వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబు పాలనలో అవినీతి నివేదిక సిద్దం: నేడు కేబినెట్ ముందుకు: ఏం చేయబోతున్నారు..!

|
Google Oneindia TeluguNews

ఈ రోజు జరుగుతున్న కేబినెట్ సమావేశంలో కీలకమైన రాజధాని అంశంతో పాటుగా మరో ముఖ్యమైన అంశం పైన నిర్ణయం తీసుకొనే అవకాశం కనిపిస్తోంది. ఏపీలో జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి న తరువాత..నాడు చంద్రబాబు హాయంలో జరిగిన అవినీతి పైన తేల్చేందుకు మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసారు. అన్ని విభాగాల్లోనూ..ముఖ్యంగా రాజధాని నిర్ణయాలతో పాటుగా అనేక రంగాల్లో జరిగిన అవినీతిని తేల్చి..నివేదిక ఇచ్చే బాధ్యతలను అప్పగించారు.

ఇప్పటి వరకు తమ మీద ఆరోపణలు చేయటం మినహా ఎటువంటి అవినీతి జగన్ ప్రభుత్వం నిరూపించలేకపోయందని చంద్రబాబుతో సహా టీడీపీ నేతలు చెబుతున్నారు. దీంతో..ఈ రోజు జరుగుతన్న కేబినెట్ సమావేశంలో మంత్రివర్గ ఉపసంఘం తాము తేల్చిన అంశాలతో పాటుగా..కొన్ని సిఫార్సులు చేసినట్లు తెలుస్తోంది. ఈ నివేదికను మంత్రివర్గ ఉపసంఘం సమర్పించనుంది. దీని పైన కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంది. దీంతో..ఇప్పుడు రాజధాని అంశం ఉండటతో..చంద్రబాబు అవినీతి పైన కేబినెట్ సబ్ కమటీ చేసే సిఫార్సుల పైన నిర్ణయం తీసుకుంటారా లేక వాయిదా వేస్తారా అనేది ఆసక్తి కరంగా మారుతోంది.

cabinet sub committee submit report on corruption in CBN tenure to govt today

అమరావతి లో జరుగుతున్న కేబినెట్ సమావేశంలో అభివృద్ధి వికేంద్రీకరణపై జీఎన్‌ రావు కమిటీ అందజేసిన నివేదికతో పాటు పలు కీలక అంశాలను చర్చించనున్నారు. కొత్తగా 104, 108 వాహనాల కొనుగోలు, దేవాలయాల్లో పాలక మండళ్ల నియామకాలకు సంబంధించి సవరణలపైనా ఈ సమావేశంలో చర్చించే అవకాశం కనిపిస్తోంది. అలాగే స్థానిక ఎన్నికల్లో అమలు చేయాల్సిన రిజర్వేషన్లపై కూడా ఈ భేటీలో చర్చించనున్నారు.

రాష్ట్రంలో ప్రత్యేక ఎకనామిక్‌ జోన్ల ఏర్పాటు అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. కేబినెట్‌ సమావేశానికి మందు మంత్రివర్గ ఉపసంఘం సీఎం జగన్‌తో భేటీకానున్నట్టుగా తెలుస్తోంది. చంద్రబాబు పాలనలో జరిగిన అవినీతిపై సీఎంకు మంత్రివర్గ ఉపసంఘం ఓ నివేదిక ఇవ్వనున్నట్టు సమాచారం. రాAPజధానితో పాటుగా ఇరిగేషన్..ఇన్ ఫ్రా ప్రాజెక్టుల విషయంలో మంత్రివర్గ ఉప సంఘం అధ్యయనం చేసినట్లు తెలుస్తోంది. దీంతో..ఇప్పుడు వారిచ్చే నివేదిక కీలకం కానుంది. ఈ నివేదిక పైన చర్చించి..కేబినెట్ ఎటువంటి చర్యలకు సిఫార్సు చేస్తుందని అందరిలోనూ ఉత్కంఠకు కారణం అవుతోంది.

English summary
Cabinet sub committee submitting key report on corruption in CBN tenure. To day before cabinet meet they may submit report to CM jagan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X