విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ముఖ్యమంత్రిపై కేసు : ప‌్ర‌భుత్వ మార్పు కోసం యాగం : స‌్వ‌రూపానంద స్వామి సంచ‌ల‌నం

|
Google Oneindia TeluguNews

ఏపి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు పై కేసు పెడ‌తానంటూ విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతీ మహా స్వామి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసారు. తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానంలో వ్య‌వ‌హారాల పై ఆయ‌న సీరియ‌స్ గా స్పందిచా రు. ఏపిలో అవినీతి తారాస్థాయికి చేరింద‌ని..ప్ర‌భుత్వ మార్పు కోసం రాజ శ్యామ‌ల యాగం చేస్తాన‌ని ప్ర‌క‌టించారు.

తితిదే లో పాల‌న అంతా..
విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామి సంచ‌లన విష‌యాలు వెల్ల‌డించారు. తిరుమ‌ల లో వ్య‌వ‌హారాల పై అనేక సంద‌ర్భాల్లో త‌న అభిప్రాయం వ్య‌క్తం చేసిన స్వ‌రూపానంద తాజాగా మరో సారి త‌న అభిప్ర‌యా న్ని వెల్ల‌డించారు. తిరుమల తిరుపతి దేవస్థానం(తితిదే)లో పాలన లోపభూయిష్టంగా మారిందని ధ్వజమెత్తారు.

ఆల యాల భూములు అన్యాక్రాంతం అయ్యాయని, వాటికి సంబంధించిన ప్రతి ఆధారం తన వద్ద ఉందని త్వరలో వాటిని మీడియా ముందు పెడతానన్నారు. తితిదే అధికారులు, ముఖ్యమంత్రిపైన కేసు పెడతానని తెలిపారు. వారిపై కోర్టులో కూడా కేసు వేస్తున్నట్లు ఆయన చెప్పారు.

Case Against Chandrababu naidu..Yagam for Govt Chage : Swaroopananda swamy

ప్ర‌భుత్వ మార్పు కోసం యాగం..
తెలంగాణలో కేసీఆర్‌ అధికారంలోకి రావడానికి కారణం తాను దగ్గర ఉండి నిర్వహించిన రాజశ్యామల యాగమేనని చెప్పుకొచ్చిన స్వ‌రూపానంద ..ఆంధ్రప్రదేశ్‌లో అవినీతి తారస్థాయికి చేరిందని ఆరోపించారు. ప్రభుత్వ మార్పు కోసం త్వరలో ఏపీలో రాజశ్యామల యాగం చేస్తానని తెలిపారు. తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ సైతం త‌న గెలుపు కోసం శార‌దా పీఠంలో స్వ‌రూపానంద రాజ శ్యామ‌ల యాగం చేసార‌ని చెబుతూ..అందు కోస‌మే తాను విశాఖ వెళ్లి ఆ పీఠాన్ని సంద‌ర్శించాన‌ని వివ‌రించారు. తాజాగా వైసిపి అధినేత తిరుమ‌ల ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా స్వ‌రూపానంద తో స‌మావేశ మ‌య్యారు. ఇప్పుడు స్వ‌రూపానంద తిరిగి ఏపిలో ఎన్నిక‌ల స‌మ‌యంలో అధికార మార్పు కోసం యాగం చేస్తాన‌ని చెప్ప‌టం ద్వారా ఈ వ్య‌వ‌హారం సంచ‌ల‌నం గా మారింది.

English summary
Viskaha Sarada peetham Swaroopanandendra Saraswathi swami sensational comments on AP Govt. He announced that he will file case on AP C.M adn TTD Officials in false decisions in TTD. He syas wil conduct Raja Shyamal Yagam for Govt change in AP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X