మెదక్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రూ. 2 కోట్ల దోపిడీ: బ్యాంకుకి కన్నం వేశారిలా(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

మెదక్: జిల్లాలోని మాసాయిపేట కెనరా బ్యాంక్‌లో సోమవారం అర్ధరాత్రి జరిగిన దోపిడీ ఘటనలో సుమారు రూ.2 కోట్ల నగదు, బంగారం, వెండి ఆభరణాలు అపహరణకు గురయ్యాయి. సుమారు 15 లక్షల రూపాయలు, 6 లాకర్లలోని దాదాపు ఐదు కిలోల బంగారం, వెండి ఆభరణాలను దుండగులు దోచుకున్నారు.

తూప్రాన్ డిఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. దోపిడీ దొంగలు సోమవారం రాత్రి 1:30 గంటల సమయంలో బ్యాంక్ కిటికీ రాడ్లు తొలగించి లోనికి ప్రవేశించారు. సిసి కెమెరాలు పగులగొట్టి బ్యాంకులో ఉన్న 15 లక్షల నగదు, 4 కిలోల 950 గ్రాముల రైతు పంట రుణాలకు చెందిన బంగారం దొంగిలించారు. ఆరు లాకర్లు పగులగొట్టి, అందులో ఉన్న వెండి, బంగారు ఆభరణాలను దోచుకున్నారు.

కెనరా బ్యాంకు దోపిడీ

కెనరా బ్యాంకు దోపిడీ

జిల్లాలోని మాసాయిపేట కెనరా బ్యాంక్‌లో సోమవారం అర్ధరాత్రి జరిగిన దోపిడీ ఘటనలో సుమారు రూ.2 కోట్ల నగదు, బంగారం, వెండి ఆభరణాలు అపహరణకు గురయ్యాయి.

కెనరా బ్యాంకు దోపిడీ

కెనరా బ్యాంకు దోపిడీ

సుమారు 15 లక్షల రూపాయలు, 6 లాకర్లలోని దాదాపు ఐదు కిలోల బంగారం, వెండి ఆభరణాలను దుండగులు దోచుకున్నారు.

కెనరా బ్యాంకు దోపిడీ

కెనరా బ్యాంకు దోపిడీ

తూప్రాన్ డిఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. దోపిడీ దొంగలు సోమవారం రాత్రి 1:30 గంటల సమయంలో బ్యాంక్ కిటికీ రాడ్లు తొలగించి లోనికి ప్రవేశించారు.

కెనరా బ్యాంకు దోపిడీ

కెనరా బ్యాంకు దోపిడీ

సిసి కెమెరాలు పగులగొట్టి బ్యాంకులో ఉన్న 15 లక్షల నగదు, 4 కిలోల 950 గ్రాముల రైతు పంట రుణాలకు చెందిన బంగారం దొంగిలించారు. ఆరు లాకర్లు పగులగొట్టి, అందులో ఉన్న వెండి, బంగారు ఆభరణాలను దోచుకున్నారు.

కెనరా బ్యాంకు దోపిడీ

కెనరా బ్యాంకు దోపిడీ

కెనరా బ్యాంక్‌లో దోపిడీకి పాల్పడ్డ దొంగలను త్వరలో పట్టుకుంటామని డిఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. గుల్బర్గా, బీహార్ రాష్ట్రాలకు చెందిన దోపిడీ దొంగలు ఈ చోరీకి పాల్పడి ఉంటారని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.

కెనరా బ్యాంక్‌లో దోపిడీకి పాల్పడ్డ దొంగలను త్వరలో పట్టుకుంటామని డిఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. గుల్బర్గా, బీహార్ రాష్ట్రాలకు చెందిన దోపిడీ దొంగలు ఈ చోరీకి పాల్పడి ఉంటారని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. బ్యాంక్ వద్ద సెక్యూరిటీ ఏర్పాటు చేయకపోవడంపై మేనేజర్ ఇసాక్‌ను డిఎస్పీ తప్పుపట్టారు.

క్లూస్ టీమ్‌లను రప్పించి, జాగిలాలతో తనిఖీలు చేస్తున్నామన్నారు. బ్యాంక్ మేనేజర్ ఇషాక్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి రెండు దర్యాప్తు బృందాలను నియమించి దుండుగుల కోసం గాలిస్తున్నామన్నారు. ఈ దోపిడీపై రామాయంపేట సిఐ నందీశ్వర్‌రెడ్డి, చేగుంట, రామాయంపేట ఎస్సైలు శ్రీనివాస్‌రెడ్డి, ప్రవీన్‌రెడ్డి, క్లూస్ టీఎం ఎస్సై నాగేశ్వర్‌రావు విచారణ చేపట్టారు.

English summary
A Canara Bank branch at Masaipet of Medak district was robbed early on Tuesday morning and the culprits stole properties and cash worth nearly Rs 2 crore.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X