• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కేంద్ర సర్కారీ వారి మాట వేరు.!జగన్ సర్కారీ వారి బాట వేరు.!అందుకే రద్దైన ఏపీ సీఎం ఢిల్లీ టూరు.?

|

అమరావతి/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్తున్నారు. కేంద్ర పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. ఇక రాష్ట్రంలోని సమస్యలు కొన్నైనా పరిష్కరించబడతాయని ఏపి ప్రజలు భావించారు. కరోనా వైరస్ క్లిష్ట పరిస్థితుల నుండి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న వ్యవస్థలకు జగన్ ఢిల్లీ పర్యటన ప్రాణవాయువులా పరిణమింస్తుందనుకున్న ఏపి ప్రజలు మరోసారి దిగాలు పడిపోయారు. విలేఖరుల సమావేశం పెట్టి మరీ సోమవారం ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పెద్దలను

కలుస్తున్నారని విజయసాయి రెడ్డి చెప్పడంతో జగన్ ఢిల్లీ పర్యటనకు మంచి ప్రచారం కలిగింది. అంతే జగన్ టూర్ వల్ల రాష్ట్రానికి ఏదో జరిగిపోతుందనే అభిప్రాయాలు కూడా ఏపి ప్రజల్లో కలిగాయి. కాని ఏపి ప్రజల్లో కలిగిని భావాలు ఒక్కసారిగా గాయాలపాలయ్యాయి.

అనూహ్యంగా రద్దైన ఏసీ సిఎం జగన్ ఢిల్లీ టూర్.. మళ్లీ భేటీ ఎప్పుడుంటుందో తెలియని పరిస్ధితి..

అనూహ్యంగా రద్దైన ఏసీ సిఎం జగన్ ఢిల్లీ టూర్.. మళ్లీ భేటీ ఎప్పుడుంటుందో తెలియని పరిస్ధితి..

సాదారణంగా ముఖ్యమంత్రులు ఢిల్లీ వెళ్లడం, సంబంధిత కేంద్ర మంత్రులనో, సహాయ మంత్రులనో కలుసుకుని రాష్ట్రానికి సంబంధించిన అంశాలు చర్చించడం, నిధులు, పెండింగ్ పనుల గురించే కాకుండా కేంద్ర ప్రభుత్వ హామీలు, బడ్జెట్ లో కేటాయింపుల గురించి విశ్వసనీయ సమావేశాలు చోటుచేసుకోవడం సర్వసాదారణం. ఇలాంటి అంశాలు సమావేశంలో ముగిసి తర్వాత గానీ మీడియాకు వివరించే పరిస్థితులు గతంలో ఉండేవి. కాని పెరిగిపోయిన మీడియా పోటీ తత్వం వల్ల, సంచలనాలకోసం అంశాన్ని నిర్ధారించేకోకుండానే ప్రచారం చేయడం కూడా అలవాటుగా మారిపోయింది. ఇక జగన్ ఢిల్లీ పర్యటన గురించి, పర్యటన రద్దవ్వడం గురించి ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి.

సరిగ్గా ప్రయాణానికి 20నిమిషాల ముందు రద్దైనట్టు సమాచారం.. అసలేం జరుగుతోంది..

సరిగ్గా ప్రయాణానికి 20నిమిషాల ముందు రద్దైనట్టు సమాచారం.. అసలేం జరుగుతోంది..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఎంత తొందరగా నిర్ధారణ అయ్యిందదో అంతే తొందరగా రద్దయింది. ఇప్పుడు ఇదే అంశం గురించి అమరావతిలో చర్చ జరుగుతోంది. అసలు అకస్మాత్తుగా పర్యటన ఎందుకు ఖరారు ఐనట్టు, అదే పర్యటన మళ్లీ ఎందుకు రద్దైనట్టు అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏసీ సీఎం జగన్ విమానమెక్కడానికి సరిగ్గా 20 నిమిషాల ముందు అనూహ్యంగా టూర్ రద్దయ్యింది. అందుకు కేంద్ర పెద్దలు చెబుతున్న కారణం ఒకటైతే ఏపీ ప్రభుత్వ వర్గాలు చెబుతున్న కారణం మరోలా ఉంది. ఇదే అంశం ఇప్పుడు ఏపిలో ఆసక్తి రేపుతోంది.

ప్రాజెక్టుల అంశం కొలిక్కి వస్తుందనుకున్న ప్రజలు.. ఒక్కసారిగా ఢీలా పడ్డ ఏపి వాసులు..

ప్రాజెక్టుల అంశం కొలిక్కి వస్తుందనుకున్న ప్రజలు.. ఒక్కసారిగా ఢీలా పడ్డ ఏపి వాసులు..

ఇదిలా ఉండగా ప్రధానంగా జలవనరుల శాఖతో సమావేశం ఉంటుందని, అందుకు తగ్గ సరంజామాను ప్రభుత్వం సిద్దం చేసినట్టు తెలుస్తోంది. అయితే ఈ సమావేశం ప్రధాన ఉద్దేశం కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలవడమే అని విశ్వసనీయ సమాచారం. అయితే అమీత్ షా షెడ్యూల్ అకస్మాత్తుగా మారిపోవడంతో ఏపీ సీఎం జగన్ తో ఆయన ముందస్తు భేటీకి సంబంధించిన అప్పాయింట్ రద్దైంది. అందుకే జగన్ తన పర్యటన రద్దు చేసుకున్నారని తెలుస్తోంది. ఏపి సీఎంతో సమావేశం ఎందుకు రద్దైంది అన్న ప్రశ్నకు కేంద్ర వర్గాలు ఈ సమాధానాన్నే చెప్పుకొచ్చాయి. ఐతే అసలు మతలబు వేరే ఉందనే చర్చ కూడా జరుగుతోంది.

ఏపిలో జరగుతున్న పరిణామాలను ఫోన్ లో తెలుసుకున్న కేంద్రం.. మళ్లీ ఎప్పుడు ఉంటుందో ఖరారు కానీ భేటీ..

ఏపిలో జరగుతున్న పరిణామాలను ఫోన్ లో తెలుసుకున్న కేంద్రం.. మళ్లీ ఎప్పుడు ఉంటుందో ఖరారు కానీ భేటీ..

ఇదిలా ఉండగా ఇటీవలే అంటే గత వారమే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి అమిత్ షా ఫోన్ చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల పట్ల కేంద్రానికి వివిధ మార్గాల్లో ఫిర్యాదులు అందిన నేపథ్యంలో కేంద్రం కాస్త గుర్రుగా ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా న్యాయవ్యవస్థ పై జరుగుతున్న పరిణామాలు, కరోనా వైరస్ కేసులు, కేసుల నిర్దారణ కేంద్రానికి అసంతృప్తిని కలిగించినట్టు తెలుస్తోంది. ఇవే అంశాలను స్వయంగా సీఎంతో సంప్రదింపులు జరిపి స్పష్టత తీసుకోవలని ఏపీ సీఎం జగన్ ను ఢిల్లీ పిలిపించారని జాతీయ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే అనేక సమావేశలు, హెక్టిక్ షెడ్యూల్ వల్ల కేంద్ర హోం మంత్రితో ఏపీ సీఎం భేటీ క్యాన్సిల్ అయినట్టు తెలుస్తోంది.

English summary
Amit Shah's schedule suddenly changed due to his appointment with AP CM Jagan. That is why Jagan canceled his tour.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X