వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీ రాజధాని రగడ .. గ్రేటర్ రాయలసీమ ఇవ్వండి లేదా కర్నూలును తెలంగాణలో కలపండి .. కొత్త డిమాండ్

|
Google Oneindia TeluguNews

ఏపీ సీఎం జగన్ చేసిన ప్రకటన మూడు రాజధానుల అంశంపై ఏపీలో ఇంకా రగడ కొనసాగుతుంది. . ఇక ఇదే సమయంలో రకరకాల డిమాండ్స్ వినిపిస్తున్నాయి. రాయలసీమను రాజధానిగా చెయ్యాలని లేదా రాయలసీమ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇవ్వాలని మొదలైన డిమాండ్ గ్రేటర్ రాయలసీమ వరకు వెళ్ళింది. అటు తమిళనాడు, ఇటు కర్ణాటక, తెలంగాణాల రాష్ట్రాలను తెరమీదకు తెస్తూ వింత వింత ప్రతిపాదనలు వినిపిస్తున్నాయి.

మూడు రాజధానుల అంశంపై స్పందించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి .. ఏం చెప్పారంటేమూడు రాజధానుల అంశంపై స్పందించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి .. ఏం చెప్పారంటే

 రాయలసీమ వాసుల వింత డిమాండ్లు.. రోజుకో ప్రతిపాదన

రాయలసీమ వాసుల వింత డిమాండ్లు.. రోజుకో ప్రతిపాదన

ఒకప్పుడు కర్నూలు రాజధానిగా ఏపీ ఉందని గుర్తు చేస్తున్నారు రాయలసీమ వాసులు . రాయలసీమలో ఒక్క హైకోర్టు మాత్రమే కాదు రాజధాని కావాలని కోరుతున్నారు. ఇక కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గాన్ని కర్ణాటకలో కలిపి బెంగళూరు రాజధాని చెయ్యాలని కూడా మరో డిమాండ్ వినిపించింది . ఇక తాజాగా తెలంగాణా రాష్ట్రంలో కర్నూలు కలిపాలని డిమాండ్ వినిపిస్తుంది.

 గ్రేటర్‌ రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చెయ్యాలని డిమాండ్

గ్రేటర్‌ రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చెయ్యాలని డిమాండ్


రాజధాని రాయలసీమలోనే ఏర్పాటు చెయ్యాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు రాయలసీమ వాసులు. ఒకపక్క అమరావతిలో రైతులు రాజధాని తరలించవద్దు అని ఉద్యమం చేస్తుంటే ఇక రాయలసీమ వాసులు రాజధాని తమ ప్రాంతంలోనే ఏర్పాటు చెయ్యాలని, లేదా ప్రత్యేక రాష్ట్రం కావాలని డిమాండ్ చేస్తున్నారు. గ్రేటర్‌ రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని, లేదంటే కర్నూలు జిల్లాను తెలంగాణలో కలపాలని టీడీపీ నాయకుడు, బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు.

గ్రేటర్ రాయలసీమా కాకుంటే కర్నూలును తెలంగాణలో కలపాలని వాదన

గ్రేటర్ రాయలసీమా కాకుంటే కర్నూలును తెలంగాణలో కలపాలని వాదన


రాయలసీమ ప్రాంతం ఎంతో కాలంగా వెనుకబడి ఉండటం,గతంలో ఏపీ రాజధానిగా కర్నూలు ఉండటం, ఇక రాజధాని రాయలసీమే కావాలని దీనిపై డిమాండ్ ప్రధానంగా వినిపిస్తుంది. .రాజధాని కావాలని ఉత్తరాంధ్రా వాసులు ఎప్పుడు అడగలేదనీ, గతంలో రాయలసీమలోనే రాజధాని ఉండేదని రాయలసీమ వాసులు చెప్తున్నారు. రాయలసీమవాసులు మొదటినుంచి క్యాపిటల్ డిమాండ్ చేస్తున్నారనీ, అడిగినవారికి ఇవ్వకుండా అడగనివారికి ఇవ్వటమేంటి అంటూ మండిపడుతున్న నాయకులు నెల్లూరు, ప్రకాశం జిల్లాలను రాయలసీమలో కలిపి గ్రేటర్‌ రాయలసీమ ఇవ్వాలని, లేదా కర్నూలును తెలంగాణలో కలపాలని డిమాండ్‌ చేశారు.

 గ్రేటర్‌ రాయలసీమ కోసం పార్టీలకతీతంగా ఉద్యమాలు

గ్రేటర్‌ రాయలసీమ కోసం పార్టీలకతీతంగా ఉద్యమాలు

అంతే కాదు రాజధాని అమరావతి అందరికీ అనుకూలమైన ప్రాంతం అని చెప్పి రాజధాని ప్రజలకు న్యాయం చేసి అమరావతిని తరలించవద్దని వారు డిమాండ్ చేస్తున్నారు . గ్రేటర్‌ రాయలసీమ కోసం పార్టీలకతీతంగా ఉద్యమాలను ఉధృతం చేస్తామని తెలిపారు. మొత్తానికి రాయలసీమ వాసులు మాత్రం జగన్ మూడు రాజధానుల ప్రకటన తర్వాత రోజుకో డిమాండ్ వినిపిస్తున్నారు. ఒకరు చెన్నై లో కలిపి తిరుపతి రాజధాని చెయ్యమని అడిగితే, మరొకరు కర్ణాటకలో కలిపి బెంగళూరు రాజధాని చెయ్యమంటున్నారు. ఇక తాజాగా తెలంగాణాలో కలపండి అంటూ కొత్త వాదన తెరమీదకు తీసుకొచ్చారు.

English summary
AP CM Jagan's statement on the topic of three capitals in AP created tensions in AP. At the same time a new argument also came up. Rayalaseema residents are demanding that the capital be established in Rayalaseema itself. They demanded that the districts of Nellore and Prakasam should be merged into Rayalaseema, as Greater Rayalaseema. If that is not possible to merge Kurnool in Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X