• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పవన్ కళ్యాణ్ సూటి ప్రశ్న: రాజు మారితే రాజధాని మారాలా...?

|
  రాజధాని మార్పు గురించి స్పష్టమైన ప్రకటన || AP CM Must Clarify Stance On Amaravati, Says Pawan Kalyan

  ఏపీ రాజధానిని అమరావతి నుండి తరలించే ఆలోచనపై సందిగ్ధత రాజధాని అమరావతి విషయంలో రాష్ట్రంలో ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ కలిగిస్తోంది . ఇక రాజధానిని మార్చటానికి వీలు లేదు అంటూ తమ పార్టీ వైఖరిని చెప్పిన పవన్ కళ్యాణ్ రాజధాని రైతులకు ఇచ్చిన మాట ప్రకారం పవన్ కళ్యాణ్ రాజధానిలో పర్యటిస్తున్నారు. రాజధానిగా అమరావతి కొనసాగింపు విషయంలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆ ప్రాంత రైతుల వద్దకు వెళ్లి వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకున్నారు . ఇక రాజధాని విషయంలో పొలిటికల్ గేమ్స్ ఆడొద్దని , క్లారిటీ ఇవ్వాలని సీఎం జగన్ ను డిమాండ్ చేశారు పవన్ కళ్యాణ్.

  రాజధాని పర్యటనలో నిడమర్రు రైతుల సమస్యలను తెలుసుకున్న పవన్

  రాజధాని పర్యటనలో నిడమర్రు రైతుల సమస్యలను తెలుసుకున్న పవన్

  ఆయన ఇవాళ రాజధాని ప్రాంతంలోని పలు గ్రామాల్లో పర్యటిస్తున్న ఆయన నిడమర్రులో రైతుల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్న పవన్ తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా రైతులు తమ సమస్యలను పవన్ కు ఏకరవు పెట్టారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయం నుంచి పర్యటన ప్రారంభించిన పవన్ రైతుల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకోవాలని నిర్ణయించుకున్న నేపధ్యంలోనే ఆయన నేరుగా రైతుల వద్దకే వెళ్లి వాళ్ళ సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు.

  నిడమర్రు తర్వాత ఆయన కురగల్లు, ఐనవోలు ప్రాంతాల మీదుగా ఎన్ జీవోల కోసం నిర్మిస్తున్న క్వార్టర్లను, హైకోర్టు నిర్మాణాలను పరిశీలించారు .

  ఇసుక కొరతపై టీడీపీ ఉద్యమం ... గృహ నిర్బంధాలు , అరెస్ట్ లతో ఆందోళన పర్వం

  కురగల్లు గ్రామస్థులతో మాట్లాడిన పవన్ .. గోడు వెళ్లబోసుకున్న రైతులు

  కురగల్లు గ్రామస్థులతో మాట్లాడిన పవన్ .. గోడు వెళ్లబోసుకున్న రైతులు

  ఇక పర్యటనలో భాగంగా కురగల్లు గ్రామస్తులతో ఆయన భేటీ అయ్యారు జనసేనాని పవన్ కళ్యాణ్ . అక్కడ రైతులతో మాట్లాడారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటనకు రాజధాని రైతుల నుండి విశేషమైన స్పందన వస్తుంది. తమ గోడు ప్రభుత్వం పట్టించుకోవటం లేదని పవన్ తో ప్రజలు ఏకరువు పెడుతున్నారు. ఇంత వరకు స్పష్టత ఇవ్వలేదని , అందుకే భయాందోళనలో ఉన్నామని చెప్తున్నారు. ఇక ఈ సందర్భంగా రాజధానిపై మంత్రి బొత్స వ్యాఖ్యలు తమను కలవరానికి గురి చేస్తున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. తాము భూములు ఇచ్చింది రాజధాని కోసమని , ఏ ఒక్క పార్టీ కోసం కాదని వారు పవన్ కు తమ గోడు వెళ్ళబోసుకున్నారు.

  రాజధాని తరలింపు జనసేన ఒప్పుకోదు.. జగన్ క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేసిన పవన్ కళ్యాణ్

  రాజధాని తరలింపు జనసేన ఒప్పుకోదు.. జగన్ క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేసిన పవన్ కళ్యాణ్

  ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ, రాజధాని ప్రాంత రైతులకు తాను అండగా ఉంటానని చెప్పారు.

  రాజధాని విషయంలో ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. జగన్ ఈ గందరగోళానికి ఫుల్ స్టాప్ పెట్టాలని అన్నారు. ఒక ప్రకటన చేసి ఈ అనిశ్చితి తొలగించాలని పేర్కొన్నారు. అమరావతిని రాజధానిగా ఉంచుతారా? లేదా? స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు . రాజధానిని పొలిటికల్ గేమ్ గా చూడొద్దన్న పవన్ కళ్యాణ్ రాజధానిని తరలించడానికి జనసేన ఒప్పుకోదని ఆయన పేర్కొన్నారు . రాజధానిపై ప్రకటన చేసేముందు బొత్సా సత్యన్నారాయణ అన్నీ తెలుసుకుని మాట్లాడాలని ఆయన సూచించారు .

  అవసరం అయితే ప్రధాని మోదీ, అమిత్ షాలను కలుస్తా.. బలమైన నిర్ణయాలు తీసుకుంటా అన్న పవన్

  అవసరం అయితే ప్రధాని మోదీ, అమిత్ షాలను కలుస్తా.. బలమైన నిర్ణయాలు తీసుకుంటా అన్న పవన్

  ఇక కొండవీడు వాగు వంతెన పనులను పరిశీలించిన పవన్ కళ్యాణ్ ప్రభుత్వ గందరగోళ నిర్ణయాలతో ఏపీకి మరింత నష్టం చేకూరుతుందని అన్నారు. గందరగోళ నిర్ణయాలతో మరింత నష్టం చేయాలనుకుంటే తాను కూడా బలమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని చెప్పారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలను కలుస్తానని... రాష్ట్రంలోని సమస్యలు, పరిస్థితులను వారికి వివరిస్తానని చెప్పారు. ఇక అలాగే రాజధాని ప్రాంతంలోని సీడ్ యాక్సెస్ రోడ్లు, ఏపీ సచివాలయం, సీఆర్ డీఏ భవనాలు, జడ్జిలు, ప్రజాప్రతినిధుల క్వార్టర్లు తదితర ప్రాంతాల్లోనూ పవన్ పర్యటన సాగుతుంది . చివరగా కొండవీడు ఎత్తిపోతల పథకం సందర్శనతో తన నేటి పర్యటన ముగించనున్నారు. ఇక శనివారం రాజధానిలోని ఆయన పార్టీ కార్యాలయంలో రాజధాని రైతులు, రైతు కూలీలు మరియు ఇతర వర్గాలవారితో పవన్‌ సమావేశం ఏర్పాటు చేసి, రాజధాని ప్రాంత సమస్యలపై కూలంకషంగా చర్చించనున్నారు .

  English summary
  Jana Sena Chief Pawan Kalyan who is in the state capital region Amaravati has questioned the YSRCP government asking them to speak out on the rumours of capital change. Pawan Kalyan has reminded how his party launched a protest in the beginning to object the land acquisition process. Pawan Kalyan said his party will stand to support the concerns of the farmers in the capital region. Jana Sena Chief said his party will continue to protest in the capital region till the farmers' concerns are not fulfilled.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X