అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

'ఆ గొంతు బాబుదే, సీఎం పదవికి రాజీనామా చేయాలి'

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

అమరావతి: ఓటుకు నోటు వ్యవహారంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విడుదల చేసిన ఆడియో టేపులో స్టీఫెన్ సన్‌తో మాట్లాడిన గొంతు ఏపీ సీఎం చంద్రబాబుదేనని ఏపీ శాసనమండలిలో ప్రతిపక్ష నేత సి. రామ చంద్రయ్య పేర్కొన్నారు.

ఆడియో టేపులో వినిపించిన గొంతు నూటికి నూరు శాతం చంద్రబాబుదేనన్న రామచంద్రయ్య, అసరమైతే ఫోరెన్సిక్ ల్యాబ్‌లో పరీక్ష చేయించుకోవచ్చని అన్నారు. ఎమ్మెల్యే స్టీఫెన్సన్‌తో ఫోన్‌లో మాట్లాడుతూ అడ్డంగా దొరికిపోయిన ఏపీ సీఎం చంద్రబాబు వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

చంద్రబాబు వెంటనే తన సీఎం పదవికి రాజీనామా చేయడంతో పాటు ఏసీబీ విచారణకూ సిద్ధపడాలని అన్నారు.

C Ramachandraiah says voice in tape absolutely Ap Cm Chandrababu

ఏ హక్కుతో ఫోన్లు ట్యాప్ చేస్తారు?: నన్నపనేని

పది సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాదులో ఏపీ సీఎం చంద్రబాబు ఫోన్‌ను ట్యాప్ చేసే అధికారం తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఎవరిచ్చారని తెలుగుదేశం పార్టీ నాయకురాలు నన్నపనేని రాజకుమారి ధ్వజమెత్తారు.

తెలంగాణ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని అన్నారు. ఈ వ్వవహారం అంతా సద్దుమణిగాక, తమ తడాఖా చూపిస్తామని హెచ్చరించారు. రాబోయే రోజుల్లో ఎవరు రాణిస్తారో ఎవరు మంచిపేరు తెచ్చుకుంటారో? ఎవరు స్వార్ధం కోసం పనిచేస్తున్నారో ప్రజలకు త్వరలోనే తెలుస్తుందని చెప్పారు.

ఉమ్మడి రాష్ట్రంలో తొమ్మిదేళ్లు సీఎంగా ఉన్న వ్యక్తిని, దశాబ్దాలుగా ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్న వ్యక్తిపై అగౌరవపరిచేలా వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.

English summary
C Ramachandraiah says voice in tape absolutely Ap Cm Chandrababu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X