గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఈ అటెండర్ మామూలోడు కాదు...ఒకే డీడీతో 33 డాక్యుమెంట్లకు రిజిస్ట్రేషన్...

|
Google Oneindia TeluguNews

గుంటూరు జిల్లా:దేశంలో అవినీతి వ్యవస్థీకృతమైపోయిందా?...ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ కరప్షన్ మరింత పెచ్చు మీరిపోయిందా?...అంటే అవుననేట్లుగానే కనిపిస్తున్నాయి వాస్తవాలు...గవర్నమెంట్ ఆఫీసుల్లో అవకాశం దొరికితే చాలు హోదాతో సంబంధం లేకుండా అధికారుల స్థాయి నుంచి అటెండర్ల వరకు అక్రమాలకు తెగబడుతున్న వైనం వ్యవస్థ పోకడలను తేటతెల్లం చేస్తోంది. తాజాగా గుంటూరు జిల్లాలోని ఓ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జరిగిన స్కామ్ ప్రస్తుత ప్రమాదకర పరిస్థితులకు అద్దం పడుతోంది.

రేపల్లె సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో పనిచేసే ఒక అటెండర్ మరో దస్తావేజు లేఖరితో కలసి ఒకే డీడీతో 33 డాక్యుమెంట్లను రిజిస్ట్రేషన్ చేయించిన స్కామ్ ప్రభుత్వ కార్యాలయాల్లో అక్రమాలకు పాల్పడే అవకాశాల పట్ల ఎంత అప్రమప్తతతో మెలగాలో గుణపాఠం చేప్పే తీరులో ఉంది.వివరాల్లోకి వెళితే...

గుంటూరు జిల్లా రేపల్లె లో సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో అటెండర్ గా పనిచేస్తున్న ఒక ఉద్యోగి అదే కార్యాలయం ప్రాంగణంలో దస్తావేజు లేఖరితో కలసి ఒకే ఒక డిడిని అడ్డుపెట్టుకొని సుమారు 10 లక్షలు సంపాదించుకున్నాడు. తద్వారా ప్రభుత్వ కార్యాలయాల్లో అక్రమాలకు పాల్పడటం ఎంత ఈజీనో, గవర్నమెంట్ ఆఫీసుల్లో నిర్లక్ష్యం ఏ స్థాయితో ఉంటుందో కూడా అందరికీ అర్ధం అయేలా చేశాడు.ఇంతకీ జరిగిందేమిటంటే...సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చెయ్యాలంటే దానితో పాటు స్టాంపు డ్యూటీ లేదా రిజిస్ట్రేషన్ ఫీజుల నిమిత్తం నిర్ణీత రుసుముకు సంబంధించి చలానా కానీ, డీడీ కాని జతచేయాల్సి ఉంటుంది.

స్కామ్ ఎలా జరిగిందంటే...సంతకం చేయకపోవడం వల్ల...

స్కామ్ ఎలా జరిగిందంటే...సంతకం చేయకపోవడం వల్ల...

అలా సబ్ రిజిస్ట్రార్ దగ్గరకు ఏదైనా డాక్యుమెంట్‌ వస్తే...దానితో పాటు వచ్చిన చలానా లేదా డీడీపై తాత్కాలిక నంబరు ఒకటి వేసి ఆ సబ్‌రిజిస్ట్రార్‌ సంతకం చేయాలి. అయితే రేపల్లె సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఇందుకు భిన్నంగా డీడీలు రాగానే వాటిని అటెండర్‌కు ఇచ్చి బ్యాంకుకు పంపడం జరిగింది. దీన్నే అవకాశంగా తీసుకొని అక్కడ పనిచేసే అటెండర్‌ అక్రమాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఆ అటెండర్ ఏం చేశాడంటే...ఇలా తన వద్దకు వచ్చిన ఒకే డీడీని ఒకే డీడీని 33 డాక్యుమెంట్లకు జత చేసి రిజిస్ట్రేషన్ పని పూర్తిచేయించినట్లు తెలుస్తోంది. ఇందుకు ఒక డాక్యుమెంట్ రైటర్ సహకరించినట్లు వెల్లడయింది. ఆ డాక్యుమెంట్ రైటర్ తన వద్దకు రాతకోతల కోసం వచ్చే వారిని ఈ అటెండర్ వద్దకు పంపి తద్వారా ఈ కుంభకోణానికి పాల్పడ్డారని తెలిసింది.

ఆ నిబంధనే...అనువుగా మలుచుకొని...

ఆ నిబంధనే...అనువుగా మలుచుకొని...

అయితే అటెండర్ ఒకే డీడీతో ఈ కుంభకోణానికి ఎలా పాల్పడ్డాడంటే...డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్‌కు నిర్దేశిత స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ ఫీజులు ప్రభుత్వానికి చెల్లించే క్రమంలో ఆ రుసుమును డీడీ రూపంలో కాకుండా చలానా తీస్తే...దాని వివరాలు వెంటనే ఆన్ లైన్ లో సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలోని కంప్యూటర్‌లో కనిపిస్తాయి. అదే డిమాండ్‌ డ్రాప్ట్‌ అయితే దాని ధ్రువీకరణకు ఒక రోజు పడుతుంది. కాబట్టి ఈ అంశాన్నే అటెండర్ తన అక్రమానికి అనువుగా మలుచుకున్నాడు. అయితే ఈ పద్దతిలో అయినా బ్యాంకు నుంచి ఆ డిడి ధృవీకరణ అయి వచ్చేవరకు రిజిస్ట్రేషన్ చెయ్యకూడదు...కానీ ఇక్కడ రిజిస్ట్రేషన్ జరిగిపోయింది...

ఎలా బైటపడిందంటే...తనకు కూడా సహకరించలేదని...

ఎలా బైటపడిందంటే...తనకు కూడా సహకరించలేదని...

అయితే ఈ స్కామ్ ఎలా బైటపడిందంటే...ఇలా తోటి డాక్యుమెంట్ రైటర్, అటెండర్ కలసి ఒకే డీడీతో రిజిస్ట్రేషన్లు కానిచ్చేస్తున్న వైనం మరో డాక్యుమెంట్ రైటర్ కు తెలిసింది. దాంతో అతడు తనకు కూడా అలాగే చెయ్యమని అటెండర్ ని కోరాడు...అయితే అందుకు అటెండర్ ఇలా వ్యవహారం అంతా బైటపడుతుందనో లేక వాటాల వద్ద తేడాలొస్తాయనో...ఎందుకో అతడికి సహకరించేందుకు నిరాకరించాడు. దీంతో ఇంకేముంది. ఈ విషయమై ఉన్నతాధికారులకు ఫిర్యాదు వెళ్లింది.
అలా రిజిస్ట్రేషన్ ఐజీకి ఈ ఫిర్యాదు చేరగా, ఆయన ఆదేశాల అనుసారం విచారణ జరిపిన రిజిస్ట్రార్ కార్యాలయం అధికారులు ప్రాధమికంగా స్కామ్ జరిగినట్లు నిర్థారించారు. దీంతో మరింత లోతుగా ఈ విషయమై విచారణ జరపాలంటూ ఐజీ...గుంటూరు రిజిస్ట్రార్ డీఐజీని ఆదేశించారు. ఇలా అటెండర్ అక్రమంగా సంపాదించిన సొమ్ముమొత్తం సుమారు రూ.10 లక్షలని తేల్చారు.

అన్నీ అనుమానాలే...లోతుగా విచారణ చేస్తే...

అన్నీ అనుమానాలే...లోతుగా విచారణ చేస్తే...

ఈ వ్యవహారం బైటపడటంతో ఆఘమేఘాల మీద స్పందించిన అధికారులు ఆ అటెండర్ నుంచి అతడు స్కామ్ చేసినట్లుగా భావిస్తున్న10 లక్షల రూపాయలు వెంటనే అతని నుంచి వసూలు చేసి, ఆ సొమ్మును ప్రభుత్వ ఖజానాకు జమచేసి తదనంతరం రేపల్లె పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే అధికారులు అంతవేగంగా స్పందించి అటెండర్ తో సొమ్ము కట్టించి తదనంతరం పోలీసు కేసు పెట్టడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తద్వారా ఈ స్కామ్ కు సంబంధించి మరింత లోతుకు పోకుండా, అంటే అవినీతి జరిగిందని భావిస్తున్నమేరా డబ్బు కూడా కట్టేశాడు కాబట్టి అంతటితో విచారణ ముగిసేలా అధికారులు జాగ్రత్త వహిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. విచారణ మరింత లోతుగా జరిగితే ఈ వ్యవహారంతో పాటు మరిన్ని అక్రమాలు వెలుగుచూస్తాయని, లేదా ఇదే వ్యవహారంలో డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ కు సహకరించిన మరికొందరి గుట్టు బైటకు వస్తుందనే భయాలే కారణమంటున్నారు. అయితే నిజంగా ఈ విషయంలో అటెండర్ మాత్రమే సూత్రధారా లేక పాత్రధారి మాత్రమేనా అనేది లోతుగా విచారణ చేస్తే గానీ తెలియదు.

English summary
Guntur: An Attender in the Repalle Sub-Registrar's office created a sensation with his corruption. With a single D.D he made up of 33 documents registration. He collaborated with another document writer for this scam.This scam finally came about due to differences between document writers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X