అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దర్శకులెందుకు?, సినిమా సెట్టింగులు అనుకుంటున్నావా!: బాబుకు ఐవైఆర్ చురక

రాజధాని నిర్మాణంలో సీఎం చంద్రబాబు వైఖరి నిర్లక్ష్యంగా ఉందన్నారు ఐవైఆర్.

|
Google Oneindia TeluguNews

అమరావతి: ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్‌ కృష్ణారావు ప్రభుత్వంపై తన విమర్శలను కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం నియమించిన హోదాలో ఉంటూనే సర్కారు విధివిధానాలను ఎండగట్టినందుకు అప్పట్లో ఆయనపై వేటు పడిన సంగతి తెలిసిందే.

Recommended Video

World Bank shock to Chandrababu అమరావతికి రుణంపై ప్రపంచ బ్యాంక్ డైలమా? | Oneindia Telugu

ఇక అప్పటినుంచి సీఎం చంద్రబాబు వైఖరి పట్ల ఆయన విమర్శలు చేస్తూనే ఉన్నారు. తాజాగా రాజధాని అమరావతి నిర్మాణం గురించి కూడా ఆయన స్పందించారు. రాజధాని అంటే సినిమా సెట్టింగ్‌ కాదని, ఇబ్బందులు వస్తే నష్టపోయేది ప్రజలే అని గుర్తుచేశారు.

చంద్రబాబుకు ఝలక్: ఎవరీ ఐవైఆర్ కృష్ణారావు?చంద్రబాబుకు ఝలక్: ఎవరీ ఐవైఆర్ కృష్ణారావు?

రాజధాని నిర్మాణంలో సీఎం చంద్రబాబు వైఖరి నిర్లక్ష్యంగా ఉందన్నారు.సరైన ప్లానింగ్‌ లేకపోవడం వల్లే రాజధాని నిర్మాణంలో ఇన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయని విమర్శించారు. రాజధాని నిర్మాణం కోసం రాజమౌళి లాంటి దర్శకులను సంప్రదించడాన్ని కూడా ఆయన తప్పుపట్టారు.

capital city is not like cinema settings iyr slams chandrababu naidu

అసలు రాజధాని నిర్మాణానికి దర్శకులెందుకని సూటిగా ప్రశ్నించారు. ముందు ప్రజలకు ఏం కావాలో తెలుసుకోవాలని ఆయన సూచించారు.

కాగా, రాజధాని డిజైన్ల విషయంలో ప్రభుత్వం ప్రజాధనాన్ని పెద్ద ఎత్తున దుబారా చేస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే జపాన్‌కు చెందిన మకి అసోసియేట్స్‌, లండన్‌కు చెందిన నార్మన్‌ ఫోస్టర్‌ సంస్థ డిజైన్లను చంద్రబాబు తిరస్కరించారు. తొలుత జపాన్ కంపెనీ ఇచ్చిన డిజైన్లను అద్భుతమంటూ పొగిడి ఆపై మాట మార్చేశారు.

చివరకు ఫోస్టర్‌ సంస్థకు సలహాలిచ్చి డిజైన్లు రూపొందించే బాధ్యతను బాహుబలి దర్శకుడు రాజమౌళికి అప్పగించారు. ఆ డిజైన్లు ఎప్పటికి పూర్తవుతాయో!, అమరావతి నిర్మాణం ఎప్పటికి సాకారమవుతుందో కనీసం అంచనా కూడా వేయలేని పరిస్థితి.

English summary
AP govt former chief secretary IYR Krishna Rao slams CM Chandrababu Naidu for delaying capital designs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X