వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సజ్జలకు కేబినేట్ హోదా .. సీఎంకు ప్రజా వ్యవహారాల సలహాదారుగా ఉత్తర్వులు జారీ

|
Google Oneindia TeluguNews

ఆయన వైసీపీలోకి కీలక భూమిక పోషించిన నేత.. ఒక జర్నలిస్టుగా పనిచేసిన నాయకుడు. రాజకీయాల్లో జగన్ అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేసిన లీడర్. అందుకే ఆయనకు సముచిత స్థానం ఇచ్చి గౌరవించారు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి.

కేసీఆర్ క్లారిటీ .. జగన్ తో దోస్తీ ... అవసరమైతే మోడీతో కుస్తీకేసీఆర్ క్లారిటీ .. జగన్ తో దోస్తీ ... అవసరమైతే మోడీతో కుస్తీ

సజ్జల రామకృష్ణారెడ్డికి ప్రజా వ్యవహారాల సలహాదారుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ

సజ్జల రామకృష్ణారెడ్డికి ప్రజా వ్యవహారాల సలహాదారుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ

సజ్జల రామకృష్ణారెడ్డికి ముఖ్యమంత్రి ప్రజా వ్యవహారాల సలహాదారుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు వైయస్ జగన్ . అంతేకాదు ఆయనకు క్యాబినెట్ హోదా కూడా కల్పించారు. తక్షణమే సజ్జల రామకృష్ణారెడ్డి నియామకం అమల్లోకి వస్తుంది అంటూ ఉత్తర్వులు జారీ చేశారు .సీఎం జగన్ కు అత్యంత సన్నిహితుడిగా, రాజకీయ వ్యవహారాల సలహాదారు గా, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి.

 పార్టీలో కీ రోల్ .. ఇప్పుడు జగన్ కు ప్రజా వ్యవహారాల సలహాదారుగా కీ రోల్

పార్టీలో కీ రోల్ .. ఇప్పుడు జగన్ కు ప్రజా వ్యవహారాల సలహాదారుగా కీ రోల్

జర్నలిజంలో అపార అనుభవం కలిగిన సజ్జల ,జగన్ రాజకీయ సలహాదారుగా, పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీలోనూ కీలకంగా వ్యవహరిస్తున్నారు . క్రియాశీల రాజకీయాలకు ఆయన దూరంగా ఉన్నప్పటికీ పార్టీ వ్యవహారాల్లో మాత్రం ఆయన కీ రోల్ పోషిస్తున్నారు. ప్రత్యర్థులపై రాజకీయంగా దాడి చేయడం లో ఆయన నేర్పరి. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డికి కీలక పదవి లభిస్తుందని పార్టీ వర్గాలు భావించినట్లు గానే జగన్ ఆయనకు సముచిత స్థానం ఇచ్చారు. ప్రజా వ్యవహారాల సలహాదారుగా నియమించి, క్యాబినెట్ హోదా కల్పించి జగన్ ఆయనను గౌరవించారు.

Recommended Video

జగన్ మంత్రి వర్గ కూర్పు దేశానికే ఆదర్శం
నాడు కెవిపి రామచంద్ర రావు తరహాలోనే నేడు జగన్ కు సజ్జల రామకృష్ణా రెడ్డి

నాడు కెవిపి రామచంద్ర రావు తరహాలోనే నేడు జగన్ కు సజ్జల రామకృష్ణా రెడ్డి

వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో వైయస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కెవిపి రామచంద్ర రావుకు ఇదే రకమైన పదవిని కట్టబెట్టారు. ఇప్పుడు జగన్ సైతం కెవిపి తరహాలోనే సజ్జల రామకృష్ణారెడ్డికి ఇక పదవినే కాదు, ప్రజా వ్యవహారాల సలహాదారు గా కీలక బాధ్యతను అప్పగించారు. ఇక ఈ బాధ్యతను ఒక జర్నలిస్టుగా పనిచేసిన అనుభవంతో ఆయన సక్రమంగా నిర్వహిస్తారని జగన్ భావిస్తున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి సైతం జగన్ అప్పగించిన కీలక బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తారని, నాడు వైయస్ కు సలహాలిచ్చిన కెవిపి తరహాలో సజ్జల జగన్ కు సరైన సలహాలు ఇస్తూ ముందుకు నడిపిస్తారని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి.

English summary
Sajjala Ramakrishna Reddy has been appointed as the public affairs advisor to the chief minister. He was also given Cabinet status. Sajjala Ramakrishna Reddy has been ordered to take immediate effect .Sajjala Ramakrishna Reddy is a close friend of CM Jagan, a political affairs advisor and a key leader of the YSR Congress party.Sajjala has vast experience in journalism, is a political consultant and a key member of the party's political affairs committee. Although he is far from active politics, he still plays a key role in party affairs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X