వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

777 బోయింగ్‌కు యంగెస్ట్ లేడీ కమాండర్ విజయవాడ 'దివ్య'

30 ఏళ్ళ వయస్సున్న అన్నే దివ్య 777 బోయింగ్ విమానాల్ని నడిపే లేడీ ఆఫీసర్లలో ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కురాలు. అయితే దివ్య బాల్యం మొత్తం విజయవాడలో గడిచింది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

విజయవాడ: 30 ఏళ్ళ వయస్సున్న అన్నే దివ్య 777 బోయింగ్ విమానాల్ని నడిపే లేడీ ఆఫీసర్లలో ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కురాలు. అయితే దివ్య బాల్యం మొత్తం విజయవాడలో గడిచింది.

దివ్య తండ్రి ఆర్మీలో పనిచేసేవాడు. అయితే దివ్య పుట్టింది మాత్రం పఠాన్‌కోట్‌లో. ఉద్యోగరీత్యా ఆమె కుటుంబం విజయవాడలో కొంతకాలం ఉంది.

Captain Anny Divya becomes world's youngest woman commander to fly Boeing 777

విజయవాడలోని కేంద్రీయ విద్యాలయంలో చదువుకొంది. అయిదో తరగతిలో పైలెట్ కావాలని తల్లి చెప్పిన మాటలకు స్పూర్తి పొంది ఆమె పైలెట్‌గా మారింది.

విజయవాడలో పెద్దగా విమానాలను చూడడం కష్టం. అందుకే బాగా కలల్లోకి వచ్చేవి. నా చిన్నప్పటి నుండి విమానం నడిపించడం అనేది ఓ కలగా. లక్ష్యంగా మారిపోయిందంటూ దివ్య చెప్పారు.

Recommended Video

India's youngest woman to fly plane, Know more about her | Oneindia News

విజయవాడలో చదువుకొనే సమయంలో స్కూల్‌కు సరైన బిల్డింగ్‌ కూడ లేదన్నారు. స్కూల్‌కు పెద్ద ప్లేగ్రౌండ్ ఉండేదని ఆమె గుర్తుచేసుకొన్నారు.

పైలెట్ వావాలనే కోరిక అంత ఈజీగా నెరవేరేది కాదు. అయితే పట్టుదలతో దివ్య దాన్ని సాధించింది. ఇంటర్మీడియట్ అయిపోగానే ఎంట్రెన్స్ రాసి, విజయవాడలోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ బ్రాంచిలో చేరింది.

కొన్ని క్లాసులకు కూడ అటెండైంది. కానీ , పైలెట్ కావాలనే కోరిక మాత్రం ఆమె ఆపుకోలేకపోయింది. డాక్టర్, ఇంజనీరో కావాలనే దానికి భిన్నంగా పైలెట్‌గా కావాలనే కోరికను తీర్చుకొంది.

స్వామిజీ ఫ్లయింగ్ స్కూల్ యాడ్ పంపాడు

దివ్య ఇంటికి ఓ రోజు ఓ స్వామిజీ వచ్చాడు. అయితే పైలెట్ కావాలని ఆమె ఆ స్వామిజీని అడిగింది. ఆ విషయాన్ని మరిచిపోయింది. అయితే ఓ రోజు పత్రికలో వచ్చిన ఫ్లయింగ్ స్కూల్ యాడ్ ప్రకటనను స్వామిజీ దివ్యకు పంపాడు.

దీంతో 17 ఏళ్ళ వయస్సులోనే ఇందిరాగాంధీ రాష్ట్రీయ ఉరాన్ అకాడమీలో చేరినట్టు దివ్య గుర్తుచేసుకొన్నారు. ఆలిండియాలో పరీక్షపెడితే 34 మంది ఎంపికయ్యారు. అందులో దివ్య కూడ ఒకరు.

2006లో ఫ్లయింగ్ స్కూల్ పూర్తిచేసింది. అప్పటికీ ఆమె వయస్సు 20. బోయింగ్ 737 నడపటానికి శిక్షణ కోసం ఆమె స్పెయిన్ వెళ్ళింది. కొంతకాలం అవి నడిపాక బోయింగ్ 777 నడపాలని కోరిక పుట్టింది. దీనికోసం లండన్‌కు వెళ్ళింది.

ఈ రకం విమానాలు ప్రపంచంలోకెల్లా అతి పెద్ద ట్విన్ జెట్ ఎయిర్‌క్రాఫ్టులు.. వీటిని నడిపేందుకు ప్రత్యేక శిక్షణ అవసరం. ఆమెకెమో డొమెస్టిక్ విమానాలు నడపాలని కోరిక.

కానీ, ఎయిరిండియా ఆమెకు ఎప్పుడూ అంతర్జాతీయ ఫ్లయిట్లను మాత్రమే అప్పగిస్తోంది. అలా ఆమె అమెరికా సహ యూరప్ మధ్య ఆసియా దేశాలకు ప్లైట్లను నడిపిస్తోంది.

ఆమె బలమైన కోరిక నిజం చేసుకొనేలా కుటుంబం సహయాన్ని అందించింది.

బాల్యంలో విజయవాడలో చదువుకొన్న దివ్య 777 బోయింగ్‌కు యంగెస్ట్ లేడీ కమాండర్.
చిన్నతనం నుండి పైలెట్ కావాలనే కోరికను సాధించుకొన్న దివ్య.
ఆమె కోరిక నెరవేరేందుకు కుటుంబం కూడ సహకరించింది.

English summary
Captain Anny Divya, 30, became the world's youngest woman commander to fly a Boeing 777 airplane ever. Born in Pathankot, Divya shifted to Vijayawada, Andhra Pradesh, when she was a kid. Her father is a retired Army official.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X