: కన్నా తీవ్ర విమర్శలు, మీడియాపైనా..</strong>ఆ భయంతోనే చంద్రబాబు ఢిల్లీకి పారిపోయారు: కన్నా తీవ్ర విమర్శలు, మీడియాపైనా..

రాహుల్ గాంధీకి ఏం అవసరం?

రాహుల్ గాంధీకి ఏం అవసరం?

చంద్రబాబు అవకాశవాద రాజకీయాలను తాము సమర్థించాల్సిన అవసరం ఏంటని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ప్రశ్నించారు. దేశంలోనే చంద్రబాబుకు మించిన అవకాశవాది లేరని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీపై అనేక విమర్శలు చేయడంతోపాటు కాంగ్రెస్‌ను భూస్థాపితం చేస్తామన్న చంద్రబాబుతో పొత్తు ఎలా పెట్టుకుంటారని సీ రామరామచంద్ర నిలదీశారు.

 శాలువా కప్పి, లడ్డూలిస్తే లొంగుతారా?

శాలువా కప్పి, లడ్డూలిస్తే లొంగుతారా?

టీడీపీకి ఊతమివ్వడం తప్ప చంద్రబాబుతో కాంగ్రెస్ పార్టీ పొత్తుతో ఏం లాభం లేదని రామచంద్రయ్య అభిప్రాయపడ్డారు. ఢిల్లీకి వచ్చి శాలువాలు కప్పి లడ్డూలు ఇస్తే చంద్రబాబుకు లొంగుతారా? అని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని ప్రశ్నించారు. జన్మభూమి కమిటీలతో రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీశారని ఆరోపించారు.

బాబు పాపాలను మేం మోయాలా?

బాబు పాపాలను మేం మోయాలా?

చంద్రబాబు పాపాలను భుజాన వేసుకోవాల్సిన ఖర్మ తమకు పట్టలేదని అన్నారు. మరోసారి అవినీతి పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి చేస్తున్న ప్రయత్నానికి నిరసనగా రాజీనామా చేస్తున్నట్లు రామచంద్రయ్య స్పష్టం చేశారు. గుంటూరుకు రాహుల్ వచ్చి నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారని గుర్తు చేశారు.

ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన బాబుతో పొత్తు ఎలా?

ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన బాబుతో పొత్తు ఎలా?

మరో పార్టీకి చెందిన 23మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన చంద్రబాబు కూడా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతారా? అని సీ రామచంద్రయ్య మండిపడ్డారు. ఓటుకు నోటు కేసులో ఆధారాలతో సహా అడ్డంగా దొరికిన చంద్రబాబుతో కాంగ్రెస్ ఎలా పొత్తుపెట్టుకుంటుందని ధ్వజమెత్తారు. రాష్ట్ర సీనియర్ నాయకులతో ఒక్కమాట కూడా అడగకుండా టీడీపీతో పొత్తు పెట్టుకోవడమేంటని ప్రశ్నించారు. తాము ఎన్నికల్లో ఏ విధంగా ప్రచారం చేయగలమని అన్నారు.

English summary
Former minister C Ramachandraiah resigned to Congress for Alliance With TDP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X