వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

త్వరలో మంత్రివర్గ విస్తరణ: తేల్చేసిన చంద్రబాబు, ‘మోడీకి చెబితే రివర్స్, పెట్రోల్-రూపాయి '100'కు!’

|
Google Oneindia TeluguNews

Recommended Video

త్వరలో మంత్రివర్గ విస్తరణ తేల్చేసిన చంద్రబాబు

అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా రెండు కోట్ల ఎకరాలకు నీరివ్వాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యమని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. రాబోయే 40 రోజుల్లో 47 ప్రాజెక్టులకు టెండర్లు పిలుస్తామని చెప్పారు. ఈ మేరకు ఆయన సచివాలయంలో ప్రాజెక్టుల అంశంపై మీడియాతో మాట్లాడారు.

రాయలసీమను హార్టికల్చర్‌ హబ్‌గా తయారు చేస్తామని చెప్పారు. ఈ ఏడాది శ్రీశైలం, నాగార్జునసాగర్‌ జలాశయాలు నిండాయని, ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలనే దృఢ సంకల్పంతో ఉన్నామన్నారు. ఇప్పటికే సాగునీటి ప్రాజెక్టులపై రూ.58 వేల 24 కోట్లు ఖర్చు చేశామని చంద్రబాబు వివరించారు.

 పెట్రోల్, రూపాయి.. 100కు

పెట్రోల్, రూపాయి.. 100కు

అనంతరం కేంద్రంపై చంద్రబాబు విమర్శలు గుప్పించారు. నోట్ల రద్దుతో ఏం సాధించారని కేంద్రాన్ని ప్రశ్నించారు. తాను సూచించిన వాటికి విరుద్ధంగా నిర్ణయాలు తీసుకుని ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చారని విమర్శించారు. పెట్రోల్‌ రూ.100కు చేరుతుందేమోనని చంద్రబాబు ఎద్దేవాచేశారు. రూపాయి విలువ రోజురోజుకూ పతనమవుతోందని, డాలరుతో రూపాయి మారకం వంద రూపాయలు అవుతుందేమోనని అన్నారు.

 మోడీకి చెబితే రివర్స్ చేశారు

మోడీకి చెబితే రివర్స్ చేశారు

‘పెద్ద నోట్లు రద్దు చేసి ఏం సాధించారు? అందర్నీ ఇబ్బంది పెట్టడం తప్ప! ఇప్పటికీ ఏటీఎంలలో డబ్బులు దొరకడం లేదు' అని చంద్రబాబు అన్నారు. రూ.2000, రూ. 500 నోట్లు రద్దు చేసి రూ.100, రూ.200 రూపాయల నోట్లను పెట్టండి అని అప్పట్లో కేంద్రానికి సూచించినట్లు తెలిపారు. డిజిటల్‌ కరెన్సీని ప్రోత్సహించాలని చెప్పానని, తాను చెప్పినదానికి వాళ్లు రివర్స్‌ చేశారని విమర్శించారు.

 జగన్ లాంటి వ్యక్తిన పక్కన పెట్టుకున్నారు..

జగన్ లాంటి వ్యక్తిన పక్కన పెట్టుకున్నారు..

ఎన్టీఏ ప్రభుత్వం వచ్చాక వృద్ధి ఆగిపోయిందని, బ్యాంకులపై ప్రజలకు ఉన్న నమ్మకం పోయిందని ఆరోపించారు. జగన్‌లాంటి అవినీతి పరులను పక్కన పెట్టుకున్నారని కేంద్రంపై చంద్రబాబు మండిడ్డారు. నీతి, నిజాయతీ గురించి మాట్లాడే అర్హతను ప్రధాని కోల్పోయారని చంద్రబాబు విమర్శించారు.

త్వరలో మంత్రివర్గ విస్తరణ

త్వరలో మంత్రివర్గ విస్తరణ

కాగా, అంధ్రప్రదేశ్‌ మంత్రివర్గ విస్తరణ త్వరలో చేపట్టనున్నట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, సినీ నటుడు హరికృష్ణ మరణంతో విస్తరణ కొంచెం ఆలస్యమైందని ఆయన వివరించారు. సీపీఎస్‌ విధానం జాతీయ స్థాయిలో తీసుకున్న విధాన నిర్ణయమని ముఖ్యమంత్రి అన్నారు. అన్ని రాష్ట్రాల్లోనూ సీపీఎస్‌ విధానం ఉందని, దీన్ని ఏవిధంగా పరిష్కరించాలో ఆలోచిస్తున్నామని తెలిపారు. డిసెంబర్‌ నాటికి హైకోర్టు భవనం పూర్తవుతుందని, హైకోర్టు ఏర్పాటు విషయంలో తాము స్పష్టంగా ఉన్నామని చంద్రబాబు వివరించారు.

English summary
Andhra Pradesh CM Chandrababu Naidu on Monday said that cabinet expansion is in soon. And he fired at centre for their policies.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X