హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రేవంత్ అరెస్ట్: ఏపీలోనూ చంద్రబాబుకు చిక్కులు?

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రేవంత్ రెడ్డి అరెస్టుతో ఏపీ సీఎం చంద్రబాబుకు కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రోద్బలంతోనే రేవంత్ రెడ్డి... ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు ముడుపులు ఇచ్చేందుకు ప్రయత్నించారని విపక్ష పార్టీ సభ్యులు ఆరోపిస్తున్నారు.

అంతేకాదు, రేవంత్ రెడ్డి తన బాసే స్వయంగా తనను ఇక్కడి పంపించాలని వీడియోలో చెప్పడంతో ఏపీ సీఎం చంద్రబాబుని కూడా నిందితుడిగా చేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని అరెస్టు చేసి చంచల్ గూడ జైలుకు 14 రోజుల రిమాండ్‌కు తరలించారు.

ఎమ్మెల్యే కొనుగోలు విషయంలో ఏపీ సీఎం చంద్రబాబును నిందితుడిగా చేర్చాలని ఏపీ శాసనమండలి విపక్ష నేత సి.రామచంద్రయ్య డిమాండ్ చేశారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ దీనిపై ఏసీబీ లోతైన విచారణ జరపాలని ఆయన అన్నారు.

 C Ramachandraiah slams chandrababu naidu over mlc elections

చంద్రబాబు రాజకీయ అవసరాల కోసం ఎంతకైనా దిగజారుతారని, ఎమైనా చేస్తాడని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డిని పావుగా వాడుకున్నారని... ఈ ముడుపుల విషయంలో అసలు సూత్రధారి చంద్రబాబేనని ఆయన ఆరోపించారు. దేశ రాజకీయ చరిత్రలో ఇది అత్యంత హేయమైన చర్యగా అభివర్ణించారు.

భారతదేశంలో క్రైమ్ నిరూపించడం కష్టమని, ఇలాంటి సంఘటనలు జరిగాయని అన్నారు. చంద్రబాబుని A1 నిందితుడిగా ఎఫ్ఐఆర్‌లో చేర్చాలని సూచించారు. చంద్రబాబు దివాళాకోరుతనానికి ఇది నిదర్శమని పేర్కొన్నారు. ఇది అత్యంత దారుణమైన చర్య అని, చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అరెస్టు కేసులో ఏపీ సీఎం చంద్రబాబుని కూడా అరెస్టు చేసి విచారణ జరిపించాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత గౌతంరెడ్డి డిమాండ్ చేశారు. సెక్షన్ 34, 107, 420, 120B కింద చంద్రబాబు పై కేసులు నమోదు చేయాలని అన్నారు.

ఆదివారం టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని ఎన్నికల సంఘాన్ని కోరతామని చెప్పారు. అంతేకాదు, ఎమ్మెల్సీ ఎన్నికల వ్యవహారంలో నామినేటెడ్ ఎమ్మెల్యేను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించిన కేసులో చంద్రబాబును నిందితుడిగా చేర్చాలని డిమాండ్ చేశారు.

ఏపీ సీఎం చంద్రబాబు ప్రమేయంతోనే ఇదంతా జరిగిందని ఆరోపించారు. దేశ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినందుకు గాను తెలుగుదేశం పార్టీ వ్వవహరించిందని, అందుకు గాను ఆ పార్టీ గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎవరి ప్రోద్బలంతో రేవంత్‌రెడ్డి ఈ పనికి పాల్పడ్డారో బయటకు తీయాలని సీనియర్ న్యాయవాది శ్రీరంగారావు డిమాండ్ చేశారు.

రేవంత్ వెనక చంద్రబాబు ఉన్నాడా? లేక లోకేష్ బాబు ఉన్నాడా? తేలాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యానికి మాయనిమచ్చలాంటి పని రేవంత్ చేశారని మండిపడ్డారు. ఈ ఘటనపై విచారణ చేపట్టి బాధ్యులైన వారిని కోర్టు ఎదుట నిలబెట్టినప్పుడే ప్రజాస్వామ్యానికి గౌరవం ఉంటుందన్నారు.

రేవంత్ ఘటనలో బాబు పాత్ర: దేవినేని నెహ్రూ

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అరెస్ట్ కేసులో ఏపీ సీఎం చంద్రబాబు పాత్ర ఉందని పీసీసీ ఉపాధ్యక్షుడు దేవినేని నెహ్రూ ఆరోపించారు. సోమవారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సూట్‌కేసుల ద్వారా ఏ పనైనా జరుగుతుందని బాబు భావిస్తున్నారని అన్నారు.

సీఎంగా, పార్టీ అధ్యక్షుడిగా బాబు అనర్హుడని, రెడ్‌హ్యాండెడ్‌గా దొరికినా టీడీపీ నేతలు తప్పించుకోవాలని చూస్తున్నారని విమర్శించారు. నవనిర్మాణ దీక్షను చంద్రబాబు ఎలా చేపడతారని ప్రశ్నించారు. జూన్ 2న తలపెట్టిన నవ నిర్మాణ దీక్షకు పోటీగా తాము సబ్‌కలెక్టరు ఆఫీస్ ఎదుట కాంగ్రెస్‌ నిరసన దీక్ష చేపడుతుందని తెలిపారు.

English summary
C Ramachandraiah slams chandrababu naidu over mlc elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X