అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

క్యాపిటల్ వార్ .. మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు అరెస్ట్.. వైసీపీ ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి అరెస్ట్

|
Google Oneindia TeluguNews

మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్న ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై రాజధాని ప్రాంత రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనలు చేస్తున్నారు. ఇక రాజధాని రైతుల పోరాటానికి పలు జిల్లాలలో టీడీపీ నేతలు బాసటగా నిలుస్తున్నారు. నిన్నటికి నిన్న కడప జిల్లాలో అఖిలపక్ష సమావేశం నిర్వహించి రాజధానిగా అమరావతినే ఉంచాలని తీర్మానం చేశారు. లేదంటే సెకండ్ ఆప్షన్ గా కడపను రాజధాని చెయ్యాలని కోరారు. ఇక అనంతపురం జిల్లాలో కూడా రాజధాని అమరావతి విషయంలో అఖిల పక్ష భేటీ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.

మూడు రాజధానుల అంశంపై స్పందించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి .. ఏం చెప్పారంటేమూడు రాజధానుల అంశంపై స్పందించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి .. ఏం చెప్పారంటే

ఈ నేపధ్యంలో టీడీపీ నేత, మాజీ మంత్రి నిర్వహించ తలపెట్టిన అఖిల పక్ష సమావేశానికి పోలీసులు అనుమతి నిరాకరించారు. అయినప్పటికీ అఖిల పక్ష సమావేశం నిర్వహించి తీరతామని టీడీపీ నేత, మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు తేల్చి చెప్పారు. పోలీసుల తీరుకు నిరసనగా టీడీపీ నేత కాల్వ శ్రీనివాసులు రోడ్డుపైనే బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. దీంతో అక్కడకి చేరుకున్న పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్‌కి తరలించారు.

Capital war .. former minister kalva srinivasulu arrest ... ycp mla house arrest

ఇక అఖిల పక్ష సమావేశానికి హాజరవుతానని వైసీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ రామచంద్రారెడ్డి కూడా ప్రకటన చేశారు. పోలీసులు అనుమతి ఇవ్వని కారణంగా అఖిల పక్ష భేటీకి ఆయన హాజరు కారాదని వైసీపీ ఎమ్మెల్యే రామచంద్రారెడ్డిని కూడా పోలీసులు హాస్‌ అరెస్ట్ చేశారు. దీంతో ఆ ప్రాంతంలో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. ఎపీలోని చాలా జిల్లాల్లో జగన్ మూడు రాజధానుల నిర్ణయంపై విముఖత వ్యక్తం అవుతుంది. ముఖ్యంగా రాయలసీమ జిల్లాలలో వైజాగ్ రాజధాని నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

English summary
police refused permission for an all-party meeting planned to conduct by TDP leader Kalva Srinivasulu. TDP leader Kalva Srinivasulu protested on the road against the police action. Upon arrival of all party metting . the police arrested him and rushed him to the local police station. YCP MLA and Government Chief Whip Ramachandra Reddy also announced that he will attend an all-party meeting. So, police house arrested him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X