కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విషాదం:చిరకాల వాంఛ తీరకుండానే మరణించిన భూమా , మంత్రి పదవి చేపట్టే తరుణంలోనే ఇలా...

చిరకాల కోరిక తీరకుండానే భూమా నాగిరెడ్డి మరణించాడు. మంత్రి పదవిని చేపట్టాలనేది ఆయన చిరకాల వాంచ. త్వరలోనే ఆయనకు మంత్రిపదవి వస్తోందనే భావిస్తున్న తరుణంలోనే ఆయన మరణించడం విషాదాన్ని నింపింది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

కర్నూల్: టిడిపి ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మంత్రిగా పనిచేయాలనేది చిరకాల కోరిక. ఆ కోరిక తీరకుండానే ఆయన మరణించాడు. త్వరలో మంత్రివర్గ పునర్వవ్యవస్థీకరణలో చంద్రబాబునాయుడు భూమా నాగిరెడ్డికి స్థానం కల్పిస్తారనే ప్రచారం జరిగింది.

కర్నూల్ జిల్లా రాజకీయాల్లో భూమా నాగిరెడ్డి తనదైన ముద్ర వేశారు. టిడిపి, ప్రజారాజ్యం, వైసిపి పార్టీల్లో పనిచేసినా తన అనుచరవర్గం మాత్రం ఆయన వెంటే ఉన్నారు.వైసిపి నుండి ఇటీవలే తన మాతృసంస్థలోకి చేరారు.

వైసిపి నుండే ఆయన టిడిపిలో చేరారు. ఏప్రిల్ మాసంలో చంద్రబాబునాయుడు తన మంత్రివర్గాన్ని పునర్వవ్యస్థీకరించాలనే ఆలోచనలో ఉన్నాడు.

అయితే చంద్రబాబు తన మంత్రివర్గంలో భూమా నాగిరెడ్డికి మంత్రి పదవిని కల్పిస్తారనే ప్రచారం ఉంది.అయితే 1964 జనవరి 8న, కర్నూల్ జిల్లా దొర్నిపాడు మండలం కొత్తపల్లిలో భూమా జన్మించాడు.భూమా నాగిరెడ్డికి ఇద్దరు కుమార్తెలున్నారు. కుమారుడు కూడ ఉన్నారు. తండ్రి హత్య తర్వాత భూమా నాగిరెడ్డి క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చారు.

cabinet minister is the bhuma nagi reddy desire

1992 లో ఆళ్ళగడ్డ ఉప ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యేగా తొలిసారి విజయం సాధించారు. మూడు దఫాలుగా నంద్యాల పార్లమెంట్ స్థానం నుండి విజయం సాధించారు.అయితే తొలుత టిడిపిలో ఉన్న భూమా ఆ తర్వాత పిఆర్ పి, కాంగ్రెస్, వైసిపి లలో చేరారు. వైసిపి నుండి 2016 లో ఆయన టిడిపిలో చేరారు.

2014 ఏప్రిల్ 24న, రోడ్డు ప్రమాదంలో భూమా నాగిరెడ్డి భార్య శోభా నాగిరెడ్డి మరణించారు. శోభ మరణం తర్వాత భూమా నాగిరెడ్డి మానసికంగా బాగా కుంగిపోయారు.ఆయనకు బైపాస్ సర్జరీ జరిగింది.ఏడాది నుండి ఆయన ఆరోగ్యం సరిగా లేదని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

మంత్రి పదవి ఆయన చిరకాల వాంఛ

పలుమార్లు భూమా నాగిరెడ్డి ప్రజా ప్రతినిధిగా ఎన్నికైన మంత్రి పదవి మాత్రం దక్కలేదు. భూమా కుటుంబం టిడిపిలో ఉన్న సమయంలో భూమా నాగిరెడ్డి సతీమణి శోభా నాగిరెడ్డి తండ్రి ఎస్ వి సుబ్బారెడ్డి టిడిపి హయంలో మంత్రిగా పనిచేశారు.దీంతో భూమాకు మంత్రి పదవి దక్కలేదు.

అటు తర్వాత రాజకీయ సమీకరణాల వల్ల కూడ భూమాకు మంత్రి పదవి దక్కలేదు. అయితే 2014 ఎన్నికల్లో ఆయన వైసిపి నుండి పోటీచేసి విజయం సాధించాడు.కాని, టిడిపి అధికారంలోకి వచ్చింది.వైసిపి అధినేత జగన్ తో మనస్పర్థలతో పాటు ఇతర కారణాలతో భూమా నాగిరెడ్డి టిడిపిలో చేరారు.

భూమా నాగిరెడ్డి టిడిపిలో చేరితే ఆయనకు మంత్రిపదవి ఇస్తారనే ప్రచారం ఆ పార్టీలో జోరుగా విన్పించింది.అయితే బడ్జెట సమావేశాల తర్వాత చంద్రబాబునాయుడు తన మంత్రివర్గాన్ని పునర్వవ్యస్థీకరించాలని భావిస్తున్నారు.అయితే పునర్వవ్యవస్థీకరణలో భూమానాగిరెడ్డికి మంత్రి పదవి దక్కే అవకాశం ఉందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

ఇదే సమయంలో ప్రస్తుతం కర్నూల్ జిల్లాలో చోటుచేసుకొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి శిల్పా చక్రపాణిరెడ్డిని విజయం సాధించేలా కృషి చేయాలని బాబు భూమా నాగిరెడ్డికి సూచించారు. ఈ మేరకు భూమా నాగిరెడ్డి కూడ ఈ మేరకు సానుకూలంగానే స్పందించారని సమాచారం. శిల్పా కుటుంబంతో ఇబ్బందులు పడ్డ తన వర్గానికి చెందిన ప్రజాప్రతినిధులను బాబు వద్దకు తీసుకెళ్ళాడు భూమా నాగిరెడ్డి. మరునాడే ఆయన మరణించడం ఆయన వర్గీయుల్లో తీవ్ర మనస్థాపానికి గురైంది.మంత్రి పదవి చేపట్టాలనేది ఆయన చిరకాల వాంఛ.అయితే మంత్రి పదవి చేపడుతారనే తరుణంలోనే ఆయన చనిపోవడం విషాదాన్ని నింపింది

English summary
cabinet minister is the bhuma nagi reddy desire. he will be join in chandra babu's cabinet soon. bhuma will join in cabinet.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X